Flying Flea C6 in Hyderabad: ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లోకి మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కు చెందిన ఎలక్ట్రిక్ సబ్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీ (Flying Flea) తన ఆపరేషన్స్ ను హైదరాబాద్‌కు విస్తరించింది. బెంగళూరు తర్వాత భారత్‌లో ఈ బ్రాండ్ అందుబాటులోకి వచ్చిన రెండో నగరంగా హైదరాబాద్ నిలిచింది. ప్రస్తుతం ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్‌ను సిటీలోని నాలుగు కస్టమర్ టచ్‌పాయింట్ల ద్వారా అందిస్తోంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.79 లక్షలుగా ఉంది.
హైదరాబాద్‌లో కస్టమర్లకు మరింత చేరువ కావడానికి ఫ్లయింగ్ ఫ్లీ నాలుగు టచ్‌పాయింట్లతో తన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఒక కంపెనీ స్టోర్ ఉండగా, మరో మూడు డీలర్‌షిప్ అవుట్‌లెట్లు ఉన్నాయి. ఈ నెట్‌వర్క్ ద్వారా బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు బ్రాండ్‌కు సంబంధించిన సర్వీసులను పొందవచ్చు. అలాగే బైక్ కొనుగోలు చేసిన తర్వాత సర్వీసింగ్, మెయింటెనెన్స్ లావటి అవసరాలకు కూడా ఈ సెంటర్స్ ఉపయోగపడతాయి.
ఫ్లయింగ్ ఫ్లీ హైదరాబాద్‌లో హబ్ అండ్ స్పోక్ మోడల్ ను అనుసరిస్తోంది. ఈ విధానంలో ఒక మెయిన్ సెంటర్ టెక్నికల్ సపోర్ట్‌ను అందిస్తే, ఇతర కేంద్రాలు సాధారణ సర్వీసింగ్, మెయింటెనెన్స్ బాధ్యతలను చూసుకుంటాయి. ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన కంపెనీ స్టోర్ మెయిన్ టెక్నికల్ హబ్‌గా పనిచేస్తుంది. బైక్‌కు సంబంధించిన ప్రత్యేక సాంకేతిక సమస్యలు, అవసరమైన సపోర్ట్ కోసం ఈ సెంటర్ కీలకం కానుంది. ఇక వనస్థలిపురం, హైటెక్ సిటీ, కొండాపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్పోక్ సెంటర్స్ సాధారణ సర్వీసింగ్, మెయింటెనెన్స్ సేవలను అందిస్తాయి. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసించే కస్టమర్లకు సర్వీస్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ నెట్ వర్క్ ను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఫ్లయింగ్ ఫ్లీ బ్రాండ్ నుంచి అందుబాటులో ఉన్న మోడల్ C6 ఎలక్ట్రిక్ బైక్. హైదరాబాద్‌లో దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.79 లక్షలు. అయితే ఆన్-రోడ్ ధరలో రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ఇతర ఛార్జీలు అదనంగా ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకునేవారు ధరతో పాటు బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఛార్జింగ్ టైమ్, వారంటీ, సర్వీస్ నెట్‌వర్క్ లాంటి అంశాలను కూడా పరిశీలించడం మంచిది. కొనుగోలు చేసే ముందు సంబంధిత స్టోర్‌లో తాజా వివరాలను తెలుసుకోవచ్చు.
ఫ్లయింగ్ ఫ్లీ తన ప్రయాణాన్ని బెంగళూరులో ప్రారంభించింది. అక్కడ కస్టమర్ల నుంచి వచ్చిన స్పందనతో బ్రాండ్ తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటూ ప్రస్తుతం నగరవ్యాప్తంగా 11 టచ్‌పాయింట్లకు చేరుకుంది. బెంగళూరులోని కస్టమర్లు ఈ బైక్‌పై కలిపి లక్ష కిలోమీటర్లకు పైగా ప్రయాణించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఎక్స్ పీరియెన్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ తన ఉనికిని పెంచుకోవాలని కంపెనీ నిర్ణయించింది. కస్టమర్లకు సేల్స్‌తో పాటు సర్వీస్ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా నెట్‌వర్క్‌ను రూపొందించింది.
Read Also: ఫ్లిప్ కార్ట్ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!