E-Paper
Advertisement

ACB Raids: ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి ఇళ్లపై ఏసీబీ రైడ్స్.. ఆస్తులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

ACB Raids: ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి ఇళ్లపై ఏసీబీ రైడ్స్.. ఆస్తులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
Advertisement

ACB Raids: తెలంగాణలో అవినీతి అధికారుల గుట్టురట్టు చేసేందుకు ఏసీబీ స్పీడ్ పెంచింది. నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కొమ్మూరి మల్లారెడ్డి అవినీతి లీలలపై నిఘా పెట్టిన అధికారులు.. ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలు, స్నేహితులకు చెందిన మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఒక్కొక్క చోట దొరుకుతున్న ఆస్తుల వివరాలు చూసి ఏసీబీ అధికారులే ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది.

భారీగా ఆస్తులు..

ఇంతకీ ఈ అవినీతి అధికారి సంపాదించిన అక్రమాస్తుల చిట్టా ఏంటో తెలుసా? ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4 విలాసవంతమైన ఇళ్లు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఆయన కూడబెట్టారు. వివిధ ప్రాంతాల్లో 8 ఓపెన్ ప్లాట్లు, పది ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. ఇంట్లో దొరికిన మూడు లక్షల 31 వేల నగదుతో పాటు.. బ్యాంకుల్లో ఏకంగా 50 లక్షల రూపాయల క్యాష్ బ్యాలెన్స్ బయటపడింది. మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న 3 బ్యాంక్ లాకర్లను అధికారులు గుర్తించారు. వీటిని ఓపెన్ చేస్తే ఇంకెంత బంగారం, నగదు బయటపడుతుందో చూడాలి.

Advertisement

Also read: క‌రువు కోర‌లకు దొర‌క‌కుండా! ఆచితూచి నాట్లు.. వాన‌కాలం సీజ‌న్‌కు నెల రోజుల క్రాప్‌ హాలిడే..!

ఆస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ..

ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. అంటే డాక్యుమెంట్ల ప్రకారం ఈ ఆస్తుల విలువ కేవలం మూడు కోట్ల రూపాయలుగా చూపిస్తున్నారు. కానీ.. ఓపెన్ మార్కెట్‌లో వీటి విలువ పదుల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అదనపు ఆస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ అధికారి కొమ్మూరి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

Advertisement

Also read: Harish Rao: రేవంత్ రెడ్డి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!

Related News

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

Big Stories

Advertisement
×