E-Paper
Advertisement

YRF స్పై యూనివర్స్ నుంచి ‘ఆల్ఫా’ టీజర్ అవుట్.. యాక్షన్ మోడ్‌లో అలియా భట్..

YRF స్పై యూనివర్స్ నుంచి ‘ఆల్ఫా’ టీజర్ అవుట్.. యాక్షన్ మోడ్‌లో అలియా భట్..
Advertisement

Alpha Teaser: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచిన ‘YRF స్పై యూనివర్స్’ నుండి మరో పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా రాబోతోంది. అలియా భట్, శర్వరీ వాగ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ‘ఆల్ఫా’ (ALPHA) చిత్ర అధికారిక టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Read also-భారతీరాజా తెలుగులో తీసిన సూపర్ హిట్ సినిమాలు.. మెగాస్టార్‌తో..

Advertisement

ఉత్కంఠ రేకెత్తిస్తున్న టీజర్ కథాంశం

ఒక అమ్మాయి 18వ పుట్టినరోజు నేపథ్యంలో ఈ టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. సాధారణంగా బర్త్‌డే వేడుకలంటే కేక్ కటింగ్స్, గిఫ్ట్స్ ఉంటాయి. కానీ, ఇక్కడ కథ వేరుగా ఉంది. ఆ పుట్టినరోజు నాడే ఆమె తన జీవితంలోనే మొదటి అత్యంత ప్రమాదకరమైన మిషన్‌లోకి అడుగుపెడుతుంది. అందుకోసమే ఆమెకు చిన్నప్పటి నుండి తండ్రి కఠినమైన శిక్షణ ఇస్తాడు. ఒక భారీ భవనంలోని 34వ ఫ్లోర్‌కు వెళ్లి ఒక టాస్క్ పూర్తి చేయడమే ఆమె మొదటి మిషన్.

Advertisement

“ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు.. తోడేలు, గొర్రె. నేను తోడేలును, కాబట్టి నా కూతురు కూడా తోడేలే అవుతుంది” అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్స్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తున్నాయి.

‘ఆల్ఫా’ అంటే ఏమిటి?
భారతదేశ రక్షణ వ్యవస్థ కోసం అత్యంత రహస్యంగా నిర్వహించే ఒక సీక్రెట్ ప్రోగ్రామ్ పేరే ‘ఆల్ఫా’. దేశం కోసం నెక్స్ట్ జనరేషన్ సైనికులను (Next Generation Soldiers) తయారు చేసే ప్రాజెక్ట్ ఇది. అందరికంటే వేగంగా, అత్యంత వీరత్వంతో శత్రువులను తుదముట్టించే ఈ మిషన్‌లో ఉన్న ఏకైక ‘ఆల్ఫా’గా అలియా భట్ కనిపించబోతున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.

Read also-Sapthami Gowda : బీచ్ లో హాట్ అందాలతో రెచ్చగొడుతున్న కాంతార బ్యూటీ.. పిక్స్ వైరల్..

భారీ తారాగణం – అంచనాలు:
‘పఠాన్’, ‘టైగర్’, ‘వార్’ వంటి బ్లాక్‌బస్టర్ స్పై సినిమాల తర్వాత వైఆర్ఎఫ్ (YRF) బ్యానర్ నుండి వస్తున్న మొదటి ఫిమేల్ లీడ్ స్పై ఫిలిం ఇదే కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో సీనియర్ నటుడు అనిల్ కపూర్, వర్సటైల్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Related News

రాజకీయాలపై అక్కినేని కోడలు హాట్ కామెంట్స్!

జిమ్ వర్కౌట్స్ తో ఆశ్చర్యపరుస్తున్న స్టార్ హీరో తల్లి.. ఎవరంటే?

ప్రదీప్ రావత్ జీవితంలో భయంకరమైన రోజు అదే!

తేజెస్వి మదివాడ రియల్ స్టోరీ.. కన్నీళ్లు తెప్పించే ట్విస్టులు..

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!

Big Stories

Advertisement
×