Bird Flu Effect: చికెన్ రెసిపీ వెరైటీస్ ఓ వందకు పైగా ఉంటాయి. రోజూ గిరాకే. గుడ్లయినా.. చికెన్ అయినా.. స్ట్రీట్ ఫుడ్, హోమ్ ఫుడ్ ఇలా రోజూ చికెన్ లేనిదే చాలా మందికి ముద్దు కూడా దిగదు. అయితే ఇప్పుడు బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ ఫాంలలో కోళ్లన్నీ చనిపోతున్నాయి. దీంతో కొన్నాళ్లు చికెన్‌కు దూరంగా ఉంటేనే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ అప్పుడప్పుడే వస్తుందిగానీ.. గట్టిగా వస్తోంది. దీంతో కోళ్లన్నీ దెబ్బకు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలోని కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూ గట్టిగా పట్టుకుంది. వైరస్ వేగంగా ఒకదాన్నుంచి మరోదానికి వ్యాపిస్తోంది. దీంతో కోళ్లన్నీ ఫినిష్ అవుతున్నాయి. వాటిని గుంతలు తవ్వి పాతి పెడుతున్నారు. శానిటైజ్ చేస్తున్నారు. పరిస్థితి కంట్రోల్ లోకి రావడానికి ఇంకొంత టైమ్ పట్టే అవకాశాలున్నాయి. దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అలర్ట్ పంపింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చికెన్ తినడంపై అలర్ట్ జారీ చేసింది. ఏపీ నుంచి వచ్చే కోళ్లు రాకుండా చెక్ పోస్టులు పెట్టి చెక్ చేసి తిప్పి పంపుతోంది. దీంతో చికెన్ షాపులన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి.
చికెన్ ధరలు కూడా అమాంతం పడిపోయాయి. అయినా చికెన్ కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపడం లేదు. బర్డ్ ఫ్లూ తమ ప్రాంతంలో లేకపోయినా.. సండే వచ్చినా.. చికెన్ కొనడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. సండే రోజు షాపులు ఖాళీగా ఉండడం ఎప్పుడూ లేదని గుర్తుచేస్తున్నారు. సండే కావడంతో నాన్ వెజ్ ప్రియులు జస్ట్ రూటు మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ షాపులకు వెలవెలబోతున్నాయి. అదే సమయంలో మటన్‌కు గిరాకీ పెరిగింది. చేపల కొనుగోళ్లకు సైతం జనాలు ఎగబడ్డారు.
దీంతో చికెన్ షాపులన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ నేఫథ్యంలో ఫిష్‌కు, మటన్ కు గిరాకీ బాగా పెరిగింది. అటు చేపల దుకాణాలు, ఇటు మటన్ షాపుల వద్ద మాంస ప్రియులు క్యూ కట్టారు. బర్డ్ ఫ్లూ సోకి కోళ్ళు చనిపోతున్న ఘటనలతో మాంస ప్రియులు సండే చికెన్ దుకాణాలకు నో చెప్పారు. చికెన్ బదులు ఫిష్, మటన్ షాపుల బాట పట్టారు. దీంతో చికెన్ వ్యాపారస్తులు గిరాకీ లేక దుకాణాల్లో ఖాళీగా కూర్చుంటున్నారు.
Also Read: నాన్ వెజ్ ప్రియులకు పండగే పండగ.. చికెన్ కిలో రూ.40..?
బర్డ్ ఫ్లూ భయంతో చేపల, మాంస వ్యాపారాలు జోరందుకున్నాయి. దీంతో వ్యాపారులు ఒక్కసారిగా రేట్లు పెంచి అందినకాడికి దోచేస్తున్నారు. గతంలో మాంసం కిలో ఏడు నుంచి ఎనిమిది వందలకు పలకగా.. ప్రస్తుతం కిలోపై 50 నుంచి 100 రూపాయల వరకు రేట్లు పెంచేశారు.
కిలో నూట యాభై నుంచి నూట అరవై రూపాయలకు లభించే బొచ్చ, రవ్వ రకం చేపలు.. ఏకంగా రెండు వందల రూపాయలకు ఎగబాకాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో ఫిష్, మటన్ వ్యాపారస్తులు మాంస ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.