E-Paper
Advertisement

Nissan Tecton SUV: జూలై 9న భారత్‌ లోకి నిస్సాన్ టెక్టన్ SUV ఎంట్రీ.. క్రెటాకు ఇక చుక్కలే!

Nissan Tecton SUV: జూలై 9న భారత్‌ లోకి నిస్సాన్ టెక్టన్ SUV ఎంట్రీ.. క్రెటాకు ఇక చుక్కలే!
Advertisement

Nissan Tecton India Launch Confirmed: జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ భారత మార్కెట్లో మరో కొత్త SUVతో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. కంపెనీ కొత్త మిడ్‌సైజ్ SUV టెక్టన్ ను జూలై 9న అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. 2023లో కిక్స్ SUV ప్రొడక్షన్ నిలిపివేసిన తర్వాత, నిస్సాన్ మళ్లీ ఈ సెగ్మెంట్‌ లోకి అడుగుపెడుతోంది.

డస్టర్ ప్లాట్‌ ఫారమ్‌ పై కొత్త SUV!

కొత్త టెక్టన్ SUV ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్ముడవుతున్న రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా రూపొందుతోంది. డస్టర్‌ లో ఉన్న ఇంజన్లు, ఫీచర్లు, టెక్నాలజీలలో చాలా భాగం ఈ కొత్త నిస్సాన్ SUVలో కూడా కనిపించే అవకాశముంది. అయితే, డిజైన్ విషయంలో మాత్రం టెక్టన్ పూర్తిగా భిన్నంగా ఉండనుంది.  టెక్టన్ ముందు భాగం నిస్సాన్ ఫ్లాగ్‌ షిప్ SUV ప్యాట్రోల్ నుంచి స్ఫూర్తి ప్రేరణ పొందింది. పెద్ద గ్రిల్, LED హెడ్‌ ల్యాంప్స్, కనెక్టెడ్ DRLs, క్రోమ్ స్ట్రిప్స్‌ తో ప్రీమియం లుక్  రానుంది. ఇవ్వనున్నారు. బంపర్ కూడా డ్యూయల్ టోన్ డిజైన్‌ తో స్పోర్టీగా కనిపిస్తోంది. సైడ్ ప్రొఫైల్ చూస్తే డస్టర్‌ మాదిరిగానే ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌ లు, స్పెషల్ డోర్ హ్యాండిల్ డిజైన్ కనిపిస్తున్నాయి. కొత్తగా 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ SUVకి ప్రత్యేక గుర్తింపును ఇవ్వనున్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు, రూఫ్ స్పాయిలర్, కొత్త బంపర్ డిజైన్ ఉంటాయి. డస్టర్‌ లో కనిపించే టూ టోన్ టెయిల్‌ గేట్‌ కు భిన్నంగా, టెక్టన్‌లో సింగిల్ టోన్ ఫినిషింగ్ ఇవ్వనున్నారు.

ఆకట్టుకునే ఇంటీరియర్

Advertisement

డస్టర్‌తో పోలిస్తే కొంత డిఫరెంట్ క్యాబిన్ డిజైన్ ఉండొచ్చని సమాచారం. అయితే, ఫీచర్లలో మాత్రం పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఇందులో 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఛార్జర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే పవర్డ్ టెయిల్‌ గేట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా అందించే అవకాశముంది. భద్రత విషయంలో కూడా నిస్సాన్ టెక్టన్‌ కు మంచి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ADAS లాంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు అందించే అవకాశం ఉంది.

ఇంజిన్, ధర వివరాలు

ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే, డస్టర్‌ లో ఉన్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ టెక్టన్‌ లో కూడా వచ్చే అవకాశముంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ స్టాండర్డ్‌ గా ఉండగా, టాప్ వేరియంట్‌ లో DCT ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ కూడా అందించవచ్చు. హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.  ధర విషయానికి వస్తే, టెక్టన్ ధర సుమారు రూ.10.5 లక్షల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లో ఈ SUV హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, వోక్స్ వ్యాగన్ టైగన్ లాంటి మిడ్‌ సైజ్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Advertisement

Read Also: విడుదలకు రెడీ అయిన కొత్త టాటా టియాగో, టియాగో EV.. ఫస్ట్ లుక్ అదిరింది గురూ!

Related News

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×