E-Paper
Advertisement

ఆటోమేటిక్ కారు కొనాలా? రూ.10 లక్షల్లో బెస్ట్ 10 కార్లు ఇవే!

ఆటోమేటిక్ కారు కొనాలా? రూ.10 లక్షల్లో బెస్ట్ 10 కార్లు ఇవే!
Advertisement

Automatic Cars Under 10 Lakh: దేశంలో ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో, గేర్ మార్చాల్సిన అవసరం లేకుండా సౌకర్యంగా డ్రైవ్ చేయడానికి చాలా మంది ఆటోమేటిక్ కార్లనే ఎంచుకుంటున్నారు. గతంలో ఈ ఫీచర్ ఖరీదైన కార్లలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు రూ.10 లక్షల లోపు కూడా మంచి ఆటోమేటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

సుజుకి ఎస్-ప్రెస్సో

అత్యంత తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ కారు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో VXi (O) AGS. దీని ఎక్స్‌ షోరూమ్ ధర రూ.4.75 లక్షలు. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

మారుతి వాగన్ ఆర్

Advertisement

రెండో స్థానంలో మారుతి వాగన్ ఆర్ VXi AGS ఉంది. దీని ధర రూ.5.97 లక్షలు. 1.0 లీటర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లతో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది.

టాటా టియాగో

టాటా టియాగో ప్యూర్ AMT ధర రూ.6 లక్షలు. ఈ కారు పెట్రోల్‌తో పాటు CNG ఆటోమేటిక్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మారుతి స్విఫ్ట్

Advertisement

మారుతి స్విఫ్ట్ VXi AGS ధర రూ.7.08 లక్షలు. కొత్త 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు మంచి మైలేజ్‌తో పాటు డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తుంది. 9 అంగుళాల టచ్‌స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హ్యుందాయ్ i20

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోరుకునేవారికి హ్యుందాయ్ i20 Magna IVT మంచి ఆప్షన్. దీని ధర రూ.8.13 లక్షలు. ఇందులో CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఉండటం వల్ల AMTతో పోలిస్తే మరింత స్మూత్ డ్రైవింగ్ అనుభవం లభిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్

ఏడు సీట్ల ఫ్యామిలీ కారు కావాలంటే రెనాల్ట్ ట్రైబర్ ఎమోషన్ AMTను చూడవచ్చు. దీని ధర రూ.8.48 లక్షలు. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ AMT గేర్‌ బాక్స్‌ తో వస్తుంది. చిన్న కుటుంబాలకు ఇది సరసమైన MPV.

హోండా అమేజ్

సెడాన్ ప్రియులకు హోండా అమేజ్ V CVT మంచి ఎంపిక. రూ.8.70 లక్షల ధరతో లభించే ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 7-స్టెప్ CVT గేర్‌బాక్స్‌ను అందిస్తుంది. సిటీ డ్రైవింగ్‌ లో ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.

టాటా నెక్సాన్

SUV కొనాలనుకునే వారికి టాటా నెక్సాన్ Smart+ AMT  బెస్ట్. దీని ధర రూ.8.90 లక్షలు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ AMTతో వస్తుంది. భద్రత, ఫీచర్ల పరంగా కూడా నెక్సాన్ మంచి గుర్తింపు పొందింది.

టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్ Pure AMT ధర రూ.7.70 లక్షలు. ఈ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌ లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఉన్నాయి. హై వేరియంట్లలో DCT ఆటోమేటిక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

మహీంద్రా XUV 3XO

ఈ లిస్టులో మహీంద్రా XUV 3XO MX2 Pro AT చివరిది. దీని ఎక్స్‌ షోరూమ్ ధర రూ.9.99 లక్షలు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో పాటు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ ను అందిస్తుంది.

Read Also: టాటా నెక్సాన్ కామో ఎడిషన్ లాంచ్.. వారెవ్వా.. ఏం ఫీచర్లు గురూ!

Tags

Related News

రిలీజ్ కు ముందే కొత్త పల్సర్ 150 లీక్.. డిజైన్‌ అదిరింది భయ్యా!

CNGపై కేంద్రం సంచలన నిర్ణయం.. 2028 నుంచి కొత్త ఇంధన విధానం అమలు!

KTM 390 అడ్వెంచర్ X ధర పెంపు, ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే?

జస్ట్ రూ.99 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

టాటా నెక్సాన్ కామో ఎడిషన్ లాంచ్.. వారెవ్వా.. ఏం ఫీచర్లు గురూ!

టెస్లా, BYDలకు షాక్.. భారత ఈవీలకు ప్రపంచ గుర్తింపు!

తెలుగు రాష్ట్రాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో డబ్బే డబ్బు.. ఇలా చేస్తే చాలు!

Big Stories

Advertisement
×