E-Paper
Advertisement

ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?

ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?
Advertisement

Prakasam Crime: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని అత్యంత కీలకమైన, ప్రజాధనాన్ని భారీగా ఆర్జించిపెట్టే ‘మైన్స్ అండ్ జియాలజీ’ (గనులు, భూగర్భ వనరుల) శాఖలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ విధి నిర్వహణలో పారదర్శకత ఉండాల్సిన ఈ కార్యాలయంలో ఇప్పుడు మీడియా ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయి.

అసలేం జరుగుతోంది అక్కడ?

సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖకైనా మీడియా ప్రతినిధులు వెళ్లడం, అధికారులను కలిసి ప్రజల సమస్యలపై లేదా విధానపరమైన నిర్ణయాలపై సమాచారం సేకరించడం నిత్యకృత్యం. కానీ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ ప్రధాన కార్యాలయంలో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ శాఖ వైపు మీడియా ప్రతినిధులు అడుగుపెడితే చాలు, సెక్యూరిటీ సిబ్బంది హడలిపోతున్నారు. “ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి… మీడియాను లోపలికి అనుమతించేది లేదు” అంటూ గేటు వద్దే నిలిపివేస్తున్నారు. కనీసం సెక్యూరిటీ దగ్గర ఉన్న ఎంట్రీ బుక్ లో సైతం రాయొద్దని ఆదేశాలను అధికారులు ఇవ్వడం గమనార్హం.

విస్తుపోయే నిజాలు..

Advertisement

అసలు లోపలికి ఎవరికి ప్రవేశం ఉంది అని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం అధికారిక కాంట్రాక్టర్లు, మైనింగ్ లీజుదారులు, కొందరు ప్రత్యేకంగా చక్కబెట్టే దళారులు, ఉద్యోగులకు మాత్రమే ప్రస్తుతం రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తోంది. సాధారణ పౌరులు, బాధితులు లేదా వాస్తవాలు రాబట్టాలని వెళ్లే జర్నలిస్టులకు మాత్రం ‘నో ఎంట్రీ’ అంటూ సెక్యూరిటీ సిబ్బంది పేర్కొంటున్నారు.

Also Read: గగనతనంలో గల్లి చాయ్.. ఎయిర్ ఇండియా సరికొత్త ప్రయోగం!

అంతా రహస్యమేనా? తెరవెనుక దందాలు బయటపడతాయనా?

Advertisement

రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపద అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న క్వారీలు, కంకర అక్రమాలు, ఇసుక దోపిడీపై ఎప్పటికప్పుడు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మైన్స్ అండ్ జియాలజీ శాఖలో ప్రతి రోజు కోట్ల రూపాయల అక్రమ వసూళ్లు, పైస్థాయి అధికారుల అండదండలతో సాగుతున్న బినామీ దందాలు అన్నీ ఇన్నీ కావు.ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీలు ఎగవేత.నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా జరుపుతున్న తవ్వకాలు. బదిలీలు, పర్మిట్ల జారీలో సాగుతున్న భారీ వసూళ్ల పర్వం.ఇలాంటి అవినీతి బాగోతాలు, అక్రమ దందాల ఫైళ్లు ఏ క్షణాన మీడియా కంట పడతాయోనన్న భయమే అధికారులను ఈ నిరంకుశ నిర్ణయాలు తీసుకునేలా చేస్తోందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు ఇలా తలుపులు మూసుకుని, గోప్యత పాటించడం వెనుక పెద్దఎత్తున అవినీతి దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.

పారదర్శకతకు తూట్లు.. మేల్కొనేనా ప్రభుత్వం?

ప్రజాధనంతో నడిచే ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత లోపించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు. మీడియాను అడ్డుకోవడం ద్వారా నిజాలను కప్పిపుచ్చలేరని, తెరవెనుక జరిగే చీకటి ఒప్పందాలను ఎప్పటికీ దాచలేరని ఇప్పటికైనా ఉన్నతాధికారులు గ్రహించాలి. తక్షణమే ఈ ఆంక్షలను ఎత్తివేసి, మైన్స్ శాఖలో ప్రవేశాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.

Also Read: కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లకు రేవంత్ షాక్.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటల్లో ఏం జరగబోతోంది?

Tags

Related News

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!

Big Stories

Advertisement
×