E-Paper
Advertisement

తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. కొత్త టీవీస్ క్యూబ్ వచ్చేసింది!

తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. కొత్త టీవీస్ క్యూబ్ వచ్చేసింది!
Advertisement

TVS iQube MillionR Edition:  టీవీఎస్ మోటార్ కంపెనీ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్‌ లో సరికొత్త స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. టీవీఎస్ ఐక్యూబ్ మిలియన్ఆర్ ఎడిషన్ పేరుతో విడుదలైన ఈ స్కూటర్.. ఐక్యూబ్ 10 లక్షల కస్టమర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించారు. కొత్త వెర్షన్‌ లో పెద్దగా మెకానికల్ మార్పులు చేయకపోయినా, లుక్, స్టోరేజ్, రోజువారీ ఉపయోగానికి పనికొచ్చే కొన్ని ఫీచర్లను జోడించారు.

కొత్త వేరియంట్ ధర ఎంతంటే?

టీవీఎస్ ఐక్యూబ్ మిలియన్ఆర్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,40,138గా నిర్ణయించారు. ఇది సాధారణ మోడల్ 3.5kWh వేరియంట్ కంటే సుమారు రూ.3,552 ఎక్కువ. అదనంగా చెల్లించే మొత్తానికి స్పెషల్ కలర్, కొత్త గ్రాఫిక్స్, MillionR బ్యాడ్జింగ్, మెరుగైన సీట్ ఫినిష్, అదనపు స్టోరేజ్, USB టైప్ C పోర్ట్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఆకట్టుకునేలా అరోరా గ్రీన్ కలర్

Advertisement

ఈ స్పెషల్ ఎడిషన్‌ లో ముఖ్యమైన ఆకర్షణ దాని కొత్త అరోరా గ్రీన్ డ్యూయల్ టోన్ కలర్. నార్తర్న్ లైట్స్ నుంచి స్ఫూర్తి పొంది ఈ రంగును రూపొందించినట్లు టీవీఎస్ చెబుతోంది. దీనికి తోడు అప్ డేట్ చేసిన గ్రాఫిక్స్, ప్రత్యేకమైన MillionR బ్యాడ్జింగ్, ప్రీమియం సీట్ అప్‌హోల్స్టరీని అందించారు. దీంతో సాధారణ ఐక్యూబ్‌ తో పోలిస్తే ఈ వెర్షన్ కొంత ప్రత్యేకంగా కనిపిస్తుంది.

సింగిల్ ఛార్జ్ తో 145 కి.మీ రేంజ్

టీవీఎస్ ఐక్యూబ్ మిలియన్ఆర్ ఎడిషన్ లో సాధారణ iQube 3.5kWh మోడల్‌లో ఉన్న బ్యాటరీనే ఉపయోగించారు. ఇందులో 3.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 145 కి.మీ IDC రేంజ్ వస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో BLDC హబ్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 4.4kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 82 కి.మీగా ఉంది. అంటే రేంజ్, బ్యాటరీ, మోటార్ విషయంలో సాధారణ వెర్షన్‌తో పెద్దగా తేడా లేదు.

స్టోరేజ్ మరింత పెరిగింది!

Advertisement

కొత్త ఎడిషన్‌లో రోజువారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్టోరేజ్‌ను కూడా పెంచారు. సాధారణ మోడల్‌లో 32 లీటర్ల స్టోరేజ్ ఉండగా, MillionRలో ముందు భాగంలో అదనపు యుటిలిటీ కంపార్ట్‌ మెంట్‌ ను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం స్టోరేజ్ సామర్థ్యం 35.5 లీటర్లకు చేరింది. కుటుంబ అవసరాలు, షాపింగ్, రోజువారీ వస్తువులను తీసుకెళ్లేవారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ స్కూటర్‌లో USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ ను కూడా అందించారు. ప్రయాణ సమయంలో స్మార్ట్‌ ఫోన్ తో పాటు ఇతర ఎలక్ట్రిక్ డివైజ్ లకు ఛార్జ్ చేసుకోవచ్చు.

ఎవరికి సరిపోతుంది?

అదనపు రేంజ్ కంటే స్పెషల్ లుక్, ఎక్కువ స్టోరేజ్, చిన్న చిన్న ప్రాక్టికల్ ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చేవారికి ఈ వెర్షన్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే బ్యాటరీ, రేంజ్, మోటార్ విషయంలో సాధారణ 3.5kWh ఐక్యూబ్‌తో పెద్ద మార్పు లేదు. ఇప్పటికే ఉన్న ఐక్యూబ్‌కు మరింత ప్రత్యేకమైన లుక్, మెరుగైన ప్రాక్టికాలిటీని యాడ్ చేసిన స్పెషల్ వెర్షన్‌గా చెప్పొచ్చు.

Read Also: కొత్త హెడ్‌లైట్ రూల్స్ వస్తున్నాయ్, ఇలా చేస్తే భారీ జరిమానాలు.. జాగ్రత్త!

Tags

Related News

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?

లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

Big Stories

Advertisement
×