E-Paper
Advertisement

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!
Advertisement

Hyderabad’s Strange Car Museum: కారు అనగానే.. నాలుగు చక్రాలు, ఇంజిన్, స్టీరింగ్‌ తో ఉండే వెహికల్ గుర్తుకొస్తుంది. కానీ, హైదరాబాద్‌లోని ఓ మ్యూజియంలో మాత్రం వింత వింత కార్లు కనిపిస్తాయి. అసలు కార్లకు ఇలాంటి రూపం కూడా ఉంటుందా? అనే అనుమానం కలుగుతుంది. బర్గర్‌ లా, షూలా, టెన్నిస్ బాల్‌ లా కనిపించే కార్ల నుంచి భారీ పరిమాణంలో ఉండే వాహనాల వరకు ఎన్నో ప్రత్యేకమైన మోడల్స్ కనిపిస్తాయి. కార్లను ఇష్టపడేవారితో పాటు కొత్త విషయాలు చూడాలనుకునేవారిని ఈ ప్రదేశం ఎంతగానో ఆకట్టుకుంటుంది.

హైదరాబాద్‌లో వింత కార్ల ప్రపంచం!

బహదూర్‌పురాలో ఉన్న సుధా కార్స్ మ్యూజియం దేశంలోనే ప్రత్యేకమైన మ్యూజియంగా గుర్తింపు పొందింది. సాధారణ కార్లకు భిన్నంగా, రోజువారీ జీవితంలో కనిపించే వస్తువుల ఆకారాలను వాహనాలుగా మార్చి ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. కారు అనేది కేవలం ప్రయాణానికి ఉపయోగపడే వాహనం మాత్రమే కాదని, దానితో సృజనాత్మకతను కూడా చూపించవచ్చని ఈ మ్యూజియం మోడల్స్ చాటి చెప్తున్నాయి.

బర్గర్ నుంచి షూ వరకు..

Advertisement

మ్యూజియంలోకి అడుగుపెట్టగానే ఒక్కో కారు ఒక్కో రూపంలో కనిపిస్తుంది. బర్గర్ ఆకారంలో ఉన్న కారు, షూ మాదిరిగా రూపొందించిన వాహనం, టెన్నిస్ బాల్ ఆకారపు కారు, కెమెరా రూపంలో ఉన్న కారు సందర్శకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. అంతేకాదు.. పెన్సిల్, వాలీబాల్ వంటి వస్తువుల స్ఫూర్తితో తయారైన వాహనాలు కూడా ఉన్నాయి. మొదట వాటిని చూసినప్పుడు ఇవి నిజంగా కార్లేనా అనే ఆశ్చర్యం కలగడం కామన్.

పరిమాణంలోనూ ఆశ్చర్యమే!

ఇక్కడి ప్రత్యేకత కేవలం ఆకారాలతోనే ఆగిపోదు. భారీ పరిమాణంలో రూపొందించిన వాహనాలు కూడా మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 40 అడుగుల పొడవైన లిమోసిన్ లాంటి భారీ కార్లు, పెద్ద పరిమాణంలో రూపొందించిన ట్రైసైకిళ్లు కార్ల ప్రపంచంలో మరో కోణాన్ని చూపిస్తాయి. కొన్ని మోడల్స్ తమ ప్రత్యేకతతో రికార్డులను కూడా నెలకొల్పాయి. దీంతో ఈ మ్యూజియం హైదరాబాద్‌లోని ఒక ఆసక్తికరమైన పర్యాటక ప్రదేశంగా పేరు తెచ్చుకుంది.

కేవలం బొమ్మలు కాదు.. నడిచే కార్లే!

Advertisement

ఈ కార్లలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇవి కేవలం అలంకరణ కోసం తయారు చేసిన మోడల్స్ కావు. వాటిలో కొన్ని నడిచేలా రూపొందించారు. విచిత్రమైన ఆకారం ఉన్నప్పటికీ ఇంజిన్, చక్రాలు, ఇతర మెకానికల్ వ్యవస్థలను ఉపయోగించి వాటిని పనిచేసేలా తయారు చేయడం వెనుక ఎంతో సృజనాత్మకత, ఇంజనీరింగ్ ఉంది.

ఒక్కసారి చూస్తే ఫిదా కావ్వాల్సిందే!  

కార్లంటే ఆసక్తి ఉన్నవారికే కాకుండా పిల్లలు, కుటుంబాలతో బయటకు వెళ్లాలనుకునేవారికి కూడా సుధా కార్స్ మ్యూజియం ఆకట్టుకుంటుంది. మనం రోజూ చూసే వస్తువులను కారు రూపంలో ఊహిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. హైదరాబాద్‌లోనే ఇన్ని వింత ఆకారాల్లో, భారీ పరిమాణాల్లో కార్లు ఉన్నాయా? అని ఆశ్చర్యపోయేలా చేసే ఈ మ్యూజియం, నగరంలోని ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తోంది.

Read Also: త్వరలో 5 కొత్త CNG కార్ల ఎంట్రీ.. మైలేజీతో పాటు ఫీచర్లు కూడా అదుర్స్!

Tags

Related News

దీపావళికి కారు కొంటున్నారా? ఈ 5 కార్లపై రూ.2.75 లక్షల డిస్కౌంట్లు!

మూడేళ్లకే ముగిసిన కథ.. 2027లో సైబర్‌ ట్రక్‌ ఉత్పత్తి బంద్..

హీరో ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. ధర ఎంత అంటే?

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. కర్వ్ ఈవీపై ఏకంగా రూ.3.35 లక్షల ఆఫర్!

కర్ణాటకలో E20 పెట్రోల్ కల్తీ.. 20 శాతానికి బదులు 31% ఇథనాల్.. ఆధారాలతో బయటపెట్టిన మంత్రి!

మహీంద్రా నుంచి ఒకేసారి 3 కొత్త SUVలు.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

మారుతి కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. గ్రాండ్ విటారాపై ఏకంగా రూ.1.36 లక్షల తగ్గింపు!

బజాజ్ చేతక్ సంచలనం.. 10 లక్షలు దాటిన అమ్మకాలు!

Big Stories

Advertisement
×