E-Paper
Advertisement

RV Karnan: ప్రజావాణి ఆర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఆదేశం

RV Karnan: ప్రజావాణి ఆర్జీల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలి..  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఆదేశం
Advertisement

RV Karnan:  ప్రజావాణిలో వచ్చిన ఆర్జీల పరిష్కారానికి అత్యధికంగా ప్రాధాన్యతనివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.  జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ కర్ణన్ , అదనపు కమిషనర్లు, విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 46 ఆర్జీలు వచ్చినట్లు, ఆరు జోన్ల కు సంబంధించి మొత్తం 70 ఫిర్యాదులు, వినతులు పౌరుల నుంచి అందినట్లు అధికారులు వెల్లడించారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు కమిషనర్
ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని, విభాగాల వారీగా వచ్చిన ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణిలో అదనపు కమిషనర్లు రవి కిరణ్, సత్యనారాయణ, విజిలెన్స్ ఏఎస్పీ నరసింహ రెడ్డి, సీసీపీ శ్రీనివాస్ , చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Also ReadHYDRA Warns: హైదరాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొంటున్నారా? హైడ్రా కీలక సూచనలు!

ప్రజా సమస్యలు విన్న ఎంఎంసీ కమిషనర్

Advertisement

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విభాగాల అధికారులు కూడా పాల్గొని సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 22 వినతిపత్రాలు అందగా, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి తక్షణ పరిష్కారం కోసం కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని, వాటి పరిష్కారం వరకు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని కమిషనర్ తెలిపారు. ప్రజావాణిలో అందిన మొత్తం ఫిర్యాదుల్లో ఇంజినీరింగ్ విభాగానికి చెందినవి 4, ఫైనాన్స్ విభాగం 1, రెవెన్యూ విభాగం 2, టౌన్ ప్లానింగ్ విభాగం 10, శానిటేషన్ విభాగం 1, ఐటీ విభాగం 1, యూబీడీ విభాగం 1, యూసీడీ విభాగం 1, విజిలెన్స్ విభాగానికి చెందిన మరో ఫిర్యాదు అందినట్లు, వీటిని పరిష్కరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: Vemula Prashanth Reddy: మహిళలకు రూ. 2500 ఎక్కడ? రూ. 4000 పెన్షన్ పెంపు ఏమైంది? : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×