E-Paper
Advertisement

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!
Advertisement

Hyundai Bayon Bookings Start: హ్యుందాయ్ నుంచి మరో కొత్త SUV మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. బేయాన్ పేరుతో వస్తున్న ఈ మిడ్‌ సైజ్ SUV కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది.  కొనుగోలుదారులు రూ.11,000 టోకెన్ మొత్తంతో ఆన్‌లైన్‌లో లేదంటే సమీపంలోని హ్యుందాయ్ డీలర్‌షిప్‌లో బుక్ చేసుకోవచ్చు. పండుగ సీజన్ లో ఈ SUVను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. వెన్యూ, క్రెటా మధ్యలో స్థానం సంపాదించనున్న బేయాన్.. హ్యుందాయ్ SUVలైనప్‌లో కొత్త ఆప్షన్‌గా నిలవనుంది.

క్రెటా కంటే దిగువన కొత్త SUV!

బేయాన్‌ను క్రెటా కంటే తక్కువ పొజిషన్‌ లో తీసుకురానున్నారు. అయితే, ఇది సాధారణ బాక్సీ SUV మాదిరిగా కాకుండా క్రాసోవర్ రూపంలో ఉండటం విశేషం. పొడవు నాలుగు మీటర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. టెస్టింగ్ సమయంలో ఈ కారు పలుమార్లు కనిపించడంతో పాటు హ్యుందాయ్ విడుదల చేసిన టీజర్ల ద్వారా దీని డిజైన్‌పై ఇప్పటికే కొంత అవగాహన వచ్చింది.

H ఆకారపు DRLs.. ప్రత్యేకమైన లుక్!

Advertisement

ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఆకట్టుకునేలా ఉంది. పైభాగంలో H ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉండగా, ప్రధాన హెడ్‌ ల్యాంప్‌ లను బంపర్‌ పై ఏర్పాటు చేశారు. కింద భాగంలో స్కిడ్ ప్లేట్ SUVకు మరింత దృఢమైన లుక్ ను ఇస్తుంది. సైడ్ ప్రొఫైల్‌ లో పైకి ఎగబాకే విండో లైన్, C పిల్లర్ దగ్గర ప్రత్యేకమైన డిజైన్ కనిపిస్తుంది. సాధారణ పుల్ టైప్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్, వెడల్పైన వీల్ ఆర్చ్‌ లు కూడా ఉంటాయి. వెనుక భాగంలో ముందు DRLsకు అనుసంధానంగా కనిపించే సన్నని LED లైట్ బ్యాండ్, రూఫ్ స్పాయిలర్ ఉంటాయి.

కొత్త i20 తరహాలో ఇంటీరియర్!

క్యాబిన్ విషయంలో బేయాన్‌ కు కొత్త తరం i20 నుంచి కొన్ని డిజైన్ అంశాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండు కనెక్టెడ్ స్క్రీన్లు ఇంటీరియర్‌ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. డ్యాష్‌ బోర్డ్ మధ్యలో ఫిజికల్ HVAC కంట్రోల్స్‌ తో కూడిన ప్యానెల్, హ్యుందాయ్‌ కి ప్రత్యేకమైన నాలుగు చుక్కల మోటిఫ్‌ తో స్టీరింగ్ వీల్, నిలువు AC వెంట్స్ లాంటి అంశాలు ఇందులో కనిపించనున్నాయి. సౌకర్యం, కనెక్టివిటీ, భద్రతకు సంబంధించిన ఫీచర్లను కూడా ఇందులో అందించే అవకాశం ఉంది.

1.5 లీటర్ ఇంజిన్.. CNG కూడా!

Advertisement

బేయాన్‌లో 1.5-లీటర్, నాలుగు సిలిండర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. దీనికి మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే ఇంజిన్ క్రెటాలో కూడా ఉంది. అయితే, బేయాన్‌లో దీని ట్యూనింగ్ ఎలా ఉంటుందనేది విడుదల తర్వాతే స్పష్టమవుతుంది. దీనిలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్‌ తో కూడా బేయాన్‌ ను అందించే అవకాశం ఉంది. ట్యాంక్‌ను అండర్‌బాడీలో అమర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే నాలుగు మీటర్లకు పైగా పొడవున్న CNG మోడల్‌ను అందించే హ్యుందాయ్ తొలి కారుగా బేయాన్ నిలవవచ్చు.

ధర ఎంత ఉండొచ్చంటే?

బేయాన్ ధర సుమారు రూ.9 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఈ ధరతో వెన్యూ, క్రెటా మధ్య ఖాళీని భర్తీ చేయడంతో పాటు మిడ్‌సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్‌కు మరో కీలక మోడల్‌గా మారే అవకాశం ఉంది. మారుతి సుజుకి విక్టోరిస్, గ్రాండ్ విటారా లాంటి మోడళ్లకు పోటీగా బేయాన్ రానుంది.

Read Also: ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×