E-Paper
Advertisement

కొత్త హెడ్‌లైట్ రూల్స్ వస్తున్నాయ్, ఇలా చేస్తే భారీ జరిమానాలు.. జాగ్రత్త!

కొత్త హెడ్‌లైట్ రూల్స్ వస్తున్నాయ్, ఇలా చేస్తే భారీ జరిమానాలు.. జాగ్రత్త!
Advertisement

New Headlight Regulations: రాత్రి వేళ రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్ల నుంచి వచ్చే ఎక్కువ ఫోకస్ కారణంగా చాలాసార్లు వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా హై బీమ్ ఎక్కువగా ఉపయోగిస్తే కొన్ని సెకన్ల పాటు ఎదురుగా ఉన్న రోడ్డు కూడా కనిపించని పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వాహనాల హెడ్‌ లైట్లకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  కేంద్ర రోడ్డు రవాణా శాఖ మోటార్ వెహికల్ నిబంధనల్లో మార్పులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.  ఈ రూల్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బైక్‌లపై లో బీమ్ తప్పనిసరి!

కొత్తగా తయారయ్యే టూ వీలర్స్ లో ఆటోమేటిక్ హెడ్‌ ల్యాంప్ సిస్టమ్ కేవలం లో బీమ్‌ లోనే పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆటోమేటిక్ హెడ్‌ ల్యాంప్ ఆన్ సిస్టమ్ కొన్ని వాహనాల్లో లో బీమ్‌తో పాటు హై బీమ్‌ను కూడా యాక్టివేట్ చేసే అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదన ప్రకారం ఆటోమేటిక్‌గా లైట్ ఆన్ అయినప్పుడు అది లో బీమ్‌లోనే ఉండాలి. అయితే, ఈ మార్పు ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న బైక్‌లకు వర్తించదు. కొత్త వెహికల్స్ కు మాత్రమే ఈ నిబంధన వర్తించే అవకాశం ఉంది.

హై బీమ్ తీవ్రత తగ్గింపు!

Advertisement

ఎక్కువ లైట్ ఫోకస్ ఇచ్చే హెడ్‌ లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయి. ఈ గ్లేర్ కారణంగా కొద్దిసేపు కళ్లు మూసుకుపోయినట్లు అయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే హై బీమ్ లైట్ల తీవ్రతను తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. టూ వీలర్ హెడ్‌లైట్లకు ప్రస్తుతం ఉన్న 1.5 లక్షల కాండెలా పరిమితిని 1 లక్ష కాండెలాకు తగ్గించే ప్రతిపాదన ఉంది. కార్లు, ఇతర ఫోర్ వీలర్స్ విషయంలో 2.25 లక్షల కాండెలా నుంచి 1.5 లక్షల కాండెలాకు పరిమితిని తగ్గించే అవకాశం ఉంది.

హెడ్‌ లైట్ రంగుపైనా కంట్రోల్

కొత్త నిబంధనల్లో హెడ్‌లైట్ల కలర్ టెంపరేచర్‌పైనా పరిమితి పెట్టే ప్రతిపాదన ఉంది. అధిక కలర్ టెంపరేచర్ ఉన్న తెల్లటి లైట్ రాత్రివేళ ఎదురుగా వచ్చే వారికి ఎక్కువ గ్లేర్ కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే హెడ్‌ లైట్లు, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌ల గరిష్ట కలర్ టెంపరేచర్‌ను 6,500 కెల్విన్‌ కు పరిమితం చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మెయిన్ బీమ్ హెడ్‌ ల్యాంప్‌ లను అమర్చే ఎత్తుకు కూడా కొత్త నిబంధనలు రావచ్చు.

సిటీల్లో హై బీమ్‌ వార్నింగ్

Advertisement

కొత్త కార్లు, బైక్‌లలో మరో ఆసక్తికరమైన ఫీచర్‌ ను తీసుకురావాలనే ఆలోచన కూడా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అవసరం లేకుండా డ్రైవర్ హై బీమ్ ఉపయోగిస్తే ఆడియో అలర్ట్ ఇచ్చే వ్యవస్థను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే, ప్రతి సందర్భంలోనూ ఈ హెచ్చరిక పనిచేయదు.  హైవేపై గంటకు 60 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు హై-బీమ్ అవసరం కావచ్చు. అందుకే అలాంటి పరిస్థితుల్లో డ్రైవర్‌ కు వార్నింగ్ ఇవ్వకుండా ఉండేలా వ్యవస్థను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: కెమెరా లేదు.. వైర్లు లేవు.. డ్రైవర్‌ కు నిద్రొస్తే సీటే కనిపెట్టేస్తుంది!

Tags

Related News

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

Big Stories

Advertisement
×