E-Paper
Advertisement

మారుతీ సుజుకి కీలక నిర్ణయం.. మార్కెట్లోకి చిన్నకారు ‘ఇగ్నిస్’ రానట్టే, కొత్త బుకింగ్‌ తీసుకోని డీలర్లు

మారుతీ సుజుకి కీలక నిర్ణయం.. మార్కెట్లోకి చిన్నకారు ‘ఇగ్నిస్’ రానట్టే, కొత్త బుకింగ్‌ తీసుకోని డీలర్లు
Advertisement

Ignis Car: దేశీయ ఆటోమొబైల్ సెక్టార్‌లో మారుతీ సుజుకి కూడా ఒకటి. అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం కూడా. తాజాగా బడ్జెట్ కారు ఇగ్నిస్ ఉత్పత్తిని నిలిపేసినట్టు వార్తలు వస్తున్నాయి. పంచ్ లాంటి మైక్రో ఎస్‌యూవీల తయారీపై ఆ కంపెనీ ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఉన్నట్లుంది ఇగ్నిస్ ఉత్పత్తి క్లోజ్ చేయడం వెనుక అసలేం జరిగింది?

మారుతీ సుజుకి కీలక నిర్ణయం

Advertisement

భారతదేశంలో మారుతి సుజికి కంపెనీ చిన్నకారు ఇగ్నిస్ ఉత్పత్తిని నిలిపి వేసినట్లు సమాచారం. మార్కెట్ డీలర్ వర్గాలను ఉటంకిస్తూ కార్టోక్ ఈ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ఇగ్నిస్ కార్ల ఉత్పత్తి నెల రోజులకు పైగా నిలిచిపోయింది. ఈ మోడల్ బుకింగ్‌లు కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది. మారుతి వెబ్‌సైట్‌లో ఇగ్నిస్ బుకింగ్‌లకు సంబంధించి ఎలాంటి సమాచారం కనిపించలేదు.

వస్తున్న ఈ వార్తలపై ఆ కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 2017లో ప్రారంభించబడిన ఈ ప్రీమియం అర్బన్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ఇగ్నిస్. మధ్యతరగతిని విపరీతంగా ఆకట్టుకున్న కార్లలో ఇది కూడా ఒకటి. ధర కేవలం రూ. 4.59 లక్షల నుండి రూ.7.80 లక్షల మధ్య ఉండేది. అయితే నగరాల బట్టి ధరల్లో మార్పులు ఉండేవి.

Advertisement

ఆగిన చిన్నకారు ‘ఇగ్నిస్’ ఉత్పత్తి.. కొత్తవాటిపై దృష్టి

ఇగ్నిస్ కారును పట్టణ-మధ్య తరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఉండేది. ఇందులో ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ టెక్నాలజీ కూడా ఉంది. జీఎస్టీ తగ్గింపు తర్వాత కారు ధర రూ. 71 వేల వరకు తగ్గింది. అయినప్పటికీ అమ్మకాల్లో ఎలాంటి జోరు కనిపించలేదు. గతేడాది ఈ నెలలో 3,780 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకాలు దాదాపు 50 శాతం తగ్గిపోయింది.

చివరకు 1,902 యూనిట్లకు పడిపోయంది. ఫలితంగా వినియోగదారులు ఆ కార్లపై చూడలేదని ఆ కంపెనీ భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో చిన్న కార్ల సెగ్మెంట్లో టాటా పంచ్, హ్యూండాయ్ ఎక్స్‌టర్ మోడళ్లు ఉన్నాయి. వాటికి పోటీగా మైక్రో ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజికి కొత్త మోడల్‌ను విడుదల చేయవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్.. ఈ మినహాయింపులు మర్చిపోకండి!

మరోవైపు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ గతేడాది మార్చి 2025లో 1,92,984 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది మార్చి నాటికి 16.72 శాతం పెరిగి 2,25,251 యూనిట్లు చేరినట్టు తెలుస్తోంది. దేశీయంగా వాహనాల అమ్మకాలు 1,66,219 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే 10.27 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×