E-Paper
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!
Advertisement

New Classic 350 Signature White:  రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 35కి  మరో కొత్త కలర్ చేరింది. ఇప్పటికే రెట్రో డిజైన్, క్లాసిక్ లుక్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బైక్ ఇప్పుడు  సిగ్నేచర్ వైట్ రంగులోనూ అందుబాటులోకి వచ్చింది. కొత్త కలర్‌ తో క్లాసిక్ 350 మరింత ప్రీమియం లుక్‌ను సొంతం చేసుకుంది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.2.24 లక్షలుగా నిర్ణయించింది. కంపెనీ ఇప్పటికే క్లాసిక్ 350ని పలు రంగులు, వేరియంట్లలో విక్రయిస్తోంది.

వైట్ కలర్‌తో వైర్ స్పోక్ వీల్స్

సిగ్నేచర్ వైట్ వేరియంట్‌ లో కేవలం రంగు మార్పు మాత్రమే కాకుండా వైర్ స్పోక్ రిమ్స్‌ ను కూడా అందించారు. ఇవి ట్యూబ్ టైర్లతో వస్తాయి. క్లాసిక్ బైక్‌లకు ఉండే సంప్రదాయ లుక్ ను ఇష్టపడే రైడర్లను దృష్టిలో పెట్టుకుని ఈ కాంబినేషన్‌ ను తీసుకొచ్చినట్లు చెప్పొచ్చు. క్లాసిక్ 350లోని ఇతర వేరియంట్లతో పోలిస్తే రంగు, వీల్స్, కొన్ని ఫీచర్ కాంబినేషన్లలోనే తేడాలు కనిపిస్తాయి.

ఇంజిన్‌లో నో ఛేంజెస్

Advertisement

కొత్త సిగ్నేచర్ వైట్ రంగు కోసం బైక్ మెకానికల్‌గా ఎలాంటి మార్పు చేయలేదు. ఇందులో ఇదే 349cc J-సిరీస్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కొనసాగుతోంది. ఇది 20.2hp పవర్, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో పని చేసే ఈ ఇంజిన్‌కు స్లిప్ అసిస్ట్ క్లచ్ కూడా అందుబాటులో ఉంది. అంటే కొత్త కలర్‌ను ఎంచుకునే కస్టమర్లకు ఇంజిన్ పనితీరులో ప్రత్యేకమైన మార్పు ఉండదు.

ఫీచర్లలోనూ అదే ప్యాకేజీ!

క్లాసిక్ 350లో ఇప్పటికే ఉన్న ఫీచర్లనే సిగ్నేచర్ వైట్ వేరియంట్‌లోనూ కొనసాగించారు. LED లైటింగ్, USB C ఛార్జింగ్ పోర్ట్, అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్జస్టబుల్ బ్రేక్, క్లచ్ లీవర్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ కూడా లభిస్తుంది. ఇది రైడర్‌కు టర్న్ బై టర్న్ నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది.

బ్రేకింగ్, వీల్స్ గురించి..

Advertisement

క్లాసిక్ 350లో ముందు, వెనుక డిస్క్ బ్రేకులు ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS భద్రతను పెంచుతుంది. అధికారిక స్పెసిఫికేషన్ల ప్రకారం ముందు 300mm, వెనుక 270mm డిస్క్ బ్రేకులు ఉన్నాయి. బైక్‌కు 19-అంగుళాల ఫ్రంట్, 18-అంగుళాల రియర్ వీల్స్ ఉంటాయి. మొత్తం డిజైన్ మాత్రం క్లాసిక్ 350కు ప్రత్యేకమైన రెట్రో స్టైలింగ్‌ను కొనసాగిస్తుంది.

క్లాసిక్ 350లో మరొక ప్రీమియం ఆప్షన్!

కొత్త సిగ్నేచర్ వైట్ రంగుతో క్లాసిక్ 350 కొనుగోలుదారులకు మరో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఎమరాల్డ్, స్టెల్త్ బ్లాక్, గన్ గ్రే, కమాండో సాండ్, మెడలియన్ బ్రాంజ్ రంగులు ఉన్నాయి. కొత్త సిగ్నేచర్ వైట్ వేరియంట్ మాత్రం ఈ లైనప్‌లో ప్రీమియం ఆప్షన్ గా నిలుస్తోంది. క్లాసిక్ డిజైన్‌ను ఇష్టపడే రైడర్లకు కొత్త కలర్ మరింత ఆకట్టుకునే ఆప్షన్‌గా మారనుంది.

Read Also: హోండా నుంచి పవర్‌ ఫుల్ బైక్.. CB500లో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయా?

Tags

Related News

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

హోండా నుంచి పవర్‌ ఫుల్ బైక్.. CB500లో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయా?

డిజైర్ CNG AMT వచ్చేసింది.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే?

త్వరలో 5 కొత్త CNG కార్ల ఎంట్రీ.. మైలేజీతో పాటు ఫీచర్లు కూడా అదుర్స్!

టయోటా కార్లు ఇక మరింత స్టైలిష్.. గ్లాంజా, హైక్రాస్‌ కు అదిరిపోయే లుక్!

చిన్న కార్లు.. పెద్ద రేంజ్.. ఇండియన్ మార్కెట్ లోకి 5 చౌకైన ఈవీలు!

టాటా ఏరిస్ లాంచ్ డేట్ ఫిక్స్.. కొత్త సెడాన్ మార్కెట్ లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×