E-Paper
Advertisement

తెలంగాణ రేషన్ కార్డుల్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాని ఫొటో వివాదం వెనుక అసలు నిజాలివే!

తెలంగాణ రేషన్ కార్డుల్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాని ఫొటో వివాదం వెనుక అసలు నిజాలివే!
Advertisement

Smart Ration Cards: రేవంత్‌ సర్కార్‌ ఇచ్చిన మాటప్రకారం 3 కోట్ల 40లక్షల మందికి సర్కార్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. పంద్రాగస్టు సందర్భంగా కోటి స్మార్ట్‌కార్డులను పంపిణీ చేశారు. నకిలీలు వంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా స్మార్ట్‌ కార్డులను రూపొందించారు. ఐతే ఇప్పుడు తెలంగాణ రాజకీయం స్మార్ట్‌ రేషన్‌కార్డు వైపు టర్న్‌ తీసుకుంది.

ప్రధాని మోదీ ఫోటో..

ఉచిత రేషన్‌లో ఐదు కిలోలు కేంద్రం కూడా ఇస్తోంది కదా. మరి స్మార్ట్‌ కార్డులో ప్రధాని ఫోటో ఎందుకు ముద్రించలేదని బీజేపీ నేతలు గద్దించారు. ప్రధాని మోదీ ఫోటో వేయాల్సిందే, లేదంటే స్మార్ట్‌రేషన్‌ కార్డులను అడ్డుకుంటామని ఎంపీ రఘునందన్‌ అల్టిమేటమ్‌ ఇచ్చారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కూడా ఘాటు విమర్శలుచేశారు. కాంగ్రెస్‌ది తుమ్మతే పడిపోయేసర్కార్‌ అని ఎద్దేవా చేశారాయన. ప్రజాధనం దుర్వినియోగం కావడమే తప్ప స్మార్ట్‌ కార్డులు ఎందుకూ పనికిరావన్నారు.

Advertisement

Also read: హైదరాబాద్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రాడ్.. రూ. 10 కోట్ల ఆస్తులు స్కామ్‌ చేసిన కేటుగాడు!

78 శాతం రాష్ట్ర ప్రభుత్వం..

ప్రభుత్వం మారితే స్మార్ట్‌ కార్డులు పనైపోతుందన్నారు. సామాన్యులకు చేయూతనిచ్చే స్మార్ట్‌ రేషన్‌ కార్డుపై రాజకీయ రాద్దాంతం సరికాదన్నారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ప్రొటోకాల్‌ ఉల్లంఘణ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. స్మార్ట్‌ కార్డుల పంపిణీ చేపట్టడం సగర్వంగా వుందన్నారు. రేషన్‌లో 78 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఇందులో కేంద్రం వాటా చాలా చిన్నదన్నారు. పైగా స్మార్ట్‌కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ప్రింట్‌ చేసేవి కాబట్టే వాటిపై ప్రధాని ఫొటోలు పెట్టలేదని క్లారిఫై చేశారు మంత్రి ఉత్తమ్‌.

Advertisement

Also read: పంద్రాగస్టు వేళ రచ్చ లేపిన మల్లారెడ్డి.. వైరల్ అవుతున్న మాజీ మంత్రి స్పీచ్!

Tags

Related News

టీజీఎస్పీడీసీఎల్ చరిత్రలో ఊహించని రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ వాడకం?

కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

ఎమ్మెల్సీ బరిలో రాంచందర్ రావు.. అధిష్టానం ఆదేశిస్తే సిద్ధమని లీకులు!

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

Big Stories

Advertisement
×