E-Paper
Advertisement

పరిటాల శ్రీరామ్ ‘సైలెంట్’ వ్యూహం.. ధర్మవరంలో ఏం జరుగుతోంది?

పరిటాల శ్రీరామ్ ‘సైలెంట్’ వ్యూహం.. ధర్మవరంలో ఏం జరుగుతోంది?
Advertisement

Paritala Sriram: పరిటాల శ్రీరామ్.. ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్.. కానీ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పదవి లేకున్నా ప్రత్యేక ఇమేజ్ క్రియేట్‌ చేసుకున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీకి కౌంటర్ ఎటాక్ చేసే ఈ యువనేత.. ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు..

Advertisement

2024 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం సీటు ఆశించారు పరిటాల శ్రీరామ్. కానీ టికెట్ రాలేదు. బీజేపీ అభ్యర్థికి కూటమి టికెట్ ఇవ్వగా.. ఆయన గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం టీడీపీ ధర్మవరం ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీ నేతలకు ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యేతో టీడీపీ సఖ్యత కుదరడం లేదు. బీజేపీ ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమం

Advertisement

టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తోంది. కానీ ధర్మవరంలో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించలేదు. ఎందుకు నిర్వహించలేదన్నది ఇక్కడ ప్రశ్న. గ్రీవెన్స్ నిర్వహిస్తే, ఎమ్మెల్యేపై ఫిర్యాదులు వస్తే దాన్ని ఎలా తీసుకోవాలి.. ఎలా వ్యవహరించాలి..? అప్పుడు అంతర్గత విభేదాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉండడంతోపాటు ప్రత్యర్థులకు ఇదో అవకాశంగా మారుతుంది. ఆ అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే టీడీపీ గ్రీవెన్స్‌ నిర్వహించలేదన్న చర్చ ఉంది. బీజేపీ వ్యవహారంపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నా పరిటాల శ్రీరామ్ ఎక్కడా తన అసంతృప్తి వెళ్లగక్కలేదు. ఒకవైపు కార్యకర్తలను కాపాడుకుంటూనే మరోవైపు రాజకీయంగా వ్యూహాత్మక వైఖరి అవలంభిస్తున్నారు.

Also Read: ఫోన్‌లో రీల్స్ చూస్తోందని.. భార్యను చంపి, పరుపులో చుట్టి..

ఏం జరిగినా వైసీపీ వేలు శ్రీరామ్ వైపే..

రాప్తాడు శ్రీరామ్ తల్లి సునీత ఎమ్మెల్యేగా ఉన్నా.. నియోజకవర్గంలో ఏం జరిగినా వైసీపీ వేలు శ్రీరామ్ వైపే చూపిస్తుంది. వైసీపీ నుంచి ఎంత బలమైన విమర్శలు వచ్చినా.. శ్రీరామ్ చాలా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఆచితూచి స్పందిస్తున్నారు.

అప్పుడప్పుడు మౌనం మేలు చేస్తోంది..

రాజకీయాల్లో దూకుడే కాదు.. అప్పుడప్పుడు మౌనం కూడా మేలు చేస్తుంది.. మౌనం వెనుక కారణం అనుభవం నేర్పిన పాఠం కావొచ్చని లేదా కాలంతోపాటు సర్దుబాటు అవుతున్నారేమోనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Also Read: విజయా డైరీపై లోకేష్ కుట్రలు.. బెదిరించి చైర్మన్‌తో రాజీనామా చేయించారు!- పేర్ని నాని

Tags

Related News

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

Big Stories

Advertisement
×