E-Paper
Advertisement

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!
Advertisement

ఎంతటి మార్పు. ఆహార్యంలోనే కాదు.. మాటల్లో, చేతల్లో.. ప్రసంగాల్లో కూడా. తెలుగు ఉచ్ఛరణే సరిగా రాని లోకేశ్‌ ఇప్పుడు ఛమత్కార సంభాషణలు చేసే స్థాయికి ఎదిగాడంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ.. తనను తాను డోలో 650 మాత్రగా అభివర్ణించుకోవడం.

ఆంధ్ర ప్రదేశ్‌ను పెట్టుబడుల హబ్‌గా మార్చే క్రమంలో ఆయన పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్న తీరు.. తీసుకుంటున్న చొరవ మంచి ఫలితాలనే ఇస్తున్నాయి.ఈ డోలో మాత్ర మంత్రాన్ని కూడా పారిశ్రామికవేత్తల్లో కొత్త ఊపును తెచ్చేందుకు, ఆంధ్రలో పెట్టుబడులు పెట్టేలా ఆసక్తి, అభయం ఇచ్చేందుకేనని స్పష్టమవుతోంది.

Advertisement

పరిశ్రమలు పెట్టే క్రమంలో.. పెట్టుబడి దారులకు, పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినా.. తననే గుర్తు చేసుకుంటారని, తనను సంప్రదిస్తే చాలు.. అన్నీ క్లియర్ అయిపోతాయనే భావనను తీసుకొచ్చానని చెప్పుకున్నాడు. దీనికి ఆయన చమత్కారంగా.. అందుకే వారికి నేనొక డోలో -650 గా మారానని తనపై తనే చమత్కరించుకోవడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో రెడ్ బుక్‌ పేరిట కొంచెం అగ్రెసివ్‌గా కామెంట్లు చేయడం.. లోకేశ్‌ ఆవేశపరుడనే విధంగా  కొంచెం నెగెటివ్‌ ముద్ర వేసింది.  ఆ తరువాత క్రమంలో ఆయన మాటతీరు క్రమంగా మార్చుకుంటూ వస్తున్నాడు. సబ్జెక్టు ప్రధానంగా తన ప్రసంగాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు.

Advertisement

ప్రతిపక్ష పార్టీకి గట్టి కౌంటర్లు ఇస్తూనే… సినిమా పంచులు కొడుతూనే అభివృద్ధిపైనా ప్రధానంగా దృష్టి పెడుతున్నాడు. కొంత కాలం క్రింత ఎలా ఉండే.. ఇప్పుడెలా మారాడు..? అని అంతా ఆశ్చర్యపడేలాగే లోకేశ్‌ తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. తనను పప్పు అని వెక్కిరించిన నోళ్లతోనే ఔరా ..! ఎంత మార్పు.. అని అనిపించుకునే ప్రయత్నమైతే చేస్తున్నాడు లోకేశ్‌.

తెలుగు మాట్లాడటం కూడా రాని ప్రతికూల పరిస్థితులను తనకు తానుగా క్రాస్‌ చేసుకుని, తీర్చిదిద్దుకుని… తనపైనే పంచులు వేసుకుంటూ చమత్కారాలు చెప్పే దాకా ఎదిగాడంటున్నారు ఏపీ తెలుగు తమ్ముళ్లు. అంటే దాల్‌ టు డోలో దాకా… వెటకారాల నుంచి చమత్కారాల దాకా తను ఎదిగిన తీరు మెచ్చుకోదగిందేనంటున్నారు విమర్శకులు సైతం.

చంద్రబాబు సీనియారిటీకి తగ్గట్టుగా చాలా తక్కువ కాలంతో తనను తాను పరిణతి చెందిన రాజకీయ నేతగా మార్చుకునే క్రమంలో లోకేశ్‌ కొంత సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక కాబోయే సీఎం తనే అనే రీతిలో టీడీపీ ప్రచారం చేసుకుంటున్నది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు..గా లోకేశ్‌కు చంద్రబాబు అన్ని సమీకరణాలను  అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నాడు. ఇదే జరిగితే.. దాల్‌ టు డోలో.. డోలో టు సీఎం.. దాకా లోకేశ్‌ ప్రస్థానం కొనసాగనుంది.

Tags

Related News

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

తెలంగాణలో పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్.. పార్టీ పటిష్టం కోసం వేసిన స్కెచ్ ఇదే!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

Big Stories

Advertisement
×