E-Paper
Advertisement

మే 2026లో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే.. ఎర్టిగా మళ్లీ నంబర్ 1

మే 2026లో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే.. ఎర్టిగా మళ్లీ నంబర్ 1
Advertisement

Best Selling 7 Seaters in May 2026: ఇండియన్ ఆటో మార్కెట్ లో 7-సీటర్ కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, ఎక్కువ ప్రయాణ అవసరాలు ఉన్న వినియోగదారులు SUVలు, MPVలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ మే 2026 అమ్మకాల్లోనూ స్పష్టంగా కనిపించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7-సీటర్ కార్ల మొత్తం అమ్మకాలు దాదాపు 25 శాతం పెరిగాయి. మే 2025లో 71,148 యూనిట్లు అమ్ముడవగా, మే 2026లో ఈ సంఖ్య 88,830 యూనిట్లకు చేరింది. ఈ సెగ్మెంట్‌ లో 24.9 శాతం వృద్ధి నమోదైంది. గత నెలలో అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ 10 మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి ఎర్టిగా

ఈ విభాగంలో మారుతి సుజుకి ఎర్టిగా మరోసారి నెంబర్ 1గా నిలబడింది. మే 2026లో ఎర్టిగా 20,350 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 16,140 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 26.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 7-సీటర్ మార్కెట్లో దాదాపు 23 శాతం వాటాను ఎర్టిగా ఒక్కటే సాధించడం విశేషం.

⦿ మహీంద్రా స్కార్పియో

Advertisement

రెండో స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచింది. స్కార్పియో క్లాసిక్, స్కార్పియో-ఎన్ మోడళ్లకు మంచి డిమాండ్ కొనసాగడంతో మే 2026లో 15,774 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 9.5 శాతం పెరుగుదల కనిపించింది. ఈ SUV ఒక్కటే సెగ్మెంట్‌ లో 17.8 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.

⦿ టయోటా ఇన్నోవా, హైక్రాస్

ఈ రెండు మోడళ్లు కలిపి 10,325 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచాయి. గత ఏడాది కంటే 16.2 శాతం ఎక్కువ అమ్మకాలు నమోదయ్యాయి. MPV సెగ్మెంట్‌లో ఇన్నోవా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

⦿ మహీంద్రా XUV700, XUV7XO

Advertisement

నాలుగో స్థానంలో మహీంద్రా XUV700, XUV7XO మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు మోడళ్ల కలిపి అమ్మకాలు 9,338 యూనిట్లకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే 45.1 శాతం భారీ వృద్ధి నమోదు చేశాయి.

⦿ మహీంద్రా బొలెరో

ఐదో స్థానంలో మహీంద్రా బొలెరో ఉంది. మే 2026లో 8,933 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోల్చితే స్వల్పంగా 0.1 శాతం తగ్గింది.

⦿ కియా కేరెన్స్, క్లావిస్

కియా కేరెన్స్, క్లావిస్ మోడళ్లు కలిపి 6,208 యూనిట్ల అమ్మకాలతో ఆరో స్థానంలో నిలిచాయి. ఇవి గత ఏడాదితో పోలిస్తే 37.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

⦿ మహీంద్రా కొత్త 9S

మహీంద్రా కొత్త 9S మోడల్ 3,502 యూనిట్ల అమ్మకాలు సాధించింది.

⦿ ఫార్చ్యూనర్, రూమియన్

టయోటా ఫార్చ్యూనర్, రూమియన్ కూడా మంచి అమ్మకాలు సాధించాయి. ఫార్చ్యూనర్ 2,905 యూనిట్లు, రూమియన్ 2,119 యూనిట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు ప్రీమియం వెల్‌ ఫైర్ అమ్మకాలు భారీగా పెరిగి 465 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

అటు టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజర్, స్కోడా కోడియాక్ లాంటి మోడళ్ల అమ్మకాలు తగ్గాయి. ముఖ్యంగా కోడియాక్ అమ్మకాలు దాదాపు 30 శాతం పడిపోయాయి.

Read Also: జస్ట్ రూ.4.69 లక్షలకే EV.. BaaS స్కీమ్‌లో అందుబాటులో ఉన్న టాప్ 5 కార్లు ఇవే!

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×