Best Washing Machines-2026: ఈ రోజుల్లో ప్రతీ ఇంటికి వాషింగ్ మిషన్ తప్పనిసరిగా మారిపోయింది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం గృహిణులకు ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పని. ప్రస్తుతం మార్కెట్లో వందలాది మోడల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ బడ్జెట్‌కు తగినట్లుగా, అత్యాధునిక ఫీచర్లు ఉన్న బెస్ట్ వాషింగ్ మిషన్‌ను ఎంచుకోవడం కాస్త కష్టమైన విషయమే. ఈ నేపథ్యంలో జులై నాటికి రూ.30,000 బడ్జెట్ లో అద్భుతమైన పనితీరును కనబరిచే టాప్ 5 వాషింగ్ మిషన్లను ఈ కథనం లో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.
శాంసంగ్ కంపెనీకి చెందిన ఈ వాషింగ్ మిషన్.. 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇందులో ఉన్న ‘ఇకోబబుల్’ టెక్నాలజీ డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి బట్టల్లోకి త్వరగా చొచ్చుకుపోయేలా చేస్తుంది. తద్వారా తక్కువ నీరు, కరెంట్‌తోనే బట్టలు శుభ్రపడతాయి. బట్టలలోని బ్యాక్టీరియా, కంటికి కనిపించనంతటి మొండి మరకలను సైతం తొలగించడానికి ఇందులో ‘హైజీన్ స్టీమ్ (Hygiene Steam)’ ఇన్-బిల్ట్ హీటర్ సదుపాయం ఉన్నాయి.
నమ్మకానికి, మన్నికకు మారుపేరైన ఎల్‌జీ బ్రాండ్ నుండి వచ్చిన ఈ 7.5 కేజీ వాషింగ్ మిషన్.. మధ్యతరగతి కుటుంబాలకు సరిగ్గా సరిపోతుంది. ఇది ‘స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ’తో పనిచేస్తుంది. ఫలితంగా లోడ్‌కు అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని సర్దుబాటు చేసుకుంటుంది. దీనిలోని ‘టర్బోడ్రమ్ (Turbodrum)’, పల్సేటర్లు ఎదురెదురు దిశల్లో తిరగడం వల్ల బట్టలపై ఉన్న ఎంతటి కఠినమైన మురికినైనా వదిలిస్తాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. బట్టలు మరీ ఎక్కువగా మురికి ఉంటే ఇందులోని ‘ఆటో ప్రివాష్’ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది.
ఎక్కువ మంది సభ్యులు ఉండే కుటుంబాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. దీనిలోని ‘ఓషియానస్ వేవ్ డ్రమ్ (Oceanus Wave Drum)’ డిజైన్.. బట్టలను సమర్థవంతంగా ఉతికేలా చేస్తుంది. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, తక్కువ మురికి ఉన్న బట్టల కోసం ఇందులో ’15 నిమిషాల క్విక్ వాష్’ ఫీచర్ ఉంది. తక్కువ సమయంలోనే బట్టలను ఉతికి ఆరబెట్టడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.
టాప్ లోడ్ కంటే మెరుగైన వాష్ క్వాలిటీ, తక్కువ నీటి వినియోగం కోరుకునే వారికి బాష్ (Bosch) ఫ్రంట్ లోడ్ మెషీన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇందులో ‘AI యాక్టివ్‌వాటర్ (AI ActiveWater)’ టెక్నాలజీ ఉంది. ఇది బట్టల బరువును సెన్స్ చేసి దానికి సరిపడా నీటిని మాత్రమే వాడుకుంటుంది. 15 రకాల విభిన్న వాష్ ప్రోగ్రామ్‌లు ఇందులో ఉండటం విశేషం. అలాగే దీనిలోని ‘స్టీమ్ యాంటీబ్యాక్టీరియల్ టెక్నాలజీ’ ద్వారా బట్టలలోని అలర్జీ కారకాలను, సూక్ష్మజీవులను 99.9% వరకు తొలగిస్తుంది.
Also Read: చన్నీళ్ల స్నానానికి గుడ్‌బై.. రూ. 8 వేల లోపే బెస్ట్ గీజర్లు.. సామాన్యులకు పండగే!
ఉమ్మడిగా జీవించే పెద్ద కుటుంబాలకు ఈ వాషింగ్ మిషన్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. 5 స్టార్ రేటింగ్ ఉన్న ఈ మెషీన్‌లో ‘ఇన్-బిల్ట్ హీటర్’ (In-Built Heater) ఉంది. ఇది నీటిని వేడి చేసి బట్టలపై ఉన్న మొండి, జిడ్డు మరకలను సైతం ఇట్టే వదిలిస్తుంది. దీనిలోని ‘మ్యాజిక్ క్లీన్’ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ వాష్ సైకిల్స్ పెద్ద పెద్ద బెడ్‌షీట్లు, దుప్పట్లను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా క్లీన్‌గా ఉతుకుతాయి.
Also Read: యువతకు BSNL బంపరాఫర్.. సొంత ఊరిలో ఉంటూ.. నెలకు రూ.లక్ష సంపాదించే ఛాన్స్!