E-Paper
Advertisement

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!
Advertisement

Andhra Development: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వారం కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా, పశుసంవర్ధక రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలోని 6 మిషన్లపై చర్చించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వా కల్చర్‌, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ సహా ఇతర రంగాలపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా.. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ఫార్మ్ టు హోమ్ విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేరేలా.. కొత్త మార్కెటింగ్ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు.. మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందని చెప్పారు.

ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పూర్తి ..

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యడవోలు సమీపంలో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు జులైలో శంకుస్థాపన చేస్తామన్నారు. కడప జిల్లా పులివెందులలో నిర్మాణంలో ఉన్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేశామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత పరిశీలనకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. ఆక్వా రంగానికి ప్రోత్సాహంగా కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే మత్స్యకారుల సంక్షేమం కోసం 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రైతులు, మత్స్యకారులు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

యువతకు సందేశం

Advertisement

విజయవాడలో కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళా వేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం ప్రారంభించారు. ఇదే కళావేదికలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌కు హాజరై.. కీలక విషయాలు వివరించారు. యువత కలలను నిజం చేసే బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు సీఎం చంద్రబాబు. పెద్దలు, టీనేజర్లు, జెన్‌-ఆల్ఫా, జెన్‌-జీ లాంటి ప్రతి తరానికి ఆలోచనలు మారిపోతున్నాయన్నారు. యువత ఆశయాలేంటి? ఎలాంటి చదువులు కావాలో చెప్పాలని.. తమ ప్రభుత్వం అండగా ఉంటుందని యువతకు సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. దేశ ఆర్థిక రంగానికి ఎంఎస్ఎంఈలే బ్యాక్ బోన్ అన్నారు. యువత కలల సాకారానికి ఎంఎస్ఎంఈ రంగమే సరైన వేదిక అని తెలిపారు. ఏపీలో 20 లక్షల 77 వేల MSME యూనిట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కోటీ 30 లక్షల కుటుంబాలున్నాయని కోటి MSME యూనిట్లు ప్రారంభించాల్సిన అవసరముందని చెప్పారు. వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌‌ప్రెన్యూర్‌ లక్ష్యం నెరవేరి తీరుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తయారైన ఉత్పత్తులని.. గ్లోబల్ మార్కెట్‌కు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Also read: కనీ వినీ ఎరుగని ఆఫర్.. 70 రోజుల పాటు రోజూ 3GB డేటా.. BSNL కొత్త ప్లాన్ చూశారా?

23 లక్షల కోట్ల పెట్టుబడులు..

Advertisement

చిన్న ఆలోచనని పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందన్నారు సీఎం చంద్రబాబు. వాటికోసం పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, హైవేస్‌, రైల్వేస్‌ ద్వారా లాజిస్టిక్స్‌, నీరు, కరెంట్‌ సౌకర్యాలన్నీ కల్పిస్తామన్నారు. ఏపీలో ఎంఎస్ఎంఈ, ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల పాలసీలని తీసుకొచ్చి.. ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 23 నెలల్లోనే 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి.. 23 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఇదే స్ఫూర్తితో మరికొన్ని కొత్త పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని సీఎం సూచించారు. ఎంఎస్ఎంఈ గ్రోత్‌ సమ్మిట్‌ సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలవాలని పిలుపునిచ్చారు.

138 పార్కులకు శంకుస్థాపనలు..

పారిశ్రామిక యూనిట్లను పెద్దఎత్తున ఏర్పాటు చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు చొప్పున 175 ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ఇప్పటికే 138 పార్కులకు శంకుస్థాపనలు చేయగా.. 19 పార్కులకు ప్రారంభోత్సవాలు చేశామన్నారు. ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలన్నారు సీఎం. మెటా, అమెజాన్‌, జోహో లాంటి సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు యువత భవిష్యత్తుకు, ఉపాధికి, నైపుణ్యాలకు కొత్త దారులని సృష్టిస్తాయని చెప్పుకొచ్చారు. మారుతున్న టెక్నాలజీ.. ఉద్యోగాల స్వరూపాలకు అనుగుణంగా టెక్నాలజీ స్కిల్‌ బిజినెస్‌ ఇంటిగ్రేషన్‌ మోడల్‌ని అనుసరిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు.

కోస్టల్‌కు బూస్ట్..

ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర తీరం అభివృద్ధికి సమగ్ర విజన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కోస్తాంధ్ర తీరం ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మారేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. సముద్ర తీర అభివృద్ధికి సంబంధించిన నిపుణులు, అధికారులతో సీఎం సమాలోచనలు జరిపారు. ఏపీలో ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మత్స్యకారులకు కలిగే ప్రయోజనాలపై పూర్తి స్థాయి అధ్యయనం నిర్వహించాలని ఆదేశించారు.

Also read: థియేటర్లను దడదడలాడిస్తున్న హారర్ థ్రిల్లర్… ఓటీటీ స్ట్రీమింగ్ పుకార్ల వెనకున్న నిజం ఇదే

ప్రజలకు ఇబ్బంది కలగొద్దు!

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినందువల్ల.. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందాలే గానీ.. నిబంధనలు అడ్డుకాకూడదన్నారు సీఎం చంద్రబాబు. అవసరమైన మేరకు బిజినెస్ రూల్స్ సవరించాలని సూచించారు. ఈ వారం ఆర్టీజీఎస్ పనితీరుతో పాటు వివిధ శాఖల కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో జాప్యం లేకుండా.. అత్యంత సులువుగా ప్రజలకు ప్రభుత్వ సేవలు అందేలా చూడాలని సీఎం సూచించారు.

అర్బన్ మొబిలిటీ ప్లానింగ్..

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం ఆయన అధ్యక్షతన జరిగిన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు, ఇతర ప్రతిపాదనలపై చర్చించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధానిలో పటిష్టమైన అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ ఉండాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు భవనాలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు 547 కోట్లు కేటాయించడానికి అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతిలో సమర్థవంతమైన అగ్నిమాపక నియంత్రణ కోసం సీఆర్డీఏకు సొంత ఫైర్ వింగ్ ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించారు. ఏలూరు నుంచి ప్రకాశం వరకు 9 జిల్లాలకు విస్తరించే అమరావతి ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు అంగీకారం తెలిపారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, ఎల్పీఎస్ లేఅవుట్లలో ఏటీఎంల ఏర్పాటు, 495 మంది రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు లాంటి అంశాలను అథారిటీ ఆమోదించింది.

యోగాంధ్ర-2026

యోగాంధ్ర-2026 ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా డేకు సంబంధించి ఈ వారం రివ్యూ చేశారు. జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరావతిలో 25 వేల మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. హెల్త్, మానవవనరులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, దేవాదాయ, ఐటీ శాఖల సమన్వయంతో యోగాంధ్ర-2026 నిర్వహిస్తున్నారు. ఇందుకోసం.. జిల్లాకు 25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.

Also read: సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. హరీష్ రావుపై మేడి రవిచంద్ర ఫైర్

ఏపీకి సహకరించండి!

ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫైబర్‌కు ప్రోత్సాహం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ని కోరారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో సాగు చేస్తున్న వివిధ పంటల ద్వారా పీచు, నార, ఫైబర్ ఉత్పత్తి అవుతుందని, దీనిని వాణిజ్య స్థాయిలో విలువ జోడించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సీఎం కోరారు. పీచు వెలికితీతతో పాటు వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడే ఉద్యానవన పంటల నివేదికను కేంద్రమంత్రికి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో కొబ్బరి పీచు పరిశ్రమను బలోపేతం చేసేలా కాయిర్ బోర్డ్ డ్వాక్రా నెట్‌వర్క్ ద్వారా మెకనైజ్డ్ హస్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, కాయిర్ జియో టెక్స్‌టైల్స్ పరిశ్రమల స్థాపనకు జౌళి శాఖ సహకారం కావాలని సీఎం కోరారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక వస్త్ర పరిశ్రమ క్లస్టర్లకు సమీపంలో ఉన్న కుప్పంలో పీఎం మిత్రా పార్కును ఏర్పాటు చేయాలని, అమరావతిలో చేనేత హస్త కళల మ్యూజియం ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

దిశానిర్దేశం..

ఏపీలోని ఎయిర్ పోర్టులు, పోర్టుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని.. సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి గడువుని నిర్దేశించుకొని పనిచేయాలని స్పష్టం చేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయల కల్పన, ఆర్టీసీపై ఈ వారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణం, జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం ఎయిర్‌పోర్టుల నిర్మాణం, భూ సేకరణ, నిధుల సమీకరణ, కేంద్రం నుంచి అనుమతుల అంశాలపై.. సీఎం దిశానిర్దేశం చేశారు.

విద్యుత్‌పై రివ్యూ..

ఈ వారం విద్యుత్ శాఖపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే ఆరు నెలల ప్రణాళిక, పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈ-డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెడ్‌క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం లాంటి అంశాలపై చర్చించారు.

Also Read: నాగారం గ్రామంలో కుల బహిష్కరణ ఆరోపణలు కలకలం

ఏపీ మోడల్..

వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ వారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఏపీలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి థీమాటిక్ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించారు. C4IR ఏర్పాటుపై ఏపీ ట్రాన్స్ కో-వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో గతంలోనే ఒప్పందం కుదిరింది. గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్సిషన్, సైబర్ రెసిలియెన్స్ లాంటి రంగాలపై C4IR అధ్యయనం చేయనుంది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సూచించారు. వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి మోడళ్లను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి బెస్ట్ మోడల్ తయారు చేయాలని ఆదేశించారు.

జీరో ఎఫ్ఐఆర్..

సైబర్ నేరాల అడ్డుకట్టకు జీరో ఎఫ్ఐఆర్ విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు సూచించారు. బాధితులు సైబర్ వార్ రూమ్‌కు ఫోన్ చేసిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. బ్యాంకులను అప్రమత్తం చేసి గోల్డెన్ అవర్ టైంను వినియోగించుకుని అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ కాకుండా చూడాలని సూచించారు. పోలీస్ పెట్రోలింగ్ తరహాలోనే సైబర్ పెట్రోలింగ్ జరగాలని, ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు.

Also read: ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

Related News

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

డీలిమిటేషన్‌పై మోడీ సర్కార్ సరికొత్త వ్యూహం.. సౌత్ స్టేట్స్‌కు చెక్ పడినట్లేనా?

Big Stories

Advertisement
×