E-Paper
Advertisement

డిజైర్ To పంచ్.. రూ. 10 లక్షల్లోపు బెస్ట్ CNG కార్లు ఇవే!

డిజైర్ To పంచ్.. రూ. 10 లక్షల్లోపు బెస్ట్ CNG కార్లు ఇవే!
Advertisement

Best CNG Cars Under 10 Lakh: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది కారు కొనుగోలుదారులు CNG వాహనాల వైపు చూస్తున్నారు. గతంలో CNG కార్లు అంటే తక్కువ ధరలో లభించే బడ్జెట్ వెహికల్స్ అనే భావన ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మంచి ఫీచర్లు, సూపర్ డిజైన్, ఎక్కువ స్పేస్‌ తో పాటు తక్కువ ఇంధన ఖర్చును అందించే CNG కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. రూ.10 లక్షల లోపు బడ్జెట్‌ లో బెస్ట్ CNG మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.మారుతి సుజుకి డిజైర్ CNG

ధర రూ.8.11 లక్షల నుంచి రూ.9.11 లక్షల వరకు ఉంటుంది. డిజైర్ CNGలో 1.2 లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 70hp పవర్, 102Nm టార్క్ అందిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.  ముఖ్యంగా రైడ్ క్వాలిటీ, హ్యాండ్లింగ్ విషయంలో డిజైర్ ఆకట్టుకుంటుంది. క్యాబిన్ కూడా విశాలంగా ఉంటుంది. VXi, ZXi వేరియంట్లలో CNG ఆప్షన్ లభిస్తుంది. అయితే బూట్‌లో ఒకే పెద్ద CNG ట్యాంక్ ఉండటం వల్ల కొంత స్థలం తగ్గుతుంది.

2.మారుతి సుజుకి బాలెనో CNG

Advertisement

బాలెనో CNG ధర రూ.7.77 లక్షల నుంచి రూ.8.67 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ 4-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. CNGతో 78hp పవర్, 98Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్మూత్‌ గా, రిఫైన్డ్‌ గా ఉంటుంది. డెల్టా, జీటా వేరియంట్లలో CNG లభిస్తుంది. క్యాబిన్ స్పేస్ కూడా బాగుంటుంది. ఒకే పెద్ద CNG ట్యాంక్ కారణంగా బూట్ స్పేస్ కొంత తగ్గుతుంది. టయోటా గ్లాంజా CNG కూడా ఇదే తరహా ఆప్షన్‌గా ఉంటుంది.

3.హ్యుందాయ్ ఎక్స్టర్ CNG

హ్యుందాయ్ ఎక్స్టర్ CNG ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.42 లక్షల వరకు ఉంది. ఇందులో 1.2 లీటర్ 4-సిలిండర్ ఇంజిన్ 69hp పవర్, 95Nm టార్క్ ఇస్తుంది. ఎక్స్టర్‌లో రెండు CNG ట్యాంకులు ఉండటం ప్రత్యేకత. దీంతో బూట్ స్పేస్‌ ను ఎక్కువగా కోల్పోకుండా ఉండొచ్చు. ఇంజిన్ స్మూత్‌ గా ఉంటుంది. చిన్న సైజు కారణంగా ఈజీ నడపడం సాధ్యం అవుతుంది.

4.టాటా పంచ్ CNG

Advertisement

పంచ్ CNG ధర రూ.6.80 లక్షల నుంచి రూ.10.67 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 1.2 లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ 73hp, 103Nm టార్క్ అందిస్తుంది. ఈ లిస్టులో AMT గేర్‌ బాక్స్‌ తో లభించే ఏకైక CNG కారు పంచ్. రెండు CNG ట్యాంకుల కారణంగా బూట్‌ లో కొంత ఉపయోగకరమైన స్థలం లభిస్తుంది. మంచి రైడ్ క్వాలిటీ, హ్యాండ్లింగ్‌ తో పాటు ఫీచర్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

5.నిస్సాన్ గ్రావైట్ CNG

నిస్సాన్ గ్రావైట్ CNG ధర రూ.6.59 లక్షల నుంచి రూ.8.94 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 1.0 లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. గ్రావైట్ ప్రధాన ఆకర్షణ 7 సీట్ల సౌకర్యం, మంచి ప్యాకేజింగ్. CNG కిట్ డీలర్ స్థాయిలో అమర్చబడుతుంది కాబట్టి అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

Read Also: ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్‌ To 0 ఆల్ఫా EV.. హోండా క్రేజీ SUVలు రెడీ!

Tags

Related News

హోండా రెబెల్ 500 వచ్చేస్తోంది, కొత్త ఫీచర్లు చూస్తే వారెవ్వా అనాల్సిందే!

ఫ్లిప్‌ కార్ట్‌ లోకి రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ.. ఇక ఇంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు!

టీవీఎస్ అపాచీ RTR 310లో కొత్త అప్‌డేట్.. ఫీచర్లు, ఇంజిన్, ధరలు ఎలా ఉన్నాయంటే?

లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

Big Stories

Advertisement
×