E-Paper
Advertisement

విద్యార్థులకు తీపి కబురు.. ఇకపై ప్రతి నెలా రూ.250 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్!

విద్యార్థులకు తీపి కబురు.. ఇకపై ప్రతి నెలా రూ.250 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్!
Advertisement

Fee Reimbursement: తెలంగాణలోని నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), ఈబీసీ (EBC), మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు మోక్షం లభించింది. జూన్ నెలకు సంబంధించి రూ.250 కోట్ల నిధులను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అంతేకాకుండా, విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఇకపై ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.250 కోట్లను ఆయా సంక్షేమ శాఖలకు కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే.. 4 విడతల్లో నగదు జమ!
గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ, ఈసారి నిధుల పంపిణీలో ప్రభుత్వం పారదర్శకమైన విధానాన్ని అవలంబిస్తోంది. విడుదల చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, నేరుగా అర్హులైన విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆర్థిక సాయాన్ని మొత్తం 4 విడతల్లో లబ్ధిదారుల అకౌంట్లలో డిపాజిట్ చేయనున్నారు. దీనివల్ల కాలేజీ ఫీజుల భారం తగ్గి విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించే అవకాశం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

Advertisement

ఆగస్టు 15న కొత్త దరఖాస్తుదారుల అకౌంట్లలోకి పైసలు!
ఇక ఈ ఏడాది కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు సైతం ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వివరాలను వేగంగా పరిశీలించనున్నారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా.. రాబోయే ఆగస్టు 15వ తేదీన వారి ఖాతాల్లో నిధులను డిపాజిట్ చేయనున్నారు. అర్హులైన విద్యార్థులు గడువు ముగిసేలోపు తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంపై విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.

Also Read: భూమిలో పండుతున్న బంగారం.. వరంగల్ జిల్లాలోని ఆ ఆరు ఎకరాల మిస్టరీ ఏంటి?

Related News

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

Big Stories

Advertisement
×