E-Paper
Advertisement

Nagababu Post on Pawan: నిందలు ఎందుకు మోస్తావ్.. పవన్ పై నాగబాబు స్పెషల్ పోస్ట్

Nagababu Post on Pawan: నిందలు ఎందుకు మోస్తావ్.. పవన్ పై నాగబాబు స్పెషల్ పోస్ట్
Advertisement

Naga Babu Special Tweet on Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్.. పార్టీని ప్రారంభించిన నుంచి ఇప్పటివరకు ఆయనకు అండగా ఉన్న వ్యక్తి అన్న నాగబాబు. పెద్దన్న చిరంజీవి అయినా అప్పుడప్పుడు మాత్రమే పవన్ తో మాట్లాడేవాడేమో కానీ, నాగబాబు మాత్రం దగ్గరుండి పవన్ తోనే నడిచాడు. తమ్ముడు ప్రజల కోసం ఏదో చేయడానికి వెళ్తున్నాడు. అతడికి అండగా ఉండాలనే సంకల్పంతో పవన్ వెన్నంటే నిలబడ్డాడు. పవన్ ఏది చెప్తే అది చేస్తూ వస్తున్నాడు. జనసేన కార్యకర్తగా ప్రచారాల దగ్గర నుంచి పవన్ ఆరోగ్య విషయాల వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.

ఇక అన్న చిరును కానీ, తమ్ముడు పవన్ ను కానీ ఎవరైనా ఏదైనా అంటే నాగబాబు విశ్వరూపం చూపిస్తాడు. కౌంటర్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తాడు. అంతలా ఈ ముగ్గురు అన్నదమ్ముల బంధం ఉంటుంది. రేపే ఎలక్షన్స్. ఏపీలో ఈసారి జనసేన గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేసారు. టాలీవుడ్ మొత్తం పవన్ కు సపోర్ట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రయాణంలో విజయం సాధించాలని కోరుతూ సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు అందరూ పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఇక ఇంత ప్రయాణంలో జనసేనానికి తోడుగా నిలిచిన నాగబాబు సైతం.. తమ్ముడు గెలుపు సిద్ధమైందని తెలుపుతూ ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు.

Advertisement

Also Read: Balakrishna, pawankalyan family vote: మంగళగిరిలో పవన్, హిందూపురంలో బాలయ్య దంపతులు..

పవన్ జుట్టు సరిచేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ “నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడ ఎందుకు నిలబడతావ్ అని అడిగితే ‘చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా’ అని..నీతో నడవని వాళ్ల కోసం కూడ ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే ‘వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని.. అప్పట్నుంచి అడగటం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను..సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది.. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు తమ్ముడు కోసం అన్నగా నువ్వు నిలబడిన తీరు ఎంతో అద్భుతమని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Tdp Vs Ysrcp cadre fighing at Gurajala: పోలింగ్ కేంద్రాల ఉద్రిక్తత, కార్యకర్తల ఫైటింగ్, లాఠీ‌ఛార్జ్, ఈవీఎంలు ధ్వంసం

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×