E-Paper
Advertisement

రహస్య స్నేహితుడిని కాదని అడుగు బయటపెట్టగలడా…? సొంతంగా బలం నిరూపించుకోవాలనే తండ్లాటే..!

రహస్య స్నేహితుడిని కాదని అడుగు బయటపెట్టగలడా…? సొంతంగా బలం నిరూపించుకోవాలనే తండ్లాటే..!
Advertisement

జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..! సీతారామాశాస్త్రి రాసిన సినీ గేయం అచ్చంగా జగన్‌కు సరిపోతున్నది. ఇటీవల ఆయనను సీపీఐ నేతలు కలవడంతో ఏపీ రాజకీయాల్లో కొత్త పొత్తుల కథలు తెరపైకి వస్తున్నాయి. కూటమి కడుతాడంటూ కహానీలు చక్కర్లు కొడుతున్నాయి.

కానీ జగన్‌ పరిస్థితి తెలిసిన ఎవరైనా.. ఆయన ఒక ఒంటరేనని కచ్చితంగా చెబుతారు. అటు ఇటూ కాకుండా ఉంది ఆయన తాజా రాజకీయ నేపథ్యం. దీనికి తోడు ఆయన వ్యక్తిత్వం కూడ ఒంటరి పోరుకే జై కొట్టేలా ఉంటుంది. అందుకే ఏవేవో ఊహాగానాలు వినిపిస్తున్నా.. అవి ఆచరణలోకి వచ్చేవైతే కావంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Advertisement

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ నేత కె. రామకృష్ణ తదితరులు ఇటీవల జగన్‌ను కలిశారు. వీరు కలిసింది స్థానిక సమస్యలపై కూటమిగా ఏర్పడి ఫైట్ చేయాలనే ఉద్దేశ్యమని పైకి చెబుతున్నా.. ఇండి కూటమిలోకి జగన్‌ను ఆహ్వానించేందుకేననే ప్రచారం జోరుగా సాగింది.

ఇప్పటికే అక్కడ చెల్లి షర్మిల ఏపీ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఇండి కూటమిలోకి అన్నను ఆహ్వానించరు.. అన్న కూడ మొగ్గు చూపరు. ఇక ఇండి కూటమిలోకి చేరే అంశం ప్రస్తావనే ఉండదు. అయితే సీపీఐ నేతల భావన మరోలా ఉంది. ఇప్పుడున్న బలమైన కూటమి సర్కార్‌ను ఎదుర్కోవాలంటే.. ఎవరికి వారే పోటీ చేస్తే సరిపోదనేది వారి వాదన. ప్రతిపక్షాలన్నీ జట్టు కడితేనే.. మహా కూటమిగా ఏర్పడితే .. బాబు కూటమి కోటను కూల్చవచ్చనే అభిప్రాయానికి ఫిక్సయిపోయారు.

Advertisement

కానీ ఏపీ రాజకీయ సమీకరణలు కూటమిగా ఏర్పడేందుకు వీలుగా లేవు. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికున్నాయి. పైగా షర్మిలకే ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలివ్వడం.. ఆమె ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నారో.. అన్నపైనా అదే స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం.. బీజేపీతో జగన్‌ రహస్య దోస్తానా. జగన్‌పై ఉన్న కేసులను బూచిగా చూపి బీజేపీ ఇరుకున పెట్టేందుకు ఎంతో సమయం పట్టదు.

జగన్‌ జుట్టు మోడీ చేతిలో ఉందని ఏపీ రాజకీయాల్లో అందరికీ తెలుసు. నచ్చినా, నచ్చకపోయినా..చచ్చినట్టు ఎన్డీయేకు పరోక్షంగానైనా మద్దతుగా నిలవాల్సిందే. ఇక్కడ ఎన్డీయేకు బాబు, జగన్‌.. ఇద్దరూ దోస్తులే. ప్రజాబలాన్ని ఎవరు ఎలా నిరూపించుకుంటారో అది వీరి సత్తాకు సంబంధించిన అంశం.  అంతిమంగా గెలిచి నిలిచిన వారికి మోడీ సపోర్టు పుష్కలంగా ఉంటుంది.

ఓడినవారూ గప్‌చుప్‌గా ఉండాల్సిందే తప్ప.. ఇండి కూటమి అంటూ తొండికి దిగితే తొక్కెయ్యడానికి అక్కడ కేంద్రం రెడీగా ఉంటుంది. ఆ విషయం బాబు, జగన్‌.. ఇద్దరికీ తెలుసు. అందుకే జగన్‌ ఒంటరిగానే పోరాడి గెలిచి నిలిచి.. మోడీ సపోర్టును తెర వెనుక కాకుండా.. అధికారికంగా తీసుకునేందుకే తహతహలాడుతున్నాడే తప్ప.. కూటములు కట్టి.. పీకల మీదకు తెచ్చుకునే తెలివితక్కువ పనులేమీ చేయడనేది క్లారిటీ..

Tags

Related News

“G9 బొగ్గు అక్కడ.. చెత్త బొగ్గు ఇక్కడ!”.. సింగరేణి దందాను బయటపెట్టిన జగదీశ్వర్ రెడ్డి!

కాంట్రాక్టులు.. కమిషన్లు.. అభివృద్ధి అంటే ఇదేనా? BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్

ప్రజల భూముల విషయంలో ఇదేం పద్ధతి? 22Aపై జగదీశ్ రెడ్డి

భూమి మనదే.. కానీ అమ్ముకోలేం! 22Aపై జగదీశ్ రెడ్డి కీలక కామెంట్స్

మచిలీపట్నంలో హోరెత్తిన వీఆర్ఏ జేఏసీ ధర్నా.. వారి డిమాండ్లు ఇవే!

ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ.. అభ్యర్థి ఎవరంటే?

నాకు వారి నుండి ప్రాణహాని ఉంది.. యరపతినేని శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×