Skoda Kodiaq RS Bookings Open: స్కోడా ఆటో ఇండియా తన ఫ్లాగ్ షిప్ ఎస్‌యూవీ కోడియాక్ కు మరింత స్పోర్టీ, పవర్ ఫుల్ వెర్షన్ గా కోడియాక్ RSను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కొత్త మోడల్ కు కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ ను ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, దేశంలో కేవలం 50 యూనిట్లు మాత్రమే అమ్మనుంది. స్కోడా తీసుకొచ్చిన అత్యంత అరుదైన మోడళ్లలో ఇదీ ఒకటిగా నిలవనుంది. ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ.3 లక్షల టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అధికారిక ధరను కంపెనీ త్వరలో ప్రకటించనుంది. లాంచ్ అనంతరం కొద్ది రోజుల్లోనే డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో ఇప్పటివరకు స్కోడా అమ్మిన వాహనాల్లో కోడియాక్ RS అత్యంత పవర్‌ఫుల్ SUVగా నిలుస్తోంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 265 హెచ్‌పీ పవర్, 400 ఎన్ ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ కు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను యాడ్ చేశారు. స్టాండర్డ్ గా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ను అందిస్తున్నారు. పనితీరు పరంగా ఈ SUV కేవలం 6.3 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 231 కిలోమీటర్లు.
కోడియాక్ RS డిజైన్ పరంగా సాధారణ కోడియాక్ మోడల్ తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. గ్లాస్ బ్లాక్ గ్రిల్, ప్రత్యేక RS బంపర్లు, ముదురు రంగు ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్లు,RS బ్యాడ్జింగ్ ను అందించారు. ఈ SUVలో ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లతో కూడిన 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక భాగంలో ఫుల్ విడ్త్ LED లైట్ బార్, కొత్త బంపర్ డిజైన్, RS లోగోలను ఏర్పాటు చేశారు.
స్కోడా కోడియాక్ RSను నాలుగు రంగుల్లో అందుబాటులోకి రానుంది. వెల్వెట్ రెడ్, స్టీల్ గ్రే, మూన్ వైట్, మ్యాజిక్ బ్లాక్, ఇందులో వెల్వెట్ రెడ్ కలర్ మరింత స్పోర్టీ లుక్ ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
కోడియాక్ RS లోపలి భాగం కూడా పూర్తిగా స్పోర్టీ థీమ్ ను కొనసాగిస్తుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ సీట్లు, ప్రత్యేక అప్హోల్స్టరీ, కాంట్రాస్ట్ స్టిచింగ్, ప్రత్యేక ట్రిమ్ ఫినిష్ లను అందించారు. పనితీరుపై దృష్టి పెట్టినప్పటికీ, ఈ SUVలో మూడు వరుసల సీటింగ్ లే అవుట్‌ను కొనసాగించారు. కుటుంబ అవసరాలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ SUVలో 13 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్ లెస్ ఛార్జింగ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే లాంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా కూడా కోడియాక్ RSలో పలు ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 360 డిగ్రీ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, అధునాతన ADAS ఫీచర్లు ఉండనున్నాయి.
Read Also: ఒకే ఛార్జ్ తో 142 కి.మీ రేంజ్.. తక్కువ ధరలో 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!