E-Paper
Advertisement

మోద రాత్రి మూవీలో ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

మోద రాత్రి మూవీలో ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!
Advertisement

Modha Rathri: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన తమిళ కామెడీ డ్రామా చిత్రం ‘మోద రాత్రి’. రాజా కరుప్పసామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో నటుడు భగవతి పెరుమాళ్ ఒక సన్నివేశంలో పట్టుకుని ఉండే ఫోటో వెనుక ఒక అత్యంత భావోద్వేగమైన కథ దాగి ఉంది. ఓ ఇంటర్వ్యూ లో దర్శకుడు రాజా కరుప్పసామి ఆ ఫోటో వెనుక కథను వెల్లడించి అందరినీ కంటతడి పెట్టించారు.

నెరవేరని కొడుకు ఆశయం :

తన తండ్రి బ్రతికున్నప్పుడు ఎలాగైనా ఆయనను సినిమాలో నటింపజేయాలనేది రాజా కరుప్పసామి బలమైన కోరిక. కానీ దురదృష్టవశాత్తూ సినిమా మొదలుకాక ముందే ఆయన తండ్రి మరణించారు. దాంతో తన తండ్రిపై ఉన్న గౌరవంతో, ఆయన జ్ఞాపకార్థం సినిమాలో భగవతి పెరుమాళ్ క్యారెక్టర్ చేతిలో ఉండే ఫోటోగా తన తండ్రి ఒరిజినల్ ఫోటోనే వాడినట్లు దర్శకుడు తెలిపారు. ఇక తండ్రికి ఇచ్చిన ఈ వినూత్న నివాళి ఇప్పుడు సినీ అభిమానుల మనసులను తాకుతోంది.

పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కథ:

Advertisement

మన దేశంలో పిల్లలను గారాబంగా పెంచి, పెళ్లి కాగానే ఒక్కసారిగా పెద్దవాళ్లు అయిపోయినట్లు భావిస్తారు. పెళ్లిని ఒక బాధ్యతగా మార్చేసే ఈ వ్యవస్థపై ‘మోద రాత్రి’ కథ నడుస్తుంది. ఇష్టం లేకపోయినా కుటుంబాల ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకున్న ఒక అసాధారణ జంట మరుదనాయగం (రిషికాంత్), ముత్తుసెల్వి (అనిష్మా అనిల్‌కుమార్) తమ మొదటి రాత్రి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది ఈ చిత్రంలో ఎంతో వినోదాత్మకంగా చూపించారు.

ఆకట్టుకునే కథనం, హాస్యం :

గుడి పూజారి శాపంతో మొదలయ్యే ఈ కథ, నెమ్మదిగా మొదలై ఆ తర్వాత పూర్తిస్థాయి ఆనందయాత్రగా మారుతుంది. పెళ్లి తర్వాత ఆ జంట మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే విషయాన్ని దర్శకుడు రాజా కరుప్పసామి చాలా సహజంగా, రసవత్తరమైన హాస్యంతో తెరకెక్కించారు. ఇక మొదటి భాగంలో కథనం కాస్త తడబడినప్పటికీ, రెండో భాగం నాటకీయంగా, నవ్వులు పూయించేలా సాగుతుంది.

Advertisement

also read:తల్లి కావాలంటే పెళ్లే అవసరమా? వివాహ వ్యవస్థపై శృతిహాసన్ కామెంట్స్!

బాక్సాఫీస్ వద్ద విజయం:

తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజా కరుప్పసామి, ప్రేమ మరియు వివాహం పట్ల నేటి తరం ఆలోచనలను వినోదాత్మక కోణంలో చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఇక నటీనటుల ప్రతిభ, కామెడీ టైమింగ్, మరియు కథలోని భావోద్వేగాలు ఈ సినిమాను మంచి హిట్ చిత్రంగా నిలబెట్టాయి.

సినిమాలో సరదా సన్నివేశాలు, హాస్యం ఎంతగా అలరించాయో, తెర వెనుక దర్శకుడి తండ్రి ఫోటో సీన్ అంతటి భావోద్వేగాన్ని నింపింది. ఇక తొలి ప్రయత్నంలోనే కథతోనూ, వినోదంతోనూ, తండ్రిపై తనకున్న ప్రేమతోనూ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న దర్శకుడు రాజా కరుప్పసామిని ప్రశంసించకుండా ఉండలేము. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా తమిళ్ , తెలుగు , హిందీ భాషల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

తల్లి కావాలంటే పెళ్లే అవసరమా? వివాహ వ్యవస్థపై శృతిహాసన్ కామెంట్స్!

కొంచెం విషమిచ్చి చంపేయండి- పవిత్ర గౌడ!

థియేటర్లో సినిమా చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

చిరు 48 ఇండస్ట్రీ జర్నీ ..పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్ట్ వైరల్!

‘ కాకా’ సెట్ లో ‘చిరు 48ఇయర్స్ ఇండస్ట్రీ’ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

తెల్ల కాగితం’ ట్రైలర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ఎమోషనల్ లవ్ డ్రామా!

బాలయ్య వాయిస్ తో ‘డోంట్  ట్రబుల్  ద ట్రబుల్’ ట్రైలర్ రిలీజ్!

Big Stories

Advertisement
×