E-Paper
Advertisement

Triumph 350cc Bike: యూత్ డ్రీమ్ బైక్.. ట్రయంఫ్ 350సీసీ బైక్స్, మళ్లీ ధర పెంపు, ఈసారి ఎంతంటే..

Triumph 350cc Bike: యూత్ డ్రీమ్ బైక్.. ట్రయంఫ్ 350సీసీ బైక్స్, మళ్లీ ధర పెంపు, ఈసారి ఎంతంటే..
Advertisement

Triumph 350cc Bike: దేశీయ మార్కెట్లో రకరకాల బైక్స్ దర్శినమిస్తున్నాయి. ఒకప్పుడు బ్రాండ్‌ని పరిశీలించి వాహనాలు కొనుగోలు చేసేవారు. ఇదంతా ఒకప్పటి మాట. ట్రెండ్ మారింది.. కొత్త బైక్స్‌ మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. అలాంటి వాటిలో యూత్ డ్రీమ్ బైక్ ట్రయంఫ్‌ 350 సీసీ ఒకటి. ఈ బైక్ మీద అలా గాళ్ ఫ్రెండ్ తీసుకుని వెళ్తే ఆ మజాయే వేరు.

యూత్ డ్రీమ్ బైక్.. ట్రయంఫ్ 350సీసీ బైక్స్: తాజాగా ఈ బైక్స్ ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్‌లో ఈ సిరీస్ బైక్స్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది ఆ కంపెనీ. తొలుత జూన్‌లో ఒకసారి ధరలు పెంచింది. నెల గడవకముందే తాజాగా మరోసారి రేట్లు సవరించింది. ఈ క్రమంలో కొత్త బైక్‌ కొనాలనుకునేవారు కాసింత ఆలోచనలో పడ్డారు.

Advertisement

బ్రిటన్‌కు చెందిన ప్రీమియం మోటార్‌ సైకిల్‌ తయారీ సంస్థ ట్రయంఫ్‌. 125 ఏళ్ల కిందట అంటే 1902లో ప్రారంభించారు. ఆ కంపెనీ ట్రెండ్ కు తగ్గట్టుగా యూత్‌ని ఆకట్టుకుంటూ రకరకాల మోడల్స్ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా స్పోర్ట్స్‌, అడ్వెంచర్‌, క్లాసిక్‌ శైలి బైక్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చింది.

ట్రయంఫ్ బైక్స్ ధరల పెంపు: భారత్‌లో ట్రయంఫ్‌ తన బైక్‌లను బజాజ్‌ ఆటో భాగస్వామ్యంతో తయారు చేసి మార్కెట్లోకి దించింది. ముఖ్యంగా స్పీడ్‌-400, స్క్రాంబ్లర్- 400 ఎక్స్‌ వంటి మోడళ్లను బజాజ్‌తో కలిసి తయారు చేసింది. ట్రయంఫ్‌ 350 సీసీ ఇంజిన్‌ బైక్స్‌ని ఏప్రిల్‌లో విడుదల చేసింది. కేవలం 18 శాతం జీఎస్‌టీతో వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

ప్రారంభంలో ఆయా బైక్స్ ధరను పెద్దగా పెంచకుండా సామాన్యుడికి అందుబాటులో ఉంచింది. జూన్‌లో స్పీడ్‌- టీ4, స్పీడ్‌- 400, స్క్రాంబ్లర్‌-400 ఎక్స్‌సీ, త్రక్స్‌టన్‌-400 ధరలను పెంచేసింది. లేటెస్ట్‌గా జూలైలో 350 సీసీ శ్రేణిలోని అన్ని మోడళ్ల ధరలను మరోసారి సవరించింది. ఈసారి పెంపు 1.22 నుంచి 5.03 శాతం వరకు పెరగనున్నాయి.

రూ. 3 నుంచి 10 వేల వరకు పెంపు: అన్ని మోడళ్లలో స్పీడ్‌ టీ4 ధర అధికంగా పెరిగింది. దీనిపై దాదాపు రూ.10 వేల పెంచారు. ఇప్పుడు ఆ బైక్ ధర రూ.1.99 లక్షల నుంచి రూ.2.09 లక్షలకు చేరింది. విడుదలైనప్పుడు ధరతో పోలిస్తే దాదాపు రూ.14 వేలు ఎక్కువ. స్పీడ్‌ 400 బైక్ గురించి చెప్పనక్కర్లేదు. రూ.2.34 లక్షల నుంచి రూ.2.40 లక్షలకు పెంచింది.

ALSO READ: మారుతి, మహీంద్రాకు షాక్.. టాప్‌ లో టాటా పంచ్!

ఇక ట్రాకర్‌ 400 ధర అన్నింటి కంటే తక్కువగా రూ.3 వేల వరకు పెంచారు. ధర రూ.2.46 లక్షల నుంచి రూ.2.49 లక్షలకు చేరిందన్నమాట. స్క్రాంబ్లర్‌-400 ఎక్స్‌ ధర రూ.2.59 లక్షల నుంచి రూ.2.65 లక్షలకు చేరింది. త్రక్స్‌టన్‌-400 ధర రూ.2.70 లక్షల నుంచి రూ.2.75 లక్షలకు, స్క్రాంబ్లర్‌-400 ఎక్స్‌సీపై రూ.5 వేల పెంపుతో దాదాపు రూ.2.99 లక్షలకు చేరింది.

Related News

కారు విండోకి తెల్లటి గుడ్డ.. ఇది దేనికి సంకేతం? ఒకవేళ కనిపిస్తే ఏం చేయాలి?

బ్రెజిల్‌ లో E32 ఫ్యూయెల్ వాడుతున్నారు.. మరి భారత్‌లో E20పై ఎందుకింత భయం?

యాక్సర్ నుంచి కాస్ట్లీ హెల్మెట్ లాంఛ్, ధర ఎంతో తెలుసా?

సింగిల్ ఛార్జ్ తో 520 కి.మీ రేంజ్.. BYD క్రేజీ సీలయన్ 7 వచ్చేసింది!

లగ్జరీ కార్లే టార్గెట్.. వీళ్లు కొట్టేసే ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

హ్యుందాయ్ మళ్లీ బాదుడు.. ఈసారి ఎంత ధర పెరిగిందంటే?

సింగిల్ ఛార్జ్ తో 679 కిమీ రేంజ్.. మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మహీంద్రా XEV 9S!

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

Big Stories

Advertisement
×