E-Paper
Advertisement

Upcoming Kia Cars: న్యూ సెల్టోస్ To సోరెంటో.. కియా నుంచి రాబోతున్న కత్తిలాంటి కార్లు ఇవే!

Upcoming Kia Cars: న్యూ సెల్టోస్ To సోరెంటో.. కియా నుంచి రాబోతున్న కత్తిలాంటి కార్లు ఇవే!
Advertisement

Upcoming Kia Cars India 2026: ఇండియన్ మార్కెట్లో కియా కార్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. చక్కటి స్టైల్ తో ఆకట్టుకుంటున్నాయి. 2026లోనూ ఈ కంపెనీ నుంచి అదిరిపోయే కార్లు విడుదల కాబోతున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవి? ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి? ధర ఎంత ఉంటుంది? అనే కంప్లీట్ డీటైల్స్ తెలుసుకుందాం..

2026లో లాంచ్ కాబోయే కియా కార్లు   

 

⦿ కియా న్యూ సెల్టోస్ 2026

Advertisement

ఈ కారు ధర సుమారు రూ. 12- 21 లక్షలు ఉండబోతోంది. జనవరి 2, 2026న లాంచ్ కానుంది. ఇది పూర్తిగా కొత్త డిజైన్, బిగ్ సైజ్, అధునాతన ఫీచర్లతో వస్తుంది. గ్లోబల్ K3 ప్లాట్‌ఫాం మీద తయారైంది. 2026 మిడ్ ఇయర్ నుంచి డెలివరీలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 11, 2025 నుంచి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.  కియా గ్లోబల్ డిజైన్, బోల్డ్ డిజిటల్ టైగర్ ఫేస్ గ్రిల్, వెర్టికల్ LED DRLs, కనెక్టెడ్ LED టైల్ లైట్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది.  డ్యూయల్ 12.3-ఇంచ్ కర్వ్డ్ స్క్రీన్స్ , పనోరమిక్ సన్‌ రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్,  లెవల్-2 ADAS, 6 ఎయిర్‌ బ్యాగ్స్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, OTA అప్‌ డేట్స్, కియా కనెక్ట్ 2.0, 360° కెమెరాతో వస్తుంది.  1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్స్ తో రాబోతోంది.

⦿ కియా టాస్మాన్

ఈ కారు జూన్ 9, 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ. 40 – 45 లక్షలు ఉంటుంది.  కియా కంపెనీ తన మొదటి పికప్ ట్రక్‌ ను టాస్మాన్ పేరుతో 2024 అక్టోబర్‌లో గ్లోబల్‌ గా అన్‌వీల్ చేసింది. ఇది మిడ్-సైజ్ బాడీ-ఆన్ ఫ్రేమ్ పికప్, టయోటా హిలక్స్, ఫోర్డ్ రేంజర్, ఇసుజు V-క్రాస్‌ లకు డైరెక్ట్ పోటీ ఇస్తుంది. ఆస్ట్రేలియా టాస్మానియా ద్వీపం నుంచి ఇన్‌స్పైర్డ్ అయిన ఈ ట్రక్ రగ్డ్ డిజైన్, ఆఫ్ రోడ్ కెపాబిలిటీ, లైఫ్‌స్టైల్ ఫీచర్లతో వచ్చింది. ఇండియాలో లైఫ్‌స్టైల్ పికప్ డిమాండ్ పెరుగుతుండటంతో కియా ఇక్కడ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కానీ, ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ లేదు. ఈ కారు  బోల్డ్ బాక్సీ డిజైన్, వెర్టికల్ LED హెడ్‌ల్యాంప్స్, టైగర్ ఫేస్ గ్రిల్,  ట్రిపుల్ స్క్రీన్ సెటప్,  వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, OTA అప్‌డేట్స్, లెవల్-2 ADAS, 360° కెమెరా, అండర్‌ బాడీ వ్యూ, ప్రీమియం సీట్స్, డ్యూయల్ వైర్‌ లెస్ చార్జర్, హిడన్ స్టోరేజ్ లాంటి ఫీచర్లు ఉంటాయి. 2.2L డీజిల్, 2.5L టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ తో వస్తుంది.

⦿ కియా EV3

Advertisement

ఈ కారు భారత్ లో జూన్ 18, 2026లో లాంచ్ కానుంది. దీని ధర సుమారు రూ.20- 25 లక్షలు ఉంటుంది.  కియా EV3 కాంపాక్ట్ ఎలక్ట్రిక్ క్రాస్‌ ఓవర్ SUV, 2024లో గ్లోబల్‌గా అన్‌ వీల్ అయింది. ఇది కియా అఫోర్డబుల్ EV లైనప్‌లో భాగం, EV9, EV6 తర్వాత వచ్చింది. బాక్సీ డిజైన్, అధునాతన టెక్, లాంగ్ రేంజ్‌తో పాపులర్ అయింది. 2025లో గ్లోబల్ మార్కెట్లలో ముఖ్యంగా కొరియా, యూరప్, UK సేల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ కారు ద్వారా కియా ఇండియా EV పోర్ట్‌ ఫోలియోను విస్తరించనుంది. ఈ కారు స్టాండర్డ్ వేరియంట్ 58.3 kWh బ్యాటరీ, 501 km రేంజ్ తో వస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ లో 81.4 kWh బ్యాటరీ, 600 km రేంజ్ తో వస్తుంది. బోల్డ్ డిజిటల్ టైగర్ ఫేస్  గ్రిల్, వెర్టికల్ LED లైట్స్, బాక్సీ షేప్, ఏరోడైనమిక్ డిజైన్ తో వస్తుంది.  ట్రిపుల్ స్క్రీన్ సెటప్, కియా AI అసిస్టెంట్, OTA అప్‌ డేట్స్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, రిలాక్సేషన్ మోడ్ సీట్స్, అంబియంట్ లైటింగ్, ప్రీమియం సౌండ్, లెవల్-2 ADAS, 360° కెమెరా, V2L ఫీచర్లతో కియా EV3తో రానుంది.

Read Also: రగ్డ్ డిజైన్, స్మార్ట్ టెక్.. టయోటా మినీ ల్యాండ్ క్రూయిజర్ వచ్చేస్తోంది!

Tags

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×