Airtel Plan: ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన రూ.598 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అపరిమిత కాలింగ్, రోజూ డేటాతో పాటు ఉచితంగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తుండటంతో ఎయిర్ టెల్ యూజర్లు దీనిపై ఆసక్తికనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్లాన్ కు సంబంధించిన వివరాలు, రీఛార్జ్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఈ కథనంలో చూద్దాం.
ఈ రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్‌ను 28 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్ టెల్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో వినియోగదారులకు రోజూ 2జీబీ డేటా లభించనుంది. ప్లాన్ పూర్తయ్యే సరికి 56జీబీ డేటాను పొందొచ్చు. దీంతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అర్హులైన యూజర్లకు 5G డేటాను సైతం ఈ ప్లాన్ కింద ఎయిర్ టెల్ అందిస్తోంది.
ఈ ప్లాన్ లో ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్ హైలెట్ గా నిలుస్తున్నాయి. 28 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ప్రీమియంతో పాటు 28 రోజుల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్ కూడా లభిస్తుంది. సాధారణంగా వీటన్నింటికీ విడివిడిగా సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవాలంటే నెలకు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఒక్క రీఛార్జ్‌తో కాలింగ్, డేటాతో పాటు ఉచితంగానే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఎంజాయ్ చేసే వెసులుబాటు కలుగుతోంది.
Also Read: ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!
అయితే రీఛార్జ్ చేసిన వెంటనే ఓటీటీ సర్వీసులు ఆటోమేటిక్‌గా ప్రారంభం కావు. వీటిని పొందడానికి వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్లలో ‘ఎయిర్‌టెల్ థ్యాంక్స్’ యాప్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. యాప్‌లోని బెనిఫిట్స్ సెక్షన్‌కి వెళ్లి అక్కడ ఉన్న సూచనలను పాటిస్తూ ఒక్కో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
Also Read: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!