E-Paper
Advertisement

భారత మార్కెట్‌ లోకి విన్‌ఫాస్ట్ VF3.. చిన్న సైజులో స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది!

భారత మార్కెట్‌ లోకి విన్‌ఫాస్ట్ VF3.. చిన్న సైజులో స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది!
Advertisement

VinFast VF3 Electric SUV: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లో మరో కొత్త మోడల్‌ ను విడుదల చేయబోతోంది. ఇప్పటికే VF6, VF7 ఎలక్ట్రిక్ SUVలను తీసుకురాగా, ఇప్పుడు VF3 పేరుతో చిన్న సైజు ఎలక్ట్రిక్ SUVని పరిచయం చేయబోతోంది. ఈ ఏడాది ఎండింగ్ లోనే ఈ మోడల్ ను లాంచ్ చేయనుంది. సిటీలో రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మోడల్, ఆకట్టుకునే డిజైన్‌ తో పాటు మంచి డ్రైవింగ్ రేంజ్‌ ను  అందించనుంది.  ఈ చిన్న SUV నగర రోడ్లపై సులభంగా నడిచేలా రూపొందించారు. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ SUV లాంటి స్టాన్స్‌ ను కలిగి ఉంటుంది.

డిజైన్ గురించి..

VF3 బాక్సీ స్టైల్‌ తో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో LED హెడ్‌ ల్యాంప్స్, మధ్యలో విన్‌ ఫాస్ట్ లోగో, V ఆకారపు క్రోమ్ డిజైన్ దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. బ్లాక్ క్లాడింగ్, పెద్ద బంపర్లు, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా ఈ మోడల్ చిన్న ఆఫ్ రోడర్‌ లా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌ లో ఫ్లాట్ రూఫ్, పెద్ద వీల్ ఆర్చ్‌ లు, 16 అంగుళాల వీల్స్ కారుకు మంచి లుక్ ను అందించనున్నాయి. వెనుక భాగంలో మినిమలిస్ట్ డిజైన్‌ ను కొనసాగించారు. LED టెయిల్ ల్యాంప్స్‌ ను బ్లాక్ ప్యానెల్‌ తో కలిపి అందించారు. చిన్న రూఫ్ స్పాయిలర్, పెద్ద రియర్ గ్లాస్‌ తో ఈ SUVకి లేటెస్ట్ లుక్ ను అందించారు.

ఇంటీరియర్ గురించి..

Advertisement

ఇంటీరియర్ కూడా సింపుల్‌ గా రూపొందించారు. ఇందులో నలుగురు ప్రయాణికులు కూర్చునే వీలు ఉంటుంది. ముందు సీట్లు మాన్యువల్ అడ్జస్ట్‌ మెంట్‌ తో వస్తాయి. వెనుక సీట్లను మడిస్తే అడిషనల్ లగేజ్ స్పేస్ ఉంటుంది. డాష్‌ బోర్డ్‌ లో 10 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ప్రత్యేక ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్‌ కు బదులుగా డ్రైవింగ్‌ కు సంబంధించిన అన్ని వివరాలు ఈ స్క్రీన్‌ పైనే కనిపిస్తాయి. D కట్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, కీలెస్ ఎంట్రీ, USB ఛార్జింగ్ పోర్ట్, రెండు స్పీకర్ల ఆడియో సిస్టమ్ లాంటి అవసరమైన ఫీచర్లు ఇందులో ఉంటాయి.

పనితీరు గురించి..

VF3లో వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 43 bhp పవర్, 110 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 18.6 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. పూర్తి ఛార్జ్‌ తో సుమారు 210 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. భారత్ లో చిన్న ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇప్పటికే MG కామెట్ EV మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పుడు విన్‌ ఫాస్ట్ VF3 కూడా అదే విభాగంలో పోటీ పడనుంది.

Advertisement

Read Also: యూజ్డ్ కార్ బయ్యర్స్ కు బెస్ట్ ఛాయిస్.. ఈ 5 డిస్కంటిన్యూడ్ కార్లు మిస్ అవ్వొద్దు!

Tags

Related News

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

స్కోడా ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ.. భారత్‌కు రానున్న 3 గ్లోబల్ మోడల్స్ ఇవే!

కవాసకి W230 vs యమహా XSR155.. ఈ రెండు రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్?

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

Big Stories

Advertisement
×