E-Paper
Advertisement

బెంగళూరు ఇంజనీర్ సంచలన ప్రయోగం.. రోడ్లపై గుంతలకు ఏఐ మాస్టర్ ప్లాన్!

బెంగళూరు ఇంజనీర్ సంచలన ప్రయోగం.. రోడ్లపై గుంతలకు ఏఐ మాస్టర్ ప్లాన్!
Advertisement

AI Pothole: రోడ్ల మీద గుంతలు పడితే మనం చేసేది ఏంటి? విసుక్కుంటాం లేదా అధికారులకు శాపనార్థాలు పెడతాం. కానీ బెంగళూరు టెకీ గౌరవ్ సేన్ మాత్రం ఆ సమస్యకే ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. తన కార్ డ్యాష్‌క్యామ్‌కి ఏఐ టెక్నాలజీని జోడించి రోడ్డు మీద ఉన్న గుంతలను ఆటోమేటిక్‌గా గుర్తించే యాప్ తయారుచేశాడు. అంతటితో ఆగకుండా.. ప్రభుత్వం దగ్గరున్న 2,900 కాంట్రాక్ట్ డాక్యుమెంట్లను ఈ యాప్‌కి లింక్ చేశాడు. దీనివల్ల ఏ రోడ్డు మీద గుంత ఉందో చెప్పడమే కాక.. ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఎవరు? బాధ్యత వహించాల్సిన అధికారి ఎవరు? అనే వివరాలను బయటపెట్టేస్తున్నాడు.

ఓపెన్ ఏఐ టూల్స్..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కేవలం కోడింగ్, చాటింగ్ మాత్రమే కాదు.. సొసైటీలో సమస్యలను తీర్చే పవర్‌ఫుల్ వెపన్ అని నిరూపించాడు గౌరవ్ సేన్. ఓపెన్ ఏఐ టూల్స్ సహాయంతో ఒక సిస్టమ్ తయారు చేసి.. కారుకి ఫిట్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు పడే గుంతల సైజ్, వాటి జీపీఎస్ లొకేషన్, ఆ టెండర్ నంబర్ అన్నీ క్షణాల్లో డేటాబేస్ నుంచి తీసి ఆఫీసర్ ముందు ఉంచుతుంది. ప్రజా సమస్యలపై అధికారులను ప్రశ్నించడానికి.. బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపడానికి ఏఐ ఎంతలా ఉపయోగపడుతుందో గౌరవ్ చేసిన ఈ ప్రయోగమే ఒక ఎగ్జాంపుల్.

Advertisement

Also read: అసెంబ్లీకి పవన్ ఎందుకు రాలేదు? క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల!

ఈ యాప్ స్పెషాలిటీ..

ఫిర్యాదుల నుంచి అధికారులు తప్పించుకోకుండా చూడటమే.. ఈ ఏఐ యాప్ స్పెషాలిటీ. డ్యాష్ క్యామ్‌తో రికార్డ్ అయ్యే రోడ్డు ఫుటేజ్‌ను ఏఐ అనలైజ్ చేస్తుంది. గుంత ఎక్కడుందో లొకేషన్ మార్క్ చేస్తుంది. ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ పేరు.. కంప్లైంట్ చేయాల్సిన ఆఫీసర్ డీటెయిల్స్ 4 సెకన్లలో చేతికి ఇచ్చేస్తుంది. మన ప్రభుత్వం కూడా ఈ సిస్టమ్ వాడితే రోడ్లు దెబ్బకి బాగుపడిపోతాయని.. మన దగ్గర కూడా ఈ యాప్ తీసుకురావాలని జనాలు కోరుతున్నారు.

Advertisement

Also Read: కేకులు, తందూరీలు ఇంట్లోనే చేసుకోవాలంటే.. బడ్జెట్‌లో లభించే టాప్ కన్వెక్షన్ ఓవెన్లు ఇవే!

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×