E-Paper
Advertisement

కొత్త KTM డ్యూక్ వచ్చేసింది.. లుక్ అదిరింది గురూ!

కొత్త KTM డ్యూక్ వచ్చేసింది.. లుక్ అదిరింది గురూ!
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా మిడిల్‌ వెయిట్ నేకెడ్ బైక్‌ల విభాగంలో మంచి గుర్తింపు పొందిన KTM 790 డ్యూక్ మరింత క్రేజీ అప్‌ డేట్‌ తో న్యూ లుక్ లో మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఈ మోడల్‌కు ఇప్పటి వరకు చేసిన ఇవే పెద్ద అప్ డేట్స్ గా కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా ఎర్గోనామిక్స్, ఛాసిస్, సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్, డిజైన్‌ లో కీలక మార్పులు చేసింది. బైక్ ఇంజిన్‌ లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

ఇంజిన్ గురించి..

కొత్త KTM 790 డ్యూక్‌ లో యూరో 5+ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండే 799సీసీ LC8c ప్యారలల్ ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ నే కొనసాగించారు. ఈ ఇంజిన్ 105 హెచ్‌పీ పవర్, 87 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో 95 హెచ్‌పీ శక్తితో A2 లైసెన్స్‌ కు అనుకూలమైన వెర్షన్‌ ను కూడా అందించనున్నారు. ఈ ఇంజిన్‌ కు 6-స్పీడ్ గేర్‌ బాక్స్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌ ను యాడ్ చేశారు.

Advertisement

ఈసారి బైక్‌ లో అత్యంత కీలకమైన మార్పులు రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మరింత మెరుగు పరిచేలా ఏర్పాట్లు చేశారు. మరింత సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ కోసం కొత్త హ్యాండిల్‌ బార్‌ ను అమర్చారు. అలాగే రైడర్, పిలియన్ ఫుట్‌ పెగ్‌ ల స్థానాలను మార్చడంతో పాటు సీటును కూడా కొత్తగా డిజైన్ చేశారు. కొత్త సబ్‌ ఫ్రేమ్, మార్చిన ట్రిపుల్ క్లాంప్‌ లు, కొత్త ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ తో ఫ్రంట్ వీల్ ఫీడ్‌ బ్యాక్ మరింత మెరుగవుతోందని కంపెనీ వెల్లడించింది.

సరికొత్త డిజైన్..  

డిజైన్ పరంగా కూడా 790 డ్యూక్ పూర్తిగా కొత్త లుక్‌ ను సొంతం చేసుకుంది. KTM 990 డ్యూక్, 1390 సూపర్ డ్యూక్ R మోడళ్ల నుంచి స్ఫూర్తి పొందిన స్టైలింగ్ ఇందులో కనిపిస్తుంది. కొత్త LED హెడ్‌లైట్, సన్నగా కనిపించే బాడీవర్క్, పెద్ద ఫ్రంట్ కౌల్, రీడిజైన్ చేసిన ఫ్యూయల్ ట్యాంక్ బైక్‌ కు మరింత అగ్రెసివ్ లుక్‌ను ఇచ్చాయి. సస్పెన్షన్ వ్యవస్థలో కూడా పలు మార్పులు చేశారు. WP APEX 43 మిల్లీ మీటర్ల అప్‌ సైడ్ డౌన్ ఫోర్క్‌ తో పాటు రియర్ మోనోషాక్‌ ను కూడా అప్‌ డేట్ చేశారు. కంప్రెషన్, రీబౌండ్ డ్యాంపింగ్‌ ను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉండటంతో రైడర్లు తమ అవసరాలకు అనుగుణంగా బైక్‌ ను ట్యూన్ చేసుకోవచ్చు.

Advertisement

బ్రేకింగ్ వ్యవస్థలోనూ కీలక మార్పులు చేశారు. గతంలో ఉన్న J.Juan బ్రేక్ యూనిట్ల స్థానంలో KTM  అభివృద్ధి చేసిన కొత్త WP రేడియల్ బ్రేకింగ్ సిస్టమ్‌ ను అందించింది. ఇది మెరుగైన బ్రేకింగ్ పనితీరు, మరింత కంట్రోల్ ను అందిస్తుంది. అలాగే WP స్టీరింగ్ డ్యాంపర్‌ ను స్టాండర్డ్ ఫీచర్‌ గా ఇచ్చారు. కొత్త పిరెల్లీ డయాబ్లో రోసో IV టైర్లు కూడా బైక్‌కు మెరుగైన గ్రిప్‌ను అందిస్తాయి.

జూలై ఎండింగ్ లో మార్కెట్ లోకి ఎంట్రీ

కొత్త KTM 790 డ్యూక్ ఈ ఏడాది జూలై చివరి నుంచి అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. అయితే, భారత మార్కెట్లో ఈ అప్‌ డేటెడ్ మోడల్‌ ను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై KTM ఇండియా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also: ఒకే ఛార్జ్‌ తో 142 కి.మీ రేంజ్.. తక్కువ ధరలో 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

కియా నుంచి క్యూట్ మినీ ఎలక్ట్రిక్ వ్యాన్.. మార్కెట్లో ఇప్పుడు ఇదే నెంబర్ వన్, ఎందుకంటే?

2 గంటల్లో ఛార్జ్.. 260 కి.మీ రేంజ్.. అదిరిపోయే అవోర్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. జూలై 2026లో టాప్ సెల్లింగ్ కారు ఇదే!

బజాజ్ పల్సర్ N160 లాంచ్.. కొత్త ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

రిలీజ్ కు ముందే కొత్త పల్సర్ 150 లీక్.. డిజైన్‌ అదిరింది భయ్యా!

CNGపై కేంద్రం సంచలన నిర్ణయం.. 2028 నుంచి కొత్త ఇంధన విధానం అమలు!

ఆటోమేటిక్ కారు కొనాలా? రూ.10 లక్షల్లో బెస్ట్ 10 కార్లు ఇవే!

KTM 390 అడ్వెంచర్ X ధర పెంపు, ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×