E-Paper
Advertisement

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?
Advertisement

Khairatabad: స్వేచ్చ బ్యూరో: ఖైరతాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీలో టికెట్‌ రేసు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తనకు మరోసారి అవకాశం దక్కుతుందనే ధీమాతో పార్టీ ముఖ్య నేతలను కలుస్తుండగా.. మరోవైపు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు చికోటి ప్రవీణ్‌, ఇంద్రసేనారెడ్డి, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యుటివ్ మెంబ‌ర్ జూటూరు కీర్తిరెడ్డి కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, కిషన్‌రెడ్డి మద్దతు ఎవరికి ఇస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో ప్రధానంగా సాగుతోంది.

కిషన్ రెడ్డి మద్దతెవరికి..

ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గం. ఆయన పార్లమెంట్ పరిధి కావడంతో ఎంత పెద్ద నేత అయినా సరే.. ఆ సెగ్మెంట్ పరిధిలో వేలు పెట్టాలంటే కాస్త వెనకా ముందు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మద్దతెవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయన మద్దతు ఎవరికిస్తే.. టికెట్ ఆయనకే దక్కుతుందనేది జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలోనే తేలింది. దీంతో ఆయన మద్దతు అత్యంత కీలకం కావడంతో టికెట్ దక్కేది ఎవరికనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి..

Advertisement

ఖైరతాబాద్‌ బైపోల్‌ను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. దీంతో అభ్యర్థి ఎంపికపై పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీకి ఉన్న బలాన్ని మరింత పెంచేందుకు సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఒకరు. నియోజకవర్గంలో తనకు ఉన్న పాత పరిచయాలు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, పార్టీ కోసం చేసిన కార్యక్రమాలు తనకు అనుకూలంగా మారతాయని ఆయన వర్గం భావిస్తోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలను కలిసి తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ మరోసారి అవకాశం ఇస్తే ఖైరతాబాద్‌లో బీజేపీని గెలిపించి చూపిస్తానన్న ధీమాతో చింతల ఉన్నట్లు తెలుస్తోంది.

Also read: నిందితుల కోసం కదులుతున్న కారుపైకి దూకిన పోలీస్.. ఏకంగా 40 కిలో మీటర్లు కళ్లు చెదిరే ఛేజ్!

జూటూరు కీర్తిరెడ్డి..

Advertisement

ఇదిలాఉండగా బీజేపీ స్టేట్ ఎగ్జిక్యుటివ్ మెంబ‌ర్ జూటూరు కీర్తిరెడ్డి కూడా టికెట్‌ కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అవకాశం లభిస్తే గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానన్న ధీమాతో ఉన్నట్లు ఆమె వర్గం చెబుతోంది. కొత్త ముఖానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన పార్టీ నాయకత్వంలో ఉంటే తన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్న ఆశాభావంతో కీర్తిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

చికోటి ప్రవీణ్‌..

ఇకపోతే.. చికోటి ప్రవీణ్‌ కూడా టికెట్‌ రేసులో తన అవకాశాలపై ధీమాతో ఉన్నారు. హిందుత్వ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ రాజకీయంగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్న ఆయన.. బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా తనకు అనుకూలంగా మారవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ తరఫున బలమైన ప్రత్యర్థి లేకపోతే ఆ అంశం కూడా తనకు కలిసొస్తుందని చికోటి వర్గం అంచనా వేస్తోంది. నియోజకవర్గంలో పార్టీ సంప్రదాయ ఓటర్లతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్‌ కూడా ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆయన కీలక పాత్ర..

ఒకపోతే.. ఖైరతాబాద్ బరిలో దిగేందుకు బొల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి తనకు అవకాశం దక్కుతుందనే ఆశతో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఖైరతాబాద్‌ బరిలో బీజేపీ తరఫున పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్న ఆయన.. పార్టీ ఒక్క అవకాశం ఇస్తే తన సత్తా చూపిస్తానన్న ధీమాతో ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో తనకు ఉన్న అనుబంధం, స్థానికంగా చేసిన రాజకీయ కార్యక్రమాలు తనకు అనుకూలంగా మారతాయని ఆయన వర్గం భావిస్తోంది. అయితే.. నలుగురు ఆశావహులు తమకు అనుకూలంగా ఉన్న అంశాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాని భావిస్తుండగా కిషన్‌రెడ్డి వైఖరి ఏంటనేది తీవ్ర ఆసక్తిని పెంచుతోంది. ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక బాధ్యతల్లో ఆయన కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఆయన అభిప్రాయం ఎటువైపు ఉంటుందన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

బరిలోకి దిగేది ఎవరు?

ఎవరికి వారు టికెట్‌ తమకేనన్న ధీమాతో ఉన్నారు. పార్టీ అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తామంటూ ఆశావహులు చెబుతున్నారు. దీంతో అభ్యర్థి ఎంపిక బీజేపీలో ఉత్కంఠ రేపుతోంది. అయితే తుది నిర్ణయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే అని చెబుతుండటం గమనార్హం. అభ్యర్థి ఎంపికలో పార్టీ బలం, నియోజకవర్గంలో వ్యక్తిగత పరిచయాలు, సామాజిక సమీకరణాలు, ఎన్నికల నిర్వహణ సామర్థ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎవరికి వారు టికెట్‌ తమకేనని, అవకాశమిస్తే గెలిచి చూపిస్తామని చెబుతున్నారు. కానీ కమలం గుర్తుపై బరిలోకి దిగేది ఎవరు? కిషన్‌రెడ్డి మద్దతు ఎవరికి? అనే అంశాలే.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో కీలకంగా మారనున్నాయి. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికనే అంశంపైనే టికెట్, గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. మరి ఆయన మద్దతు ఎవరికనేదే ఉత్కంఠను రేకిత్తిస్తోంది.

Also read: యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

Tags

Related News

రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

బిఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి..?

Big Stories

Advertisement
×