E-Paper
Advertisement

టాటా To ఎంజీ.. లో కాస్ట్ లో హై రేంజ్ ఇచ్చే స్మాల్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

టాటా To ఎంజీ.. లో కాస్ట్ లో హై రేంజ్ ఇచ్చే స్మాల్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Affordable Compact Electric Cars: గత కొద్ది సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజూ ట్రాఫిక్‌ లో ప్రయాణించే వారు ఇప్పుడు చిన్న సైజు ఈవీల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఉండటం, డ్రైవింగ్ ఈజీగా ఉండటంతో  కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్లు బెస్ట్ ఆప్షన్ గా మారాయి. వాస్తవానికి  పెద్ద కార్లతో పోలిస్తే చిన్న ఎలక్ట్రిక్ కార్లు సిటీలో నడపడానికి అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లతో చిన్న ఈవీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

⦿ MG Comet EV

బెస్ట్ బడ్జెట్ ఎలక్ట్రికార్లలో MG Comet EV టాప్ లో ఉంటుంది. దేశంలో అత్యంత చిన్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. నగరాల్లో చిన్న కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని పొడవు కేవలం 2,974 mm. పార్కింగ్ చేయడం, ట్రాఫిక్‌ లో డ్రైవ్ చేయడం చాలా సులభం. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

⦿ Tata Tiago EV

Advertisement

పెట్రోల్ టియాగో ఆధారంగా వచ్చిన ఈ కారు సాధారణ కుటుంబాలకు సరిపోతుంది. దీని డిజైన్ కాంపాక్ట్‌ గా ఉండటంతో నగరాల్లో డ్రైవ్ చేయడం సులభంగా ఉంటుంది. ఈ కారులో బ్యాటరీ వేరియంట్‌ను బట్టి 250 నుంచి 293 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది.

⦿ Tata Punch EV

ఈ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో బాగా పాపులర్ అవుతోంది. SUV లుక్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ఎక్కువ రేంజ్ కావాలనుకునే వారికి బాగుంటుంది. ఈ మోడల్ 365 నుంచి 468 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. సిటీ  ప్రయాణాలతో పాటు అప్పుడప్పుడు హైవే డ్రైవింగ్‌ కు కూడా అనుకూలంగా ఉంటుంది.

⦿ Citroen eC3

Advertisement

ఈ కారు కూడా ప్రత్యేకమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. క్రాస్‌ ఓవర్ హ్యాచ్‌ బ్యాక్ స్టైల్‌ లో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 320 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సాధారణ వినియోగంలో 210 నుంచి 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

⦿ Tata Tigor EV

ఈ కారు చిన్న ఎలక్ట్రిక్ కార్ల లో మంచి ఆప్షన్ గా ఎంపికగా నిలుస్తోంది. సెడాన్ స్టైల్ కావాలనుకునే వారికి ఇది బాగుంటుంది. 315 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

సిటీలో రోజువారీ ప్రయాణాలకు చిన్న ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు మంచి ఆప్షన్ గా మారాయి. ఇవి తక్కువ ఖర్చుతో పాటు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తున్నాయి.

Read Also: కియా To రెనాల్ట్.. రూ.20 లక్షల లోపు బెస్ట్ హైబ్రిడ్ కార్లు ఇవే!

Related News

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

Big Stories

Advertisement
×