E-Paper
Advertisement

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!
Advertisement

BGauss Electric Scooter Sales: భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో బిగాస్ సత్తా చాటుతోంది. 2026 సంవత్సరం కంపెనీకి అత్యుత్తమ క్యాలెండర్ ఇయర్‌గా మారింది. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య తొలి ఎనిమిదిన్నర నెలల్లోనే 32,627 ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది. దీంతో గత ఏడాది మొత్తం అమ్మకాలను ఈ ఏడాది ఇప్పటికే అధిగమించింది. ప్రస్తుత వేగం కొనసాగితే 2026లో 46,000 నుంచి 47,000 యూనిట్ల వరకు విక్రయించే అవకాశం ఉంది.

రెండు నెలల్లో 10 వేలకుపైగా స్కూటర్ల అమ్మకం

జూలై, ఆగస్టు నెలల్లో బిగాస్ అమ్మకాలు దూసుకెళ్లాయి. జూలైలో కంపెనీ 5,560 యూనిట్లు విక్రయించింది. ఇప్పటి వరకు కంపెనీ నమోదు చేసిన అత్యధిక నెలవారీ విక్రయాలు ఇవే కావడం విశేషం. ఆ తర్వాత ఆగస్టులో మరో 5,045 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే రెండు నెలల్లో కలిపి 10,605 స్కూటర్లు కస్టమర్లకు చేరాయి. ఈ వేగంతో కంపెనీ మార్కెట్లో తన ఉనికిని మరింత పెంచుకుంటోంది.

లక్ష యూనిట్ల మైలురాయికి దగ్గరగా!

Advertisement

బిగాస్ 2022 ఆగస్టులో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ మొత్తం రిటైల్ అమ్మకాలు 91,373 యూనిట్లకు చేరాయి. దీంతో లక్ష యూనిట్ల మైలురాయి ఇప్పుడు చాలా దగ్గరలోనే ఉంది. ప్రస్తుత విక్రయాల వేగాన్ని కొనసాగిస్తే ఈ ఏడాదిలోనే ఆ సంఖ్యను దాటే అవకాశం కనిపిస్తోంది.

కొత్త C12 MaxRపై భారీ అంచనాలు

అమ్మకాల జోరుకు తోడు బిగాస్ తన పోర్ట్‌ ఫోలియోను కూడా విస్తరిస్తోంది. తాజాగా C12 MaxR పేరుతో కొత్త ఫ్లాగ్‌ షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను తీసుకొచ్చింది. దీని ఎక్స్‌ షోరూమ్ ధర రూ.1.60 లక్షలు. అయితే, కంపెనీ ప్రకటించిన పరిచయ ధరతో ఇది సుమారు రూ.1.46 లక్షలకు లభిస్తుంది. 4.2kW ఎక్కువ శక్తిని అందించే హబ్ మౌంటెడ్ మోటార్‌తో ఇది 75 కి.మీ  గరిష్ట వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.

178 కిలోమీటర్ల రేంజ్!

Advertisement

C12 MaxRలో 3.8kWh LFP బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 178 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుందని బిగాస్ వెల్లడించింది. Eco, Ride, Sport అనే మూడు రైడింగ్ మోడ్‌లతో పాటు రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి. 5 అంగుళాల TFT డిస్‌ప్లే, కాల్ అలర్ట్స్, వెహికల్ హెల్త్ చెకింగ్, 38 లీటర్ల స్టోరేజ్ లాంటి ఫీచర్లు కూడా ఈ స్కూటర్‌లో ఉన్నాయి.

ఏ మోడల్స్ తో పోటీ పడుతుందంటే?

C12 MaxRతో బిగాస్ నేరుగా ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ ధర పరిధిలో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ రిట్జా లాంటి వంటి మోడళ్లతో పోటీపడుతోంది. ప్రస్తుతం బిగాస్ అమ్ముతున్న RUV 350, Oowah, C12 Max, C12 MaxR మోడళ్ల ధరలు ఎక్కువగా రూ.1 లక్షకు పైగానే ఉన్నాయి. మరోవైపు తక్కువ ధరలో కొత్త మోడళ్లు కూడా మార్కెట్లోకి వస్తుండటంతో కంపెనీకి భవిష్యత్తులో విస్తృత ధరల శ్రేణిలో ఉత్పత్తులు అవసరమయ్యే అవకాశం ఉంది.

Read Also: హోండా నుంచి పవర్‌ ఫుల్ బైక్.. CB500లో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయా?

Tags

Related News

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

హోండా నుంచి పవర్‌ ఫుల్ బైక్.. CB500లో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయా?

డిజైర్ CNG AMT వచ్చేసింది.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే?

త్వరలో 5 కొత్త CNG కార్ల ఎంట్రీ.. మైలేజీతో పాటు ఫీచర్లు కూడా అదుర్స్!

టయోటా కార్లు ఇక మరింత స్టైలిష్.. గ్లాంజా, హైక్రాస్‌ కు అదిరిపోయే లుక్!

Big Stories

Advertisement
×