Upcoming CNG Cars in India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్ల కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాలపై ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలకు కారు ఉపయోగించే వాళ్లు మైలేజీ, మెయింటెనెన్స్ ఖర్చులను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఒకప్పుడు ట్యాక్సీలు, కమర్షియల్ వాహనాలకే ఎక్కువగా పరిమితమైన CNG కార్లకు ఇప్పుడు వ్యక్తిగత కొనుగోలుదారుల నుంచి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను గమనించిన కార్ల కంపెనీలు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG, మెరుగైన ట్యాంక్ ప్లేస్‌మెంట్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ లాంటి ఆప్షన్లపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్న ఐదు CNG కార్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
హ్యుందాయ్ నుంచి రాబోయే బేయాన్ CNGపై మార్కెట్ లో మంచి క్రేజ్ నెలకొంది. వెన్యూ, నెక్ట్స్ జెనరేషన్ క్రెటా మధ్య స్థానంలో ఉండే ఈ మిడ్‌సైజ్ SUVకి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది. క్రెటాలోని 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా CNG వెర్షన్ ను రూపొందించే అవకాశం ఉంది. సుమారు 20-22 కి.మీ మైలేజీ రావచ్చని అంచనా. వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉండగా, ధర సుమారు రూ.11 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.
ఏడు సీట్లతో తక్కువ ధరలో లభించే ట్రైబర్‌కు CNG వెర్షన్ వస్తే కుటుంబ కార్ల విభాగంలో మరో బెస్ట్ ఆప్షన్ గా మారనుంది. ప్రస్తుతం ఉన్న డీలర్ ఫిట్టెడ్ కిట్ కారణంగా బూట్ స్పేస్ తగ్గుతోంది. కొత్త వెర్షన్‌లో ఫ్లోర్ కింద CNG ట్యాంక్‌ను అమర్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంజిన్ విషయంలో ఇంకా స్పష్టత లేదు. 1.0 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో ఏదో ఒకటి ఉపయోగించే అవకాశం ఉంది. మైలేజీ 20-24 కి.మీ ఉండొచ్చని తెలుస్తోంది.
CNGలో కూడా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కోరుకునే వారికి టయోటా గ్లాంజా కొత్త ఆప్షన్ తీసుకురావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం గ్లాంజా CNG మాన్యువల్ గేర్ బాక్స్ తో మాత్రమే అందుబాటులో ఉంది. మారుతి బాలెనోలో CNG AMT రావడంతో, ఈ మోడల్‌కి కూడా ఇదే టెక్నాలజీ వచ్చే అవకాశం ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ AMT గేర్ బాక్స్ ను యాడ్ చేయవచ్చని సమాచారం. ప్రస్తుత CNG వెర్షన్ 30.61 కి.మీ మైలేజీని అందిస్తుండగా, కొత్త వెర్షన్‌లోనూ మంచి కెపాసిటీ ఉంటుందని తెలుస్తోంది.
కియా కూడా ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ CNG కార్లపై పనిచేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోనెట్ CNG వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మారుతి బ్రెజ్జా CNG, టాటా నెక్సాన్ CNGలకు పోటీగా ఉండనుంది.1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్ గేర్‌బాక్స్ ను అందించే అవకాశం ఉంది. మరోవైపు 1.0 లీటర్ టర్బో ఇంజిన్‌ను CNGతో జత చేసే అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేం. మైలేజీ సుమారు 22-24 కి.మీ ఉండొచ్చని తెలుస్తోంది.
స్కోడా తొలిసారిగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కారును తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కైలాక్ మొదటి మోడల్ కావచ్చని సమాచారం. 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా CNG వెర్షన్‌ను రూపొందించే అవకాశం ఉంది. CNGలో పవర్ కొంత తగ్గవచ్చు. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సుమారు 18-20 కి.మీ మైలేజీని ఇచ్చే అవకాశం ఉంది.
Read Also: టయోటా కార్లు ఇక మరింత స్టైలిష్.. గ్లాంజా, హైక్రాస్ కు అదిరిపోయే లుక్!