Mahalakshmi Scheme: స్వేచ్చ బ్యూరో: మహాలక్ష్మి పథకం రాష్ట్రంలోని మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు బాటలు వేస్తుంది. ఈ పథకానికి రోజురోజుకూ ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతుండటంతో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రవాణా సదుపాయాలను నిరంతరం విస్తరిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది (2026) జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.2025 త్రైమాసికంలో 3,467.91 లక్షల (34.67 కోట్లు) మంది ప్రయాణించగా, 2026 నాటికి అది ఏకంగా 3,565.11 లక్షలకు (35.65 కోట్లు) చేరింది. కేవలం ఈ మూడు నెలల కాలంలోనే గత ఏడాదితో పోలిస్తే అదనంగా 97.20 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లను నిరంతరం పరిశీలిస్తూ, బస్సుల సంఖ్యను, ట్రిప్పులను పెంచడం ద్వారా మహిళలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అందిస్తోంది.
ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాలు: ఖమ్మం- ఇల్లందు, ఇల్లందు-కొత్తగూడెం, ఖమ్మం -మధిర, సూర్యాపేట-ఖమ్మం
ఉత్తర తెలంగాణ కరీంనగర్ రీజియన్: హుస్నాబాద్ -కరీంనగర్, కరీంనగర్ – గోదావరిఖని / మందమర్రి, హన్మకొండ -కరీంనగర్
వరంగల్, ఉమ్మడి నల్గొండ రీజియన్: సంగారెడ్డి- హన్మకొండ, హన్మకొండ – తొర్రూరు, నల్గొండ – దేవరకొండ, నల్గొండ – సూర్యాపేట, దేవరకొండ – మిర్యాలగూడ, అచ్చంపేట – దేవరకొండ
హైదరాబాద్ రాజధాని కనెక్టివిటీ: సిద్దిపేట -జేబీఎస్, నాగర్‌కర్నూలు -హైదరాబాద్, కోస్గి – హైదరాబాద్
నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ రీజియన్: బాన్సువాడ – నిజామాబాద్, బోధన్ – నిజామాబాద్, కామారెడ్డి – రామాయంపేట
దక్షిణ తెలంగాణ రీజియన్: కల్వకుర్తి – మహబూబ్‌నగర్
మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి మహిళా ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌ను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో డిపో మేనేజర్లు, అధికారులు సమీక్షిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు ట్రిప్పులను, బస్సులను సమకూరుస్తున్నాం. రాబోయే పండుగల సీజన్లలో కూడా మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరిన్ని ప్రత్యేక సర్వీసులు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్టీసీ వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు.
Also read: ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240.. సామాన్యుడు ఎలా బతకాలి? రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ప్రశ్నల వర్షం