Rising Prices: స్వేచ్ఛ బ్యూరో: మార్కెట్ లో క్రమంగా పెరుగుతున్న వస్తువుల ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అధిక ధరల ప్రభావంతో సామాన్య ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ యుద్ధం కారణంగా ఒకపక్క పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగగా క్రమంగా వ్యాపార రంగంలో ప్రతి వస్తువుపై వ్యాపారులు కృత్రిమంగా రేట్లు పెంచడంతో సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ప్రస్తుతం గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొన్నడంతో కొబ్బరికాయ కూడా గతంలో 25 రూపాయలు ఉంటే ప్రస్తుతం 35 రూపాయలుగా అందుబాటులో ఉంది ఔషధ రంగంలో ప్రతి టాబ్లెట్ ధరలు పెరిగాయి. చక్కెర బెల్లం ధరలలో పెరుగుదల క్రమంగా ఉంది.
వ్యవసాయ రంగానికి సంబంధించి పంటలలో వాడే డిఏపి కూడా భారీ స్థాయిలో రేటు పెరిగింది. దీనికి తోడు ఎల్ నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు పడకపోవడంతో నేడు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మిరప, పత్తి, వరి, కంది, కూరగాయలు పండించే రైతులు వర్షాలు లేక నీటి ఎద్దడి కారణంగా దిగుబడులపై గణనీయంగా ప్రభావం పడే అవకాశం ఉంది. పెరిగిన పెట్టుబడులకు వచ్చే ఆదాయానికి వ్యత్యాసం ఉండడంతో రైతులు బయట పంటల పెట్టుబడులకు తెచ్చిన అప్పులు అలాగే మిగిలిపోవడంతో వాటికి వడ్డీలు పెరిగి అప్పులపాలు అవుతామనే ఆందోళనలో రైతులు ఉన్నారు.
Also Read: బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?
వేసిన పంటలు బతికించుకునేందుకు వర్షాలు కురువకపోవడంతో బోర్లు విరివిగా వేస్తున్నారు. బోగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఒకటికి బదులుగా రెండు మూడు వేయాల్సి వస్తోంది. పడిన నీటికి మోటర్ తోపాటు పైపుల ధరలుసైతం పెరిగాయి.పట్టణాల్లో గ్రామాల్లో నిత్యం తిని కూరగాయలు ధరలు కూడా భగ్గుమంటున్నాయి. గత నెలలో ప్రతిదీ రూ. 30 నుండి 40 రూపాయలకు లభిస్తే నేడు కేజీ 60 నుంచి 80 రూపాయల చొప్పున దొరుకుతున్నాయి. ప్రతి వస్తువు ధరలు పెరగడంతో ఏం తినేటట్టు లేదు ..ఏం తాగేటట్టు లేదని సామెతను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు స్వల్పంగా పెంచితే వాటిని ఆసరాగా చేసుకొని నేడు వ్యాపారులు, బ్రోకర్లు ధరలు డబుల్ చేస్తూ కృత్తిమ కొరత సృష్టిస్తున్నారు. గ్రామాల్లో కూడా ప్రతి వస్తువుల్లో కల్తీ కూడా జరిపి ఒకరకంగా భయంకర వ్యాధులు రావడానికి కారణం అవుతున్నారు. బయట ఏది కొనాలన్నా అనారోగ్యం పాలవుతామనే ఆందోళన తల్లిదండ్రులపై ఉంది. ఏది ఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న ధరలను తగ్గించి కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని దిగువ తరగతి ప్రజలు కోరుతున్నారు.
Also read: 30 ఏళ్లు వచ్చేలోపు..ఈ 7ట్రిక్స్ పాటిస్తే, మీ ఫ్యూచర్ సెట్టైనట్టే!