E-Paper
Advertisement

2028 నుంచి పెట్రోల్,సీఎన్జీ బైక్స్ బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

2028 నుంచి పెట్రోల్,సీఎన్జీ బైక్స్ బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Advertisement

Delhi’s New EV Policy: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త EV పాలసీకి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పాలసీ అమల్లోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరగనుంది.

పెట్రోల్,సీఎన్జీ బైక్ లకు గుడ్ బై

ఇక భవిష్యత్తులో పెట్రోల్,సీఎన్జీ వాహనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2027 జనవరి 1 నుంచి ఢిల్లీలో కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. 2028 ఏప్రిల్ 1 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్జీ టూ వీలర్స్ రిజిస్ట్రేషన్‌ ను నిలిపివేయనుంది. ఇందుకోసం ఈవీ పాలసీని తీసుకొచ్చింది. అయితే, హైబ్రిడ్ వాహనాలకు ఈ పాలసీలో ఎలాంటి సబ్సిడీ, ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వడం లేదు. ప్రభుత్వం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టి పెట్టింది.

ఈవీల కొనుగోలుపై ప్రోత్సాహకాలు

Advertisement

ప్రభుత్వం రూపొందించిన కొత్త ఈవీ పాలసీ ప్రకారం రూ.30 లక్షల లోపు ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మాఫీ చేయనుంది. ఈ పాలసీని జూలై 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లభించిన తర్వాతే ఇది అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ విధానం 2030 మార్చి 31 వరకు అమలులో ఉండనుంది.  ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే వారికి గరిష్ఠంగా రూ.30 వేల వరకు సబ్సిడీ అందించనుంది. అలాగే, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు కొనుగోలు చేసే వారికి రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగించే N1 కేటగిరీ ఎలక్ట్రిక్ ట్రక్కులను కొనుగోలు చేసే వారికి రూ.1 లక్ష వరకు ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు పాత BS-IV, అంతకంటే పాత కారును స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేస్తే అదనంగా రూ.1 లక్ష స్క్రాపేజ్ ప్రోత్సాహకాన్ని అందించనుంది.

రూ.15 వేల కోట్ల పెట్టుబడులు

ఈ కొత్త విధానం ద్వారా వచ్చే నాలుగేళ్లలో దాదాపు రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ఢిల్లీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.7 వేల కోట్లను సబ్సిడీల కోసం, మరో రూ.8 వేల కోట్లను ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయనుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడానికి అవసరమైన ఛార్జింగ్ సదుపాయాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఢిల్లీ వ్యాప్తంగా 32 వేల EV ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే సబ్సిడీల కోసం ప్రత్యేక ఆన్‌ లైన్ పోర్టల్‌ ను కూడా ఏర్పాటు చేయనుంది.

Advertisement

Read Also: హ్యుందాయ్ ఇన్‌ స్టర్‌కు క్రేజీ లగ్జరీ వెర్షన్ లాంచ్.. రేంజ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ లాంచ్ 2027 లోనే.. ఎందుకు ఆలస్యమైందంటే?

యమహా నుంచి ప్రీమియం బైక్‌ల జోరు.. భారత్‌లో కొత్త మోడళ్లకు ప్లాన్!

టియాగో To హారియర్.. టాటా ఈవీలన్నింటికీ BaaS ఆప్షన్!

హయబుసా కొత్త వెర్షన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

రెనాల్ట్ ట్రైబర్ టర్బో మైలేజ్ రివీల్.. లీటర్ పెట్రోల్ తో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే?

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!

ట్రైబర్‌ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!

Big Stories

Advertisement
×