E-Paper
Advertisement

‘పెద్ది’ సినిమాలో రైలు వెనుక ఇంత కథ ఉందా? అసలు ఆ ట్రైన్ ఇండియన్ రైల్వేది కాదా?

‘పెద్ది’ సినిమాలో రైలు వెనుక ఇంత కథ ఉందా? అసలు ఆ ట్రైన్ ఇండియన్ రైల్వేది కాదా?
Advertisement

Shakuntala Railway History: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేలలో ఒకటిగా కొనసాగుతోంది. అయితూ, భారతీయ సినిమాల్లో ఎన్నో రైళ్లు కనిపించాయి. అలాగే, తాజాగా ‘పెద్ది’ సినిమాలోనూ ఓ రైలు కనిపించింది. అయితే, ఈ రైలుకు మాత్రం ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ రైలు శకుంతల రైల్వేకు సంబంధించినది. భారతదేశంలో ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగిన అరుదైన రైల్వే లైన్లలో ఇది ఒకటి. మహారాష్ట్రలోని యవత్మల్ నుంచి అచల్‌ పూర్ వరకు మూర్తిజాపూర్ మీదుగా ఈ మార్గం ఉంటుంది.  ఇంతకీ ఇది ప్రైవేట్ లైన్ గా ఎందుకు ఉందంటే..

బ్రిటిష్ కాలంలో ప్రారంభం

శకుంతల రైల్వే చరిత్ర వందేళ్లకు పైగానే ఉంది. 1910లో బ్రిటిష్ సంస్థ కిల్లిక్ నిక్సన్ ఈ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేసింది. అప్పట్లో విదర్భ ప్రాంతంలోని పత్తిని రవాణా చేసేందుకు దీనిని తీసుకొచ్చారు. మహారాష్ట్రలో పండే పత్తిని రైళ్ల ద్వారా ముంబైకి తరలించి, అక్కడి నుంచి సముద్ర మార్గంలో ఇంగ్లాండ్‌ కు పంపించేవారు. ముఖ్యంగా మాంచెస్టర్‌లోని వస్త్ర పరిశ్రమకు ఈ పత్తి ఎంతో ఉపయోగపడేది. అందుకే శకుంతల రైల్వేకు అప్పట్లో వాణిజ్యపరంగా మంచి ప్రాధాన్యం ఉండేది.

ఇండిపెండెన్స్ తర్వాత కూడా ప్రైవేట్ రైల్వేగానే..

Advertisement

1951లో భారతదేశంలోని రైల్వే వ్యవస్థ జాతీయీకరణ జరిగినప్పుడు కూడా శకుంతల రైల్వే సాధారణ భారతీయ రైల్వే వ్యవస్థలో పూర్తిగా కలిసిపోలేదు. ప్రైవేట్ లైన్ గానే కొనసాగింది. ఈ రైల్వే సంస్థకు ప్రభుత్వం రాయల్టీ కూడా చెల్లించింది.  మరోవైపు, ఈ మార్గంలో రైళ్లను నడిపేందుకు ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతున్న నేపథ్యంలో అలాగే కొనసాగించింది.

నెమ్మదిగా నడిచే రైలు

శకుంతల రైల్వేలో నారో-గేజ్ పట్టాలు ఉండేవి. ఈ మార్గంలో రైళ్లను నడిపేందుకు ZDM-5 డీజిల్ లోకోమోటివ్‌లను ఉపయోగించారు. గంటకు సుమారు 20 కిలోమీటర్ల వేగంతోనే రైలు ప్రయాణించేది. వేగం తక్కువగా ఉన్నప్పటికీ ఈ రైలు స్థానిక ప్రజల జీవితాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, మార్కెట్లు, ఇతర అవసరాల కోసం ప్రయాణించే వారికి చాలా కాలం పాటు ఆధారంగా నిలిచింది.

2020లో ప్రయాణికుల సేవలకు ముగింపు

Advertisement

కాలం మారడంతో ఈ రైల్వే నిర్వహణ కష్టంగా మారింది. నారో-గేజ్ మార్గం నిర్వహణతో పాటు రైల్వేను ఆధునీకరించాల్సిన అవసరం పెరిగింది. చివరకు 2020లో ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్ల సేవలను నిలిపివేశారు. అయితే, శకుంతల రైల్వే కథ అక్కడితో ముగియలేదు. పాత నారో-గేజ్ లైన్‌ను బ్రాడ్-గేజ్‌గా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ మార్గాన్ని ఆధునీకరించి భారతీయ రైల్వే నెట్‌ వర్క్‌ లో మరింత సమర్థవంతంగా అనుసంధానించేందుకు చర్యలు చేపడుతున్నారు. 1,676 మిల్లీమీటర్ల బ్రాడ్ గేజ్ కు మార్చితే, ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలు మెరుగుపడే అవకాశం ఉంది.  ‘పెద్ది’ సినిమాలో కనిపించే ఆ రైలు కేవలం సినిమా కోసం ఉపయోగించిన రైలు మాత్రమే కాదు. దాని వెనుక బ్రిటిష్ కాలం, పత్తి వ్యాపారం, స్థానిక ప్రజల జీవితం, భారత రైల్వే చరిత్రతో ముడిపడిన శతాబ్దానికి పైగా కథ ఉంది.

Read Also: చర్లపల్లి–గోరఖ్‌ పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్.. అక్టోబర్ 2 నుంచి రాకపోకలు షురూ!

Tags

Related News

గాల్లోకి ఎగిరిన తొలి ఎలక్ట్రిక్ విమానం.. అరగంట పాటు ఆకాశంలో చక్కర్లు!

విశాఖ – భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. రూట్లు, ఛార్జీలు, టైమింగ్స్ పూర్తి వివరాలు!

చర్లపల్లి–గోరఖ్‌ పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్.. అక్టోబర్ 2 నుంచి రాకపోకలు షురూ!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. స్టేషన్లలో నీళ్లు తాగారో అంతే సంగతులు!

ఆరావళి ఎక్స్‌ ప్రెస్‌లో రచ్చ.. నటి అంతరా బెనర్జీ అరెస్ట్!

మాల్దీవ్స్ కు వెళ్లే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. ఇక అందుబాటులోకి మరిన్ని విమానాలు!

సెప్టెంబర్ 1 నుంచి ఆలయాల్లో మొబైల్ ఫోన్ల నిషేధం, ప్రభుత్వం కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×