E-Paper
Advertisement

వెస్పా 80 ఏళ్ల సంబరాలు.. రోమ్ వీధుల్లో 10 వేల స్కూటర్ల సందడి!

వెస్పా 80 ఏళ్ల సంబరాలు.. రోమ్ వీధుల్లో 10 వేల స్కూటర్ల సందడి!
Advertisement

Vespa’s 80th Anniversary: ఇటలీకి చెందిన ప్రముఖ స్కూటర్ బ్రాండ్ వెస్పా 80వ వార్షికోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 10 వేలకుపైగా వెస్పా స్కూటర్లతో రోమ్ వీధుల్లో భారీ ర్యాలీ ఏర్పాటు చేసింది. కొలోసియం, రోమన్ ఫోరమ్ లాంటి చారిత్రక ప్రాంతాల చుట్టూ వేలాది మంది వెస్పా అభిమానులు తమ స్కూటర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుక కోసం యూరప్‌తో పాటు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వెస్పా ప్రేమికులు రోమ్‌కు చేరుకున్నారు. రంగురంగుల స్కూటర్లు, జెండాలు, మ్యూజిక్, నినాదాలతో నగరం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఒకరోజు పాటు రోమ్‌లో వెస్పాల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

1953లో వెస్పాకు గుర్తింపు

1953లో విడుదలైన హాలీవుడ్ చిత్రం “రోమన్ హాలిడే” ద్వారా వెస్పా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో గ్రెగొరీ పెక్, ఆడ్రీ హెప్బర్న్ వెస్పాపై రోమ్ నగరంలో ప్రయాణించిన దృశ్యాలు ఇప్పటికీ ఎంతోమందికి గుర్తుండిపోయాయి. ఆ తర్వాత కూడా అనేక సినిమాల్లో వెస్పా కనిపిస్తూ తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకుంది.  వెస్పా చరిత్ర రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభమైంది. యుద్ధంలో తన విమానాల తయారీ ఫ్యాక్టరీ దెబ్బతినడంతో ఇటలీకి చెందిన పియాజియో సంస్థ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అప్పటి వరకు విమానాలను తయారు చేసిన ఆ సంస్థ, ప్రజలకు తక్కువ ధరలో ఈజీ రవాణా సౌకర్యాన్ని అందించాలనే ఉద్దేశంతో స్కూటర్ల తయారీ ప్రారంభించింది. అలా వెస్పా ప్రస్థానం మొదలయ్యింది.

తొలుత మహిళల కోసం తయారీ

Advertisement

ప్రారంభంలో మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్‌ ను కంపెనీ తయారు చేసింది. నిండైన దుస్తులు ధరించిన మహిళలు కూడా సులభంగా నడపగలిగేలా దీని డిజైన్‌ను తయారు చేశారు. ఆ తర్వాత అన్ని వర్గాల ప్రజల ఆదరణ దక్కించుకుంది.

కనువిందు చేసిన వేలాది వెస్పాలు

రోమ్‌ లో జరిగిన వేడుకల్లో పాత మోడళ్ల నుంచి కొత్త మోడళ్ల వరకు బోలెడు వెస్పాలను ప్రదర్శించారు. కొన్ని స్కూటర్లను పూలతో, బొమ్మలతో అందంగా అలంకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వెస్పా చరిత్రకు సంబంధించిన అరుదైన ఫోటోలు, పాత మోడళ్లను కూడా అభిమానులు ఆసక్తిగా వీక్షించారు. వెస్పా లోగోతో ఉన్న జాకెట్లు, టోపీలు, వాటర్ బాటిళ్లు, గొడుగులు, ప్రత్యేక హెల్మెట్లు కూడా అమ్మకానికి పెట్టారు. “80 ఇయర్స్ ఆఫ్ అన్ ఐకాన్” అనే ప్రత్యేక గుర్తుతో విడుదల చేసిన లిమిటెడ్ ఎడిషన్ హెల్మెట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

పియాజియో నివేదిక ప్రకారం.. 1946 నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల వెస్పా స్కూటర్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం 110 దేశాల్లో ఈ స్కూటర్లు సేల్ అవుతున్నాయి. ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా వెస్పా కేవలం ఒక స్కూటర్ మాత్రమే కాదు, ఒక స్టైల్, ఒక భావోద్వేగం, ఒక ప్రత్యేక గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది.

Read Also: 2028 నుంచి పెట్రోల్,సీఎన్జీ బైక్స్ బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Related News

కొత్త లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650.. ఏమేం మారాయంటే?

మహీంద్రా BE 6 స్పోర్టెక్ విడుదల.. ఫీచర్లు, రేంజ్ చూస్తే మతిపోవాల్సిందే!

భారత్‌లో కొత్త కార్ల హంగామా.. సెప్టెంబర్ నాటికి ఈ 6 కార్లు విడుదల!

రాయల్ ఎన్‌ ఫీల్డ్ హిమాలయన్ 440 లాంచ్ డేట్ ఫిక్స్, ధర రూ.2.50 లక్షలేనా?

రూ.20 లక్షల్లోపే మహీంద్రా కొత్త పికప్.. స్కార్పియో లైఫ్‌ స్టైలర్ ప్రత్యేకతలివే!

హ్యుందాయ్ ఈవీ To న్యూ నెక్సాన్.. 2027లో దుమ్మురేపనున్న కొత్త కాంపాక్ట్ SUVలు ఇవే!

స్కోడా స్లావియా ఫేస్‌ లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్, కొత్త మోడల్ ప్రత్యేకత ఏంటంటే?

326 కి.మీ రేంజ్, అదిరిపోయే ఫీచర్లు.. ఇండియన్ మార్కెట్ లోకి విన్‌ఫాస్ట్ VF5 ఎంట్రీ!

Big Stories

Advertisement
×