E-Paper
Advertisement

ఈవీ మార్కెట్లో దుమ్మురేపిన TVS.. ఏకంగా 10 లక్షల స్కూటర్ల అమ్మకం!

ఈవీ మార్కెట్లో దుమ్మురేపిన TVS.. ఏకంగా 10 లక్షల స్కూటర్ల అమ్మకం!
Advertisement

TVS 1 Million EV Sales: భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో TVS సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈవీ అమ్మకాలు ఏకంగా 10 లక్షల మార్క్ ను క్రాస్ చేశాయి. కంపెనీకి చెందిన iQube, Orbiter ఎలక్ట్రిక్ స్కూటర్లకు లభిస్తున్న భారీ ఆదరణతో ఈ అరుదైన ఘనత సాధించింది. వాహన్ డేటా ప్రకారం.. 2026 జూన్ 11 నాటికి TVS మొత్తం 10,04,148 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మింది.

జనవరి 2020లో ఈవీల అమ్మకాలు ప్రారంభం

TVS 2020 జనవరిలో iQube స్కూటర్‌తో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. స్టార్టింగ్ లో కొద్ది నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ స్కూటర్, క్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరించి కంపెనీకి బలమైన స్థానం సంపాదించిపెట్టింది. ప్రస్తుతం iQube TVS EV వ్యాపారానికి ప్రధాన బలంగా మారింది. నెమ్మదిగా iQube పలు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. చిన్న బ్యాటరీ ప్యాక్‌ల నుంచి 5kWhకు పైగా సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లే, కనెక్టెడ్ టెక్నాలజీ, నావిగేషన్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్‌ డేట్స్, ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Advertisement

ఇక Orbiter స్కూటర్ ద్వారా TVS మరింతగా తన ఈవీ కొనుగోలు బేస్ ను పెంచుకుంది. దాదాపు 115 కిలోమీటర్ల రేంజ్‌ తో పాటు ఆకర్షణీయమైన డిజైన్, తక్కువ ధర ఈ స్కూటర్‌ కు మంచి డిమాండ్ తీసుకొచ్చాయి. ఇటీవల V1 వేరియంట్‌ ను కూడా కంపెనీ పరిచయం చేసింది. అంతేకాదు, బ్యాటరీ యాస్ ఏ సర్వీస్(BaaS) పథకాన్ని తీసుకొచ్చింది.

లక్ష అమ్మకాలకు 3 ఏళ్ల సమయం

TVS 10 లక్షల అమ్మకాల మార్కును చేరుకోవడం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని చేరుకున్న వేగం కూడా విశేషమే. మొదటి లక్ష స్కూటర్ల అమ్మకాలు సాధించడానికి కంపెనీకి మూడు సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. అయితే ఆ తర్వాత వృద్ధి వేగంగా పెరిగింది.  ఒక లక్ష నుంచి రెండు లక్షల అమ్మకాలకు కేవలం 10 నెలలు మాత్రమే పట్టగా, 2024 ఏప్రిల్ నాటికి మూడు లక్షల మార్కును కూడా చేరుకుంది. ఆ తర్వాత అమ్మకాల గ్రాఫ్ మరింత వేగంగా పెరిగింది. మూడు లక్షల నుంచి ఏడు లక్షల యూనిట్ల అమ్మకాలను కేవలం 17 నెలల్లోనే సాధించడం TVSకు మార్కెట్ లో ఉన్న ఆదరణను వెల్లడిస్తోంది.

Advertisement

2025 చివర్లో iQube, Orbiter రెండింటికీ డిమాండ్ మరింత పెరగడంతో కేవలం మూడు నెలల్లోనే అమ్మకాలు 7 లక్షల నుంచి 8 లక్షలకు చేరాయి. అలాగే 2026 మార్చి చివరి నుంచి జూన్ 10 వరకు కేవలం 75 రోజుల్లోనే మరో లక్ష స్కూటర్ల విక్రయాలు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 1,300కు పైగా స్కూటర్లు అమ్ముడయ్యాయి.

భారీగా పెరిగిన మార్కెట్ వాటా

మార్కెట్ వాటా పరంగా కూడా TVS భారీ పురోగతి సాధించింది. 2020లో కేవలం 1 శాతం వాటా ఉన్న కంపెనీ, 2023 నాటికి 20 శాతానికి పైగా వాటాను సాధించింది. 2025లో 3.15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి దేశంలో అగ్రస్థానానికి చేరుకుంది. 2026 తొలి ఆరు నెలల్లోనే TVS 2.19 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. గత నెలలో నమోదైన 51,605 యూనిట్ల అమ్మకాలు కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ నెలగా నిలిచాయి.

Read Also: హీరో సూపర్ ప్లాన్.. ఏకంగా 12 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Related News

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

JSW కాంబ్యాట్ SUV వచ్చేస్తోంది.. టయోటా ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలేనా?

టాటా పంచ్ ధరల షాక్.. పెట్రోల్, EV మోడళ్లపై ఏకంగా రూ.20 వేల పెంపు!

Big Stories

Advertisement
×