E-Paper
Advertisement

సెకెండ్ హ్యాండ్ కార్లలో ఈ MPVకే ఎక్కువ డిమాండ్.. 5 ఏళ్ల తర్వాత కూడా ధర తగ్గదు!

సెకెండ్ హ్యాండ్ కార్లలో ఈ MPVకే ఎక్కువ డిమాండ్.. 5 ఏళ్ల తర్వాత కూడా ధర తగ్గదు!
Advertisement

Used Car Market 2026: కొత్త కారు కొనేటప్పుడు చాలా మంది మైలేజ్, ఫీచర్లు, ధర మాత్రమే చూస్తారు. కానీ, భవిష్యత్తులో ఆ కారును అమ్మితే ఎంత ధర వస్తుందనే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే, సెకెండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌ లో అదే ముఖ్యమైన విషయం. తాజాగా విడుదలైన ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో MPV సెగ్మెంట్‌ లో మారుతి ఎర్టిగా బెస్ట్ రీసేల్ వ్యాల్యూను కలిగిన కారుగా నిలిచింది. దేశంలోని ప్రముఖ ప్రీ ఓన్డ్ కార్ల ప్లాట్‌ ఫామ్ స్పిన్నీ   అమ్మకాల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో ఐదేళ్ల పాటు వాడిన తర్వాత ఏ కారు ఎంత వ్యాల్యూను కలిగి ఉంటుందో  విశ్లేషించారు. 2025లో సెకెండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు.

ఐదేళ్ల తర్వాత కూడా ఎర్టిగా టాప్..

మారుతి ఎర్టిగా ఐదేళ్ల తర్వాత కూడా తన విలువను అలాగే నిలుపుకుంది. కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత సాధారణంగా ప్రతి వెహికల్ వ్యాల్యూ నెమ్మదిగా తగ్గుతుంది. అయితే, ఎర్టిగా విషయంలో ఈ తగ్గుదల ఇతర MPVలతో పోలిస్తే తక్కువగా ఉండటం విశేషం. అందుకే సెకెండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌ లో కూడా ఈ మోడల్‌కు మంచి డిమాండ్ కొనసాగుతోంది.

ఏ కార్ల వ్యాల్యూ ఎక్కువగా పడిపోయిందంటే?

Advertisement

మరోవైపు, ఎర్టిగా ఆధారంగా రూపొందించిన మారుతి XL6 మాత్రం రీసేల్ వ్యాల్యూ తగ్గుదల విషయంలో కొంత వెనుకబడింది. ఐదేళ్ల తర్వాత ఈ మోడల్ రీసేల్ ధర ఎర్టిగాతో పోలిస్తే మరింత తగ్గినట్లు అధ్యయనం చెబుతోంది. ఇక రెనాల్ట్ ట్రైబర్ విషయానికి వస్తే, ఈ కారు వ్యాల్యూ అత్యధికంగా పడిపోయిన MPVలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా AMT వేరియంట్లలో ధర మరింత తగ్గినట్లు గుర్తించారు. అంటే, వాడిన ట్రైబర్ కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం ఈ అంశం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ, కొత్త కారు కొనేవారు భవిష్యత్తు రీసేల్ విలువను కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఈ అధ్యయనంలో టయోటా ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ వంటి మోడళ్లను చేర్చలేదు. వాటికి సంబంధించిన వాడిన కార్ల లావాదేవీల డేటా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించారు.

సగటు కార్ల రీసేల్ వ్యాల్యూ ఎంత?

తాజా గణాంకాలను పరిశీలిస్తే, ఐదేళ్ల పాత MPV సగటు విక్రయ ధర రూ.7.47 లక్షలుగా నమోదైంది. మూడేళ్ల పాత MPV సగటు ధర రూ.10.50 లక్షలు, ఒక సంవత్సరం పాత MPV సగటు ధర రూ.11.16 లక్షలుగా ఉంది. వాహనం వయసు పెరిగే కొద్దీ ధర తగ్గడం సహజమే అయినప్పటికీ, కొన్ని మోడళ్లు మాత్రం తమ విలువను బాగా నిలబెట్టుకుంటున్నాయి. భవిష్యత్తులో కారు అమ్మాలనే ఆలోచన ఉంటే, మారుతి ఎర్టిగా లాంటి మంచి రీసేల్ విలువ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మంచిది.

Advertisement

Read Also: వారెవ్వా.. సింగిల్ ఛార్జ్‌ తో 520 కి.మీ ప్రయాణం.. కియా సైరోస్ EV బ్యాటరీ, రేంజ్ లీక్!

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×