E-Paper
Advertisement

పెట్రోల్ ఖర్చుకు చెక్.. మారుతి నుంచి 3 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు వచ్చేస్తున్నాయ్!

పెట్రోల్ ఖర్చుకు చెక్.. మారుతి నుంచి 3 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Maruti’s Future Flex-Fuel Lineup: దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇథనాల్ మిక్స్ డ్ ఇంధనాలు, ముఖ్యంగా E85 లాంటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్స్ ఆటోమొబైల్ రంగంలో కొత్త ఒరవడికి కారణం అవుతున్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన మారుతి సుజుకి కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మూడు ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన కార్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంతకీ ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటి?

ముందుగా ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే తెలుసుకుందాం. సాధారణ పెట్రోల్‌ లో కొంత శాతం ఇథనాల్‌ ను కలిపి తయారు చేసే ఇంధనాన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటారు. ఇథనాల్‌ ను చెరకు, మొక్కజొన్న లాంటి పంటల నుంచి తయారు చేస్తారు. ప్రస్తుతం భారత్‌ లో E20 పెట్రోల్ అందుబాటులో ఉంది. ఇందులో 20 శాతం వరకు ఇథనాల్ ఉంటుంది. భవిష్యత్తులో ఈ శాతాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే E85 లాంటి హై ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. నిజానికి సాధారణ పెట్రోల్ ఇంజిన్లు అధిక ఇథనాల్ మిశ్రమాలను తట్టుకోలేవు. అందుకే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో ఇంజిన్‌ కు కొన్ని ప్రత్యేక మార్పులు చేస్తారు. ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంపులు, ఫ్యూయల్ లైన్లు, ECU వంటి భాగాలను అప్‌ గ్రేడ్ చేస్తారు. అలాగే ఇంధనంలో ఉన్న ఇథనాల్ శాతాన్ని గుర్తించే ప్రత్యేక సెన్సార్‌ ను కూడా అమర్చుతారు.

1.వాగన్ ఆర్‌ ఫ్లెక్స్ ఫ్యూయల్

Advertisement

మారుతి సుజుకి ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో వాగన్ ఆర్‌ ను ప్రదర్శించింది. ఇది ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న వాగన్ ఆర్ ఆధారంగానే రూపొందించారు. బయటకు చూసినప్పుడు పెద్దగా మార్పులు కనిపించవు. కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ బ్యాడ్జింగ్ మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. అవసరమైన సాంకేతిక మార్పులతో ఈ ఇంజిన్ E20 నుంచి E100 వరకు వివిధ ఇథనాల్ మిశ్రమాలపై పనిచేసేలా తయారు చేశారు. ప్రస్తుతం దీనికి E85 ప్రమాణాలకు అనుమతి లభించింది.

2.మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్

మారుతి ఫ్రాంక్స్ కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ లో వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఫ్రాంక్స్ భారత మార్కెట్లో మంచి ఆదరణ పొందింది. కంపెనీ ఐదు లక్షలకు పైగా యూనిట్లను అమ్మింది.  గతంలో జపాన్‌ లో ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్‌ ను మారుతి ప్రదర్శించింది. ఇందులో కూడా అదే 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. వాగన్ ఆర్‌ లో చేసిన మార్పుల మాదిరిగానే ఇందులో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్‌ కు అనుగుణంగా ఇంజిన్‌ను అభివృద్ధి చేశారు.

3.బాలెనో ఫ్లెక్స్ ఫ్యూయల్

Advertisement

ఈ జాబితాలో మరో కారు బాలెనో వచ్చి చేరింది. మారుతి బాలెనో హ్యాచ్‌ బ్యాక్‌ లో కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బాలెనోలో కూడా ఫ్రాంక్స్, వాగన్ ఆర్‌ లో ఉపయోగిస్తున్న అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీంతో ఇప్పటికే అభివృద్ధి చేసిన ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని ఈ కారులో కూడా ఈజీగా అమర్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా మారుతి సుజుకి నుంచి వాగన్ ఆర్, ఫ్రాంక్స్, బాలెనో లాంటి ప్రముఖ మోడళ్లు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also: 3 నిమిషాల్లో 250 కి.మీ రేంజ్.. భారత్‌ లోకి అడుగు పెట్టబోతున్న చౌకైన EV కారు!

Related News

కొత్త ఫీచర్లు.. కొత్త డిజైన్.. ఆగస్టులో వస్తున్న 3 సూపర్ మోడళ్లు ఇవే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ డబుల్ గేమ్.. ఒకవైపు ఈవీలు.. మరోవైపు పెట్రోల్ బైక్‌లు!

నిస్సాన్ టెక్టన్, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు స్టార్ట్.. కస్టమర్లకు తాళాలు అందజేత!

ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌ లో సంచలనం.. అవోర్ నుంచి ఒకేసారి ఏకంగా 3 కొత్త మోడళ్లు లాంచ్!

ఫోన్ టచ్ చేయాల్సిన పనిలేదు.. ఈ హెల్మెట్ అన్నీ చూసుకుంటుంది!

టాటా నుంచి రెండు సూపర్ ఈవీలు.. సఫారీ, అవిన్యా రిలీజ్ ఎప్పుడంటే?

2026 బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల.. ఏ వేరియంట్ కాస్ట్ ఎంతంటే?

మహీంద్రా మాస్టర్ ప్లాన్.. ఒకేసారి 5 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×