Tamannaah Comments: సినీ ఇండస్ట్రీ..ఇక్కడ రోజు గడించిందంటే ట్రెండ్ మారిపోతుంది.అలాంటిది ముప్పయేళ్ళ కిందటి పరిస్థితులకి,ఇప్పటికి ఎంతగా చేంజ్ అవుతుందో చెప్పక్కర్లేదు..ఇక హీరోయిన్స్ రోల్స్ విషయంలో కూడా ఆ మార్పులు గట్టిగానే కనిపిస్తున్నాయి.ఇక ఈ క్రమంలో ఇదే విషయం పై మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేసిన సెన్సేషన్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ డిబేట్ గా మారాయి. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ, సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్న ఒక చేదు నిజంపై ఓపెన్ గానే రియాక్ట్ అయింది.
కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మలుగా, పాటలకే పరిమితం చేసే సంస్కృతి తనకు ఏమాత్రం నచ్చదని ఆమె కుండబద్దలు కొట్టింది. దక్షిణాది చిత్రసీమలో పురుషాధిక్యత (Male Dominance) చాలా ఎక్కువగా ఉంటుందని, కథానాయికలను వెండితెరపై గౌరవప్రదంగా, బలమైన పాత్రల్లో చూపించే విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ వంటి పరిశ్రమలు ఇంకా వెనుకబడే ఉన్నాయంటూ మిల్కీ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ అనే రెండు విభిన్న అంశాలను పక్కాగా బ్యాలెన్స్ చేస్తూ, కమర్షియల్ సినిమాల్లో మెరుస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించడం వల్లే తామంతా ఈ స్థాయిలో నిలదొక్కుకోగలిగామని మిల్కీ బ్యూటీ అభిప్రాయపడింది. కమర్షియల్ సినిమాల్లో పాటలు, డ్యాన్సులకు ఉండే క్రేజ్ ఎలాంటిదో తనకు కెరీర్ ఆరంభంలోనే (అనగా 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’తో ఎంట్రీ ఇచ్చి, ఆపై హ్యాపీ డేస్, మగధీర, బాహుబలి వంటి చిత్రాల ప్రయాణంలో) అర్థమైందని తమన్నా పేర్కొంది.
also read :పెద్ద సినిమాల్లో బూతులు కనిపించవా?సెన్సార్‌పై ‘దీవానా’ డైరెక్టర్ సెన్సేషన్ కామెంట్స్ !
అయితే బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీల మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసాన్ని ఆమె ఎత్తి చూపింది. హిందీ పరిశ్రమలో కొందరు హీరోయిన్లు కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకే పరిమితమైతే, మరికొందరు కేవలం గ్లామర్ షోకే పరిమితమవుతుంటారని విశ్లేషించింది. కానీ, చిత్రసీమలో లాంగ్ రన్ ఉండాలన్నా, ‘సూపర్’ అనే లీగ్‌లోకి చేరాలన్నా కేవలం ఏదో ఒక యాంగిల్‌కు పరిమితమైతే సరిపోదని తమన్నా స్పష్టం చేసింది. అటు గ్లామర్ పరంగా ప్రేక్షకులను మెప్పిస్తూనే, ఇటు నటనకు స్కోప్ ఉన్న ఛాలెంజింగ్ పాత్రలను బ్యాలెన్స్ చేయగలిగిన వారే ఇండస్ట్రీని ఏలగలరని ఆమె తేల్చి చెప్పింది.
సౌత్ ఇండస్ట్రీలో పురుషాధిక్యత, కమర్షియల్ ఫార్ములాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. కొందరు నటీనటులు తమకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారని తమన్నా ఉదాహరణలతో సహా వివరించింది. తాను మాత్రమే కాకుండా, ‘అరుంధతి’ ఫేమ్ అనుష్క శెట్టి, లేడీ సూపర్ స్టార్ నయనతార, టాలెంటెడ్ బ్యూటీ సమంత వంటి వారు గత 10 నుండి 15 ఏళ్లకు పైగా స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నారంటే దానికి కారణం ఇదేనని చెప్పింది.
also read :రాష్ట్రపతి భవన్‌లో పండుగగా పద్మ అవార్డుల వేడుక.. పురస్కారాలు అందుకున్న విజేతలు వీరే!
పరిశ్రమలో ఎన్ని వివక్షలు, సవాళ్లు ఎదురైనా తమ నటనతో, వ్యక్తిత్వంతో సమాధానం చెబుతూ దూసుకుపోతున్న ఈ సీనియర్ స్టార్స్ జర్నీ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లకు ఒక గైడ్‌లా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి తమన్నా చేసిన ఈ బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై ఒక కొత్త చర్చకు తెరలేపాయనే చెప్పాలి.