E-Paper
Advertisement

ఒకే ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. సింపుల్ ఎనర్జీ నుంచి పవర్‌ ఫుల్ స్కూటర్!

ఒకే ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్..  సింపుల్ ఎనర్జీ నుంచి పవర్‌ ఫుల్ స్కూటర్!
Advertisement

New Simple Ultra Scooter Launched: సింపుల్ ఎనర్జీ భారతీయ ఈవీ మార్కెట్ లోకి మరో క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. ‘సింపుల్ అల్ట్రా’ పేరుతో వినియోగదారులకు పరిచయం చేసింది. అంతేకాదు, ధరను అధికారికంగా ప్రకటించింది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 2.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ మోడల్‌ ను కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలోనే జెన్ 2 శ్రేణిలో భాగంగా పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ స్కూటర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లకు బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

సుదూర ప్రయాణాలకు అనుకూలంగా..

సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ ను సుదూర ప్రయాణాలు చేసే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు.  ఇందులో 6.5kWh సామర్థ్యంతో కూడిన పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఒక ఫుల్ చార్జ్ తో ఈ స్కూటర్ ఏకంగా  400 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధిక రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా సత్తా చాటబోతోంది.

గంటకు 115 కి.మీ వేగం

Advertisement

సింపుల్ అల్ట్రా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 115 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంతే కాకుండా, కేవలం 2.77 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కంపెనీ లైనప్‌ లో ఇప్పటికే ఉన్న సింపుల్ వన్ తర్వాత ఇది రెండవ వేగవంతమైన మోడల్.

ఆకట్టుకునేలా ఫీచర్లు

ఫీచర్ల పరంగా కూడా ఈ స్కూటర్ లేటెస్ట్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇందులో నాలుగు లెవెల్స్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అందించారు. ఇది రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా రైడింగ్‌ ను సురక్షితంగా ఉంచుతుంది. అదనంగా, 7 అంగుళాల టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లే కూడా ఉంది. ఈ స్క్రీన్ ద్వారా రైడ్‌ కు సంబంధించిన సమాచారం, బ్యాటరీ స్టేటస్, నావిగేషన్ లాంటి వివరాలను ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఎలా బుక్ చేసుకోవాలంటే?

Advertisement

సింపుల్ అల్ట్రా స్కూటర్ ను కొనాలనుకునే వారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదంటే సమీప రిటైల్ స్టోర్ల ద్వారా ఆర్డర్ చేయవచ్చు. కొన్ని కీలక నగరాల్లో టెస్ట్ రైడ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వినియోగదారులు స్కూటర్ పనితీరును ముందుగానే ఎక్స్ పీరియెన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సింపుల్ ఎనర్జీకి దేశవ్యాప్తంగా దాదాపు 70 టచ్‌ పాయింట్లు ఉన్నాయి. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై లాంటి మెయిన్ సిటీస్ లో  ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో నాగ్‌ పూర్, రాంచీ, భువనేశ్వర్ లాంటి మరిన్ని నగరాలకు విస్తరించాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంచి రేంజ్, వేగం, ఆధునిక ఫీచర్లతో సింపుల్ అల్ట్రా మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సుదూర ప్రయాణాలకు అనుకూలమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి ఇదో మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: టీవీఎస్ ఐక్యూబ్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా 15,500 తగ్గింపు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×