E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

జూలై 2026లో భారత మార్కెట్‌లోకి రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. EV ప్రియులకు పండుగే!

జూలై 2026లో భారత మార్కెట్‌లోకి రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. EV ప్రియులకు పండుగే!
Advertisement

Upcoming EV Cars in India for July 2026: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. జూలై 2026లో కూడా భారత మార్కెట్‌ లోకి పలు క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రీమియం SUVల నుంచి లోకాస్ట్ హ్యాచ్‌ బ్యాక్‌ల వరకు పలు కొత్త మోడళ్లు వినియోగదారుల ముందుకు రానున్నాయి. వాటిలో టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

1.టాటా సియెర్రా EV

ఇండియన్ కార్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో టాటా సియెర్రా EV ఒకటి. ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన సియెర్రాను టాటా మోటార్స్ పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి తీసుకొస్తోంది. ఇది 5-డోర్ల ప్రీమియం SUVగా అందుబాటులోకి రానుంది. ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్లతో ఈ కారు మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీని ధర రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వ్యవస్థ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

2.కియా సైరోస్ EV

Advertisement

కియా సంస్థ కూడా జూలైలో కొత్త ఎలక్ట్రిక్ SUVను విడుదల చేయడానికి సిద్ధమైంది. కియా సైరోస్ EV మాస్ మార్కెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. ఈ కారు ప్రీమియం టెక్నాలజీతో పాటు సరసమైన ధరలో అందుబాటులోకి రానుంది. దీని ధర సుమారు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సిటీ వినియోగానికి అనువైన ఫీచర్లతో ఈ SUV మంచి పోటీని ఇవ్వనుందని అంచనా.

3.కియా కేరెన్స్ క్లావిస్ EV

కియా నుంచి రాబోతున్న మరో కీలక మోడల్ కేరెన్స్ క్లావిస్ EV. ఈ కారు జూలై మధ్యలో ఆవిష్కరించబడే అవకాశం ఉంది. పెద్ద కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ MPV ధర సుమారు రూ.20 లక్షల నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. విశాలమైన క్యాబిన్, ఆధునిక టెక్నాలజీ, ఎక్కువ సీటింగ్ సామర్థ్యం దీని ప్రధాన ఆకర్షణలు.

4.లీప్‌మోటార్ T03

Advertisement

చైనా కంపెనీ లీప్‌మోటార్ కూడా భారత మార్కెట్‌ లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. కంపెనీ నుంచి రానున్న తొలి మోడల్ లీప్‌మోటార్ T03. ఇది చిన్న పరిమాణంలో ఉండే ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్. ప్రధానంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 280 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని సమాచారం. ఈ కారు ధర రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

Read Also: ఇండియన్స్ మనసు గెలిచిన టాప్ 5 హోండా కార్లు.. ఇవి వాహనాలు కాదు, ఓ భావోద్వేగం!

Related News

జూలైలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీ.. EV ప్రియులకు పండగే!

ఇండియన్స్ మనసు గెలిచిన టాప్ 5 హోండా కార్లు.. ఇవి వాహనాలు కాదు, ఓ భావోద్వేగం!

ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్మార్ట్ ఫీచర్స్.. జెన్ Z కోసం టాప్ 5 స్టైలిష్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

IRCTC అదిరిపోయే ఊటీ టూర్ ప్యాకేజీ.. ప్రకృతి ప్రేమికులకు 4 రోజులు పండుగే పండుగ!

హైవేపై కారు చెడిపోయిందా? ఇక మెకానిక్ కోసం వెతకాల్సిన పనిలేదు!

పెట్రోల్ కారులో పొరపాటున డీజిల్ పోశారా? వెంటనే చేయాల్సిన పని ఇదే!

నీటితో నడిచే రైలు.. సేవలకు సిద్ధం, ఇక డీజీల్ రైళ్లకు గుడ్ బై!

Big Stories

×