E-Paper
Advertisement

స్కోడా పీక్ EV వచ్చేసింది.. 28 నిమిషాల్లో ఛార్జింగ్, 647KM రేంజ్!

స్కోడా పీక్ EV వచ్చేసింది.. 28 నిమిషాల్లో ఛార్జింగ్, 647KM రేంజ్!
Advertisement

Skoda Peak Electric SUV Unveiled: స్కోడా గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్ లో కొత్త ఫ్లాగ్‌ షిప్ ఎస్‌యూవీ ‘పీక్’ను అధికారికంగా ఆవిష్కరించింది. పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా రూపొందిన ఈ మోడల్, కంపెనీ పోర్ట్‌ ఫోలియోలో టాప్ పొజిషన్ లో నిలవనుంది. కియా ఈవీ9, హ్యుందాయ్ ఐయోనిక్ 9, వోల్వో ఈఎక్స్90 లాంటి ప్రీమియం ఈ ఎస్‌యూవీలకు ఈ మోడల్ గట్టి పోటీగా మారనుంది. ముఖ్యంగా ఈ వాహనాన్ని భారత మార్కెట్లో కూడా తీసుకురావాలనే ఆలోచనలో స్కోడా ఉన్నట్లు తెలిపింది.

7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో స్కోడా పీక్

స్కోడా పీక్ 7-సీటర్ కాన్ఫిగరేషన్‌ లో అందుబాటులోకి రానుంది. 299 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. చివరి వరుస సీట్లను మడిస్తే ఈ స్థలం 935 లీటర్ల వరకు పెరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 60, 90, 90x అనే మూడు వేరియంట్లలో అందించనున్నారు. ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. బేస్ మోడల్ అయిన 60 వేరియంట్‌లో 63 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 459 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇందులో 204 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేసే సింగిల్ మోటార్‌ను అమర్చారు. 90 వేరియంట్‌లో 91 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. ఇది గరిష్టంగా 647 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఈ మోడల్ 286 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇక టాప్ ఎండ్ 90x వేరియంట్‌లో డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఇది 299 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తూ, 613 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది.

28 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్

Advertisement

పనితీరు పరంగా కూడా పీక్ ఆకట్టుకుంటుంది. 90x వేరియంట్ కేవలం 6.7 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 90 వేరియంట్‌ కు 7.1 సెకన్లు, 60 వేరియంట్‌కు 8.6 సెకన్లు పడుతుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, 91 కిలోవాట్ అవర్ బ్యాటరీని 199 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 28 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. చిన్న బ్యాటరీని 160 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో 27 నిమిషాల్లో ఇదే రేంజ్ ఛార్జ్ చేసే అవకాశం ఉంది.

అదిరిపోయే డిజైన్

దాదాపు 4.9 మీటర్ల పొడవు ఉన్న ఈ ఎస్‌యూవీ, స్కోడా కొత్త  మోడరన్ సాలిడ్  డిజైన్ ప్రకారం రూపొందింది. ముందు భాగంలో ప్రత్యేకమైన టెక్ డెక్ ఫేస్, టీ స్టైల్ ఎల్ఈడీ హెడ్‌ లైట్లు, వెనుక భాగంలో స్లిమ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఆకట్టుకుంటాయి. ఇంటీరియర్‌లో 13.6 అంగుళాల టచ్‌స్క్రీన్, 10 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 16 స్పీకర్ల సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌ రూఫ్, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్లు, డిజిటల్ కీ లాంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 10 ఎయిర్‌ బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, ఆటో పార్క్ అసిస్ట్ లాంటి ఫీచర్లను అందించారు.

సీబీయూ వెర్షన్ లో భారత్ లోకి!

Advertisement

స్కోడా ఇండియా ఈ మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడాన్ని పరిశీలిస్తోంది. ఒకవేళ దేశంలో విడుదలైతే, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ) రూపంలో తీసుకురావొచ్చని సమాచారం. ప్రస్తుతం కియా ఈవీ9కు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: ఇండియన్ మార్కెట్ లోకి స్కోడా కోడియాక్ RS ఎంట్రీ.. లిమిటెడ్ ఎడిషన్ బుకింగ్స్ షురూ!

Related News

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×