E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్ తో 215 కి.మీ రేంజ్‌.. విన్ ఫాస్ట్ మినీ ఈవీ వచ్చేస్తోంది!

సింగిల్ ఛార్జ్ తో 215 కి.మీ రేంజ్‌.. విన్ ఫాస్ట్ మినీ ఈవీ వచ్చేస్తోంది!
Advertisement

Vinfast VF3 India Launch: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో చిన్న కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా సిటీల్లో  రోజువారీ ప్రయాణాలకు సరిపోయే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ ఫాస్ట్ తన చిన్న ఎలక్ట్రిక్ కారు VF3ను భారత్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. త్వరలో ఈ కారు మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఇప్పటికే 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పోలో ఈ కారును కంపెనీ ప్రదర్శించింది. చిన్న సైజు, SUV తరహా డిజైన్, 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ తో ఆకట్టుకోనుంది.

ధర ఎంత అంటే?  

భారత్‌లో విన్ ఫాస్ట్ VF3 ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షల ఎక్స్‌ షోరూమ్‌ గా ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఇండియా-స్పెక్ మోడల్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అలాగే, 2026లోనే విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపినప్పటికీ, కచ్చితమైన లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.

చిన్న కారు.. SUV లుక్!

Advertisement

VF3 చూడటానికి చిన్న కారులా ఉన్నప్పటికీ, దీని డిజైన్ మాత్రం SUV తరహాలో ఉంటుంది. బాక్సీ ఆకారం, ఎత్తైన బాడీ, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ దీని ప్రత్యేకతలు. సుమారు 191 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల సిటీ రోడ్లపై డ్రైవింగ్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రెండు డోర్ల కారు. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. వెనుక సీట్లలోకి వెళ్లేందుకు ముందు సీటును ముందుకు జరపాల్సి ఉంటుంది. చిన్న పరిమాణం కారణంగా ట్రాఫిక్‌ లో ఈజీగా నడపడంతో పాటు పార్కింగ్ కూడా ఈజీగా ఉంటుంది.

సింగిల్ ఛార్జ్ తో 215 కి.మీ రేంజ్

గ్లోబల్ స్పెక్ VF3లో 18.64 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 215 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. అయితే ఇది టెస్ట్ సైకిల్ ఆధారంగా వెల్లడించిన రేంజ్. రియల్ వరల్డ్ లో ట్రాఫిక్, వేగం, వాతావరణం, డ్రైవింగ్ విధానం లాంటి అంశాలపై రేంజ్ మారే అవకాశం ఉంటుంది. ఈ కారులో వెనుక భాగంలో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది సుమారు 41-43.5hp పవర్, 110Nm టార్క్ అందిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ సెటప్ ఉండటం దీని మరో ప్రత్యేకత.

36 నిమిషాల్లో 70 శాతం ఛార్జింగ్

Advertisement

VF3లో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. 10 నుంచి 70 శాతం వరకు బ్యాటరీని సుమారు 36 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. రోజువారీ సిటీ ప్రయాణాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. క్యాబిన్‌ ను సింపుల్‌ గా తయారు చేశారు.  ఇందులో 10 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్, రెండు స్పోక్‌ల స్టీరింగ్ వీల్ ఉన్నాయి. మాన్యువల్ ఏసీ, ఫ్రంట్ పవర్ విండోస్ లాంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. భద్రత కోసం ABS, EBD, ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, భారత్‌ లో విడుదలయ్యే మోడల్‌ లో తుది ఫీచర్లను కంపెనీ వెల్లడించాల్సి ఉంది. భారత్‌లోకి వచ్చిన తర్వాత VF3 ప్రధానంగా MG Comet EVతో పోటీ పడే అవకాశం ఉంది.

Read Also: డిజైర్ To పంచ్.. రూ. 10 లక్షల్లోపు బెస్ట్ CNG కార్లు ఇవే!

Tags

Related News

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?

లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

Big Stories

Advertisement
×