Chandrababu Warning: దేశ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 134 మంది శాసనసభ్యులతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఆ విజయమే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందంట. అధికారం మనదే కదా అని పలువురు ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంట. తీరు మార్చుకోవాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పినా లెక్క చేయటం లేదంట… దాంతో కొందరిపై వేటు వేస్తే, అందరూ దారిలోకి వస్తారనే నిర్ణయానికి అధినేత వచ్చారనే టాక్ నడుస్తోంది. టీడీపీ బాస్ అలా ఫిక్స్ అయ్యారని తెలియడంతో సదరు ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైందట. అసలు గెలిచి రెండేళ్లు గడవకుండానే చంద్రబాబు అంత సీరియస్ డెసిషన్ తీసుకోవడానికి కారణమేంటి?
2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి పార్టీని, నేతలను సన్నద్దం చేయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకే సమయం దోరికనప్పుడల్లా పార్టీ నేతలు, మంత్రులు, సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అవుతూ మార్గనిర్దేశం చేస్తున్నారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ… లోటుపాట్లను వారికి …ఎలా ముందుకు వెళ్లాలనే విషయాన్ని చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో సీఎం సమావేశాలు నిర్వహించారు. అందులో నేతల పనితీరుకు సంబంధించిన చర్చ ప్రధానంగా జరిగిందంట.
జిల్లాల వారీగా నిర్వహించిన సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలతోపాటు పార్టీ క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిసింది. నేతలతో నిర్వహించిన సమావేశాల్లో సీఎం చంద్రబాబు తాను వారిపై తెప్పించుకున్న సర్వే నివేదికల్లోని అన్ని విషయాలు బహిర్గతం చేశారంట. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మారాల్సి ఉందని… మారకపోతే వారిపై త్వరలోనే చర్యలుంటాయని హెచ్చరించారంట. ఆరు నెలల క్రితం రాష్ట్రంలో సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదని నివేదికలు అందాయని …తాను వారిని పిలిచి హెచ్చరించడంతో 15 మంది దారికొచ్చారని, మిగిలిన వారు వ్యవహరిస్తున్న తీరుపై తన వద్ద నివేదికలు ఉన్నాయన్నారని స్పష్టం చేశారంట. త్వరలో వారిలోని నలుగురైదుగురి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామని, అప్పుడు అందరూ దారిలోకి వస్తారని డైరెక్ట్‌గానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
గ్రౌండ్ లెవల్‌లో ఉన్న పరిస్ధితులపై ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణుల నుంచి సమాచారం సేకరించి…అన్ని విషయాలను క్రోడీకరించుకున్నాకే, ప్రజాప్రతినిధులు పనితీరును అంచనా వస్తున్నట్లు చంద్రబాబు వివరించారంట. 2029ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రజల పట్ల ఎంత కమిట్‌మెంట్ అవసరమో అన్న విషయాన్ని నేతలకు సృష్టంగా వివరిస్తున్న చంద్రబాబు….అందుకు ఎలా వ్యవహారించాలనే అంశాలను కూడా ఎమ్మెల్యేలకు హితబోద చేశారంటున్నారు.
అయితే కొందరు పనితీరులో ఇంకా మార్పు రాకపోవడంపై పార్టీ అధినేతగా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పనితీరును మొరుగుపరుచుకోవాలని ఇప్పటికే చాలాసార్లు సున్నితంగా చేప్పి చూసిన చంద్రబాబు…ఇకపై సీరియస్‌గా వ్యవహారించాలనే భావనకు వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అలాంటి వారిని పిలిచి ఫైనల్‌గా మాట్లాడతానని, పద్ధతి మార్చుకోకపోతే మాత్రం తనతో వారికి అదే చివరి సమావేశం అవుతుందని టీడీపీ బాస్ సంకేతాలు ఇచ్చారంటున్నారు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోపే కఠిన నిర్ణయాలు ఉంటాయని, పనిచేయని వారి స్థానంలో వేరే నాయకులకు బాధ్యతలు అప్పగించి, వారితోనే పని చేయించుకుంటామని చంద్రబాబు మొహమాటం లేకుండా చెప్పేశారంట. ఈసారి పార్టీ గెలుపు ముఖ్యమని, వ్యక్తుల కోసం పార్టీని బలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారట. అవసరమైతే కొంతమందిని వదులుకోనేందుకు కూడా సిద్ధమనే సంకేతాలు పార్టీ నేతలకు ఇచ్చారనేది పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న చర్చ.
కొన్ని ప్రాంతాల్లో కూటమి నేతల మధ్య పొసగపోవడం, ఒకరిపై ఒకరు బహిరంగానే విమర్శలు గుప్పించుకోవడం…..క్షేత్రస్ధాయిలో కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని ఆరోపణలు రావడంతో చంద్రబాబు అలెర్ట్ అవుతున్నారంటున్నారు. సదరు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు చెప్పినా పనితీరు మార్చుకోకుండా, పార్టీ అంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంట. పిలిచి హెచ్చరించడంతో కొందరు వారి ప్రవర్తనను మార్చుకున్నారు కానీ, మరి కొందరు మాత్రం రెక్‌లెస్‌గా వ్యవహరిస్తుండటంతో అధిష్టానం వారిపైన వేటు వేసేందుకు సిద్ధమవుతుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని క్యాడర్ని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడినా, సొంత లెక్కలతో ఇష్టానుసారం వ్యవహరించినా వారిపై తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారట. పార్టీ మరింత బలోపేతమై, ప్రత్యర్ధులకు ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే ..ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ మధ్య సమన్వయం మరింత బలపడాల్సిన అవసరం ఉందని సూచించారట. ప్రజలతో అనుసంధానం పెంచుకోవడం, పార్టీ కార్యకర్తలతో సమన్వయం మెరుగుపరచడం ద్వారా పార్టీకి మరింత బలం పెరుగుతుందని జిల్లా నేతల భేటీల్లో క్లాస్ తీసుకున్నారంట.
ఆ క్రమంలో చంద్రబాబు హిట్ లిస్టులో ఉన్న టీడీపీ నేతలు ఎవరు? వారి విషయంలో పార్టీ అధినేతగా తీసుకునే నిర్ణయాలు పార్టీ లోపలా? బయటా? ఎలా ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిరేపుతున్నాయి. మరి ఇప్పటికైనా పార్టీ లైన్ దాటుతున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, సొంత వ్యవహారాలు పక్కనపెట్టి చంద్రబాబు రూట్లోకి వస్తారో లేదా? అనేది చూడాలి.
Also Read: నెతన్యాహు మృతి చెందారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో వెనుక నిజమెంత?
Story by: Apparao, Big Tv